MeghasandesamSerial Today Episode: నక్షత్ర హాల్లో కూర్చుని మామిడి పండు తింటుంటే అపూర్వ వస్తుంది. అనుమానంగా చూస్తూ.. చెర్రి మాటల గురించి అడుగుతుంది. దీంతో నక్షత్ర చెర్రిని తిడుతుంది. దీంతో ఇవాళ్టీ మేఘసందేశం చాలా ఆసక్తిగా జరిగింది. అప్పుడే నక్షత్ర ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకొస్తాడు చెర్రి.

Continues below advertisement

చెర్రి: హలో నీ ఫ్రెండ్‌ దివ్య.. నువ్వే కదా నాకు ఫోన్‌ చేసింది. నేనే కదా వచ్చి వాళ్లను కొట్టింది. దీన్ని కాపాడింది. ఇదంతా అబద్దం అని చెప్తున్నారు. నువ్వు చెప్పు నిజం ఏంటో చెప్పు..

దివ్య: అవునా రాత్రి తీసుకెళ్లారా… నక్షత్రానా..? ఎవరు…

Continues below advertisement

చెర్రి: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావే.. నువ్వు కూడా మాట మార్చేస్తున్నావు.. నువ్వు కూడా రాత్రి తాగావా ఏంటి…?

దివ్య: నేను తాగడం ఏంటి..? రాత్రి నీకు ఫోన్‌ చేసిన మాట నిజమే.. కానీ నక్షత్రకు కొంచెం మందు ఎక్కువైంది వచ్చి ఇంటికి తీసుకెళ్లమని చేశాను. కానీ నువ్వేమన్నావు. అది మందు తాగడం కాదు. విషం తాగిన నాకేం సంబంధం లేదు అన్నావు కదా..?

చెర్రి: అయ్యో నేను అనలేదు..

దివ్య: నక్షత్ర నేను వెళ్తాను. నాకు చాలా పనుంది. ఆంటీ నేను వెళ్తాను

అంటూ దివ్య వెళ్లిపోతుంది.

నక్షత్ర: ఏరా అంత మాట అన్నావా..?నువ్వు.. పైకేమో ప్రేమ ప్రేమ అంటావు..?

చెర్రి: నక్షత్ర నీకు దండం పెడతాను. నేను అనలేదు. నాకు అర్థం అయింది. ఇదంతా మీ అమ్మ మేనేజ్‌ చేసింది. అత్తయ్యా నిజం చెప్పండి మీరే కదా దాన్ని కలిసి నాకు నిజం చెప్పకూడదని డబ్బుతో దాన్ని కొనేసి ఉంటారు. లేదంటే మీరు దాన్ని బెదిరించి ఉంటారు.

అపూర్వ: నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురిని నిన్ను కలవనివ్వను. ఈ ఇంట్లో నువ్వు దాని మొగుడివి కాలేవు. అసలు నా కూతురు జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నాను. నీ లాంటి వాడి చేతిలో పడి దాని జీవితాన్ని బుగ్గి కానివ్వను.. పద బేబీ.

అంటూ నక్షత్రను తీసుకుని వెళ్లిపోతుంది అపూర్వ. చెర్రి మాత్రం చూస్తాను అత్తయ్య నీ కూతురును ఇంకెంత కాలం కాపాడుకుంటావో నాకు చిక్కకుండా ఉంటుందా… అనుకుంటూ చెర్రి వెళ్లిపోతాడు. మరోవైపు భూమి, గగన్‌ సునంద ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్లకుండా గగన్‌ గుమ్మం దగ్గరే ఆగిపోతాడు.

భూమి: బావ ఏంటి లోపలికి రాకుండా ఆగిపోయారు…? లోపల మేడం మన కోసం వెయిట్‌ చేస్తుంటారు.

గగన్: ఒక్కనిమిషం ముందు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు.. లోపలికి వస్తాను.

భూమి: నువ్వు లోపలికి వచ్చి ఆ పేపర్ల మీద సంతకం పెట్టు ఆ తర్వాత నేను ఈ పేపర్ల మీద సంతకం పెడతాను.

గగన్‌: ఏంటి నా మీద నీకు నమ్మకం లేదా..?

భూమి: నా మీద నీకు నమ్మకం లేదా..?

గగన్‌: సరే పదా

భూమి: బావ ఆవిడ గొప్ప డాన్సర్‌ మాత్రమే కాదు అఫిలియేషన్‌ మెంబర్‌ కూడా..  మనం చాలా అన్యోన్యంగా ఉన్నామని చెప్పాను. ఆవిడకు అనుమానం వచ్చేలా ప్రవర్తించకు

అంటూ గగన్‌ చేతులు పట్టుకుని భూమి రిక్వెస్ట్‌ చేస్తుంది.  గగన్‌ మాత్రం అఇష్టంగానే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లినా కూడా భూమి, గగన్‌ చేయి వదలదు.. లోపలికి వెళ్లి సునందను పిలుస్తుంది భూమి. సునంద రాగానే గగన్‌ను పరిచయం చేస్తుంది భూమి. భూమి, గగన్‌లను చూసిన సునంద మీ జంట చాలా బాగుంది అనగానే.. భూమి తమ గురించి ఏవేవో చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!