MeghasandesamSerial Today Episode: భూమి డాబా మీదకు వెళ్లి చంద్రుడిలో శోభాచంద్రను చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అపూర్వ గురించి నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుందని ఏడుస్తుంది. దీంతో మేఘసందేశం ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Continues below advertisement

ఒక్కతే కాళ్లకు గజ్జెలు కట్టుకుని నాట్యం చేస్తుంది భూమి. తనను తాను మర్చిపోయి డాన్స్‌ చేస్తూనే ఉంటుంది భూమి అప్పుడే పైకి వచ్చిన కేపీ చూసి ఆశ్చర్యపోతాడు.

కేపీ: భూమి.. టైం ఎంత అయిందో తెలుసా..?

Continues below advertisement

భూమి: లేదు మామయ్య.. ఆనందంలో టైం కూడా మర్చిపోయాను.

కేపీ: ఆకలి కూడా మర్చిపోయావా..?

భూమి: అమ్మ ఆ చందమామలో కనిపిస్తుంటే.. అంతా మర్చిపోయాను.

కేపీ: తెలుస్తుంది అమ్మా నిన్ను నువ్వే మర్చిపోయావని. బాధలో మనిషి ఏడుస్తాడు. కానీ నిజమైన ఆనందం వేసినప్పుడే మనసు మాట వినదు. ఇలా కూర్చో నీకు నేను తినిపిస్తాను.

అంటూ కేపీ భూమిని కూర్చోబెట్టి భోజనం తినిపిస్తుంటాడు. అన్నం తింటున్న భూమి ఎమోషనల్ అవుతుంది.

భూమి: మామయ్య నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా..? నిజంగా నాకు ఏమీ అర్తం కావడం లేదు మామయ్య. ఇప్పటిదాకా నా గుండెల మీద ఉన్న బండరాయి ఈరోజు కాస్త దిగిపోయినట్టు ఉంది. ఇప్పటి దాకా నువ్వు నా కూతురువి కాదు అన్న నాన్న నన్ను కూతురిగా ఒప్పుకుంటున్నారు. అందరి కూతుర్లలాగానే నేను కూడా మా నాన్నతో నవ్వుతాను. ఆయనతో కబుర్లు చెప్తాను. ఆయన భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాను. మన రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి మామయ్య. బావను నాన్నే తీసుకొస్తాడు. ఏ నాన్న గగన్‌ ను వద్దు అన్నారో అదే నాన్న గగన్‌ నీ జీవితమే అని చెప్తారు. నన్ను కన్న తండ్రిగా నా చేయి బావ చేతిలో పెడతాడు.

కేపీ: భూమి నువ్వు ఎంత ఏడ్చావో ఆ దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు నీ జీవితంలో నవ్వులను రాస్తున్నాడు. నీ మంచితనం నీ ప్రేమ నీ నిజాయితీ ఎప్పుడూ ఓడిపోవు. గెలిచేది నిజమే.. నువ్వే.. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడమ్మ.

అంటూ కేపీ భూమిని ఓదారుస్తాడు. భూమి ఎమోషనల్ అవుతూ.. ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు కిందకు దిగుతూ వస్తున్న శరత్ చంద్ర స్టెప్స్‌ పై నుంచి కింద పడబోతుంటే.. భూమి వెళ్లి పట్టుకుంటుంది.

భూమి: నాన్నా ఏమైంది…?

శరత్‌: తెలియదమ్మా..? కాలు స్లిప్పైంది.

భూమి: అంతే మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడో ఉంది నాన్న. టిఫిన్‌ చేద్దురు కానీ..

శరత్‌: ఆ వద్దమ్మా.. ఆకలిగా లేదు.

భూమి: ఆలోచన ఎక్కువ అయితే ఆకలి చచ్చిపోతుంది అంటారు. కానీ ఆకలి మనిషిని  చంపేంత ఎక్కువ కాకూడదు నాన్న. ఉండండి జ్యూస్ తాగుదురు కానీ

అంటూ భూమి కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్‌ తీసుకొచ్చి శరత్ చంద్రకు ఇస్తుంది.

శరత్: వద్దు అంటున్నాను కదమ్మా..?

భూమి: నాన్న మీరు నన్ను దూరంగా పెట్టిన ప్రతిసారి మీకు ఎలా దగ్గర అవ్వాలని ఎదురుచూశాను. కాలం నా నిజాయితీని గుర్తించడానికి ఒకరి నుంచి దూరం చేసి మీకు దగ్గర చేసింది. ఇష్టమైన మనిషికి దూరంగా ఉండాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. అలాగే మనం బాగా నమ్మిన వారు కూడా మోసం చేస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది నాన్న. ఇప్పుడు నన్ను నమ్మమని చెప్పడం లేదు. నాకు మీరు కావాలని చెప్తున్నాను. అమ్మ చావు వెనక ఉన్న ఆ నిజం తెలుసుకోవడానికి మీకు కాస్త ఓపిక ఉండాలి కదా తాగండి నాన్న.

అంటూ భూమి చెప్తూ.. జ్యూస్ తాగిస్తుంది. దూరం నుంచి చాటుగా అంతా గమనిస్తుంటారు నక్షత్ర, అపూర్వ. నక్షత్ర కోపంగా తండ్రికూతుళ్లు ఒక్కటైపోతున్నారు మమ్మీ అంటుంది. చెప్తా వాళ్ల కథ అంటుంది అపూర్వ. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!