Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌కు గతం గుర్తు చేసేందుకు భాగీ ప్రయత్నిస్తుందని తెలియడంతో మనోహరి కోపంగా బయటకు వస్తుంది. దీంతో నిండునూరేళ్లసావాసం ఇవాళ కొత్త మలుపు తీసుకోనుంది.
అందరూ భోజనం చేస్తుంటే.. అమర్ విచిత్రంగా చూస్తుంటాడు. ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ.. ఉంటే భాగీ మాత్రం భోజనం వడ్డిస్తూ.. తినండి అంటుంది.
అమర్: మీరెవరు..? నాకు ఏమవుతారు..? ఈ పిల్లలందరూ ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం..?
అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..
రాథోడ్: ( మనసులో) భగవంతుడా కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను కూడా సారు గుర్తు పట్టలేకపోతున్నారు
అమర్: చెప్పండి నాకు ఈ ఇల్లు కొత్తగా ఉంది. మీరంతా అపరిచితులుగా ఉన్నారు అంతా అయోమయంగా ఉంది
భాగీ: ఓ రెండురోజులు అయ్యాక మెల్లగా అన్ని విషయాలు చెబుతాం. ఇప్పుడు భోజనం చేయండి.
అమర్: మీ కళ్లల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి.. మీరు ఏడుస్తున్నారా..? మీరు అందరూ ఎందుకు బాధపడుతున్నారు..? ఏం జరిగింది..?
భాగీ: ఏం లేదండి మీరు భోజనం చేయండి
అమర్: సరే మీరు కూడా తినండి
అప్పుడే మనోహరి వచ్చి అమర్‌ను భోజనం చేయకుండా చేయి పట్టుకుంటుంది.
భాగీ: ఏం చేస్తున్నావు మనోహరి తింటున్న ఆయన్ని ఆపేస్తావా..?
మనోహరి: నువ్వు ఏం చేస్తున్నావు భాగీ.. అమర్‌కు ఏం పెడుతున్నావు..
రాథోడ్: సార్ రోజూ ఈ ఫుడ్డే తింటున్నారు కదా మేడం
మనోహరి: ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు.. అమర్ స్పెషల్ ఫుడ్ తినాలి
అమర్: స్పెషల్ ఫుడ్డా..?
మనోహరి: అవును అమర్ నీకోసం స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేశాను. నువ్వు అదే తినాలి. పద అమర్
అమర్: ఒక్కనిమిషం అసలు నేను ఎవర్ని.. నా పేరేంటి..?
మనోహరి: నీ పేరు అమరేంద్ర నువ్వు ఆర్మీలో పెద్ద ఆఫీసర్‌వి..
అమర్: మరి ఈ ఇల్లు ఎవరిది..? వీళ్లంతా ఎవరు..? నాకు ఏమవుతారు..? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నా ఇల్లు నా వాళ్లు ఎక్కడ..?
మనోహరి: నీకు ఏమీ గుర్తు లేదా అమర్
అమర్: లేదు నాకు అంతా అయోమయంగా ఉంది.
మనోహరి: నేను కూడా గుర్తు లేనా..? అమర్
అమర్: మీరు మనోహరి అని నాకు బాగా కావాల్సిన వాళ్లు అని చెప్పారు కదా..?
మనోహరి: ప్రస్తుతానికి నీకు తెలిసిన ఈ రెండు విషయాలు చాలు అమర్.. మిగతా విషయాలు తర్వత చెప్తాను
అమర్: నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఈ ఇల్లు ఎవరిది…? వీళ్లంతా ఎవరు..? నాకు వీళ్లకు ఏంటి సంబంధం…? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..? నాకు ఏం జరిగింది..? నా తల బద్దలయిపోతుంది. పిచ్చిపట్టినట్టు అవుతుంది. తలలో బాగా నొప్పి.. మెదడులో రక్తం పోటెత్తుతుంది..
రాథోడ్: సార్ మీకేం కాదు సార్ కాసేపు రెస్ట్ తీసుకోండి..
అని రాథోడ్, అమర్‌ను రూంలోకి తీసుకెళ్తాడు.
మనోహరి: ఇలా జరుగుతుందనే.. మీరెవరూ..? అమర్ దగ్గరకు రాకూడదని చెప్పాను. ఇప్పుడు చూడండి మీవల్ల అమర్ నరకయాతన పడుతున్నారు. తలలో నరాలు చిట్లిపోయి చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా..?
అంటూ మనోహరి కోప్పడగానే.. భాగీ, పిల్లలు షాక్ అవుతారు. భాగీ కోపంగా మనోహరి ఏం మాట్లాడుతున్నావు.. అంటూ ప్రశ్నించగానే.. అమర్ బాధ్యత నాది ఇక మీరు అందరూ అమర్‌కు దూరంగా ఉండండి అంటూ వార్నింగ్ ఇస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
