MeghasandesamSerial Today Episode: ఫుల్లుగా తాగిన నక్షత్రను కారులో తీసుకుని ఇంటికి వస్తాడు చెర్రి. కారు దిగి ఇంట్లోకి రమ్మని చెప్తాడు చెర్రి. దీంతో ఇల్లు అప్పుడే వచ్చిందా..?  అంటూ నక్షత్ర అడగ్గానే.. అవును వచ్చింది లోపలికి వెళ్దాం పద అంటాడు. దీంతో నన్ను నడిపిస్తావా..? చెర్రి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లు అంటుంది. దీంతో చెర్రి నక్షత్రను ఎత్తుకుని ఇంట్లోకి వెళ్తుంటే.. సుజాత చూస్తుంది. దీంతో ఇవాళ్టీ మేఘసందేశం సీరియర్‌ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

సుజాత: అమ్మాయి, అమ్మాయి.. త్వరగా వచ్చేయ్ అమ్మాయి.. కొంపలు అంటుకున్నాయి..

అపూర్వ: అబ్బా పిన్ని ఏమైంది కంఠం తెగిన కాకిలా అరుస్తున్నావేంటి..? ఎవరి కొంప అంటుంకుంది.

Continues below advertisement

సుజాత: మన కొంపే అమ్మాయి.. అదిగో అటు చూడు.. అటు చూడు..

చెర్రి, నక్షత్రను ఎత్తుకుని వస్తుంటాడు. అది చూసి అపూర్వ షాక్‌ అవుతుంది.

సుజాత: ఇదేంటి అమ్మాయి ఇది కలా నిజమా..? మన నక్షత్ర ఏంటి వాడి చేతుల్లో కొంపదీసి ఇద్దరు కలిపిపోయారేమో 

అపూర్వ: నువ్వు నోరు మూయ్‌ పిన్ని.. అలాంటి రోజు వస్తే వీళ్లిద్దరినీ గంగలో తోసేస్తాను. ఒరేయ్‌ దిపరా..?

నక్షత్ర:  నేను దిగను.. చెర్రి నువ్వు దించొద్దు లోపలిక వెళ్దాం పద.

అపూర్వ: నక్షత్ర నవ్వేనా ఇలా మాట్లాడుతుంది. ముందు వీడి మీద నుంచి దిగు.

నక్షత్ర: తప్పేంటి మమ్మీ.. తను నా హార్ట్‌ హబ్బీ..నేను తన స్వీట్‌ వైఫ్‌.. నా మొగుడు నన్ను ఎత్తుకోవడం తప్పా..?

అపూర్వ: అబ్బా.. ఏం మాట్లాడుతున్నావే నువ్వు.. ముందు దిగు నక్షత్ర. 

నక్షత్ర: నేను దిగను. నేను ప్రమాదంలో ఉంటే చెర్రి సమయానికి వచ్చి నన్ను కాపాడాడు మమ్మీ. చెర్రి లేకపోతే ఇప్పుడు నేను ఉండేదాన్నే కాదు. చెర్రి నువ్వు నన్ను దించావంటే నా మీద ఒట్టు. మనల్ని చూసి మా మమ్మీ కుల్లుకుంటుంది. మనం మన గదిలోకి వెళ్దాం పద.

చెర్రి: ఒకే అత్తయ్యా కొంచెం సైడ్‌ ఇస్తారా..?

సుజాత: అమ్మాయి మన అమ్మాయికి బాగా ఎక్కేసినట్టు ఉంది.

అపూర్వ: నువ్వు నోరుమూయ్‌.. చెర్రి ముందు దాన్ని దించరా..? దించు..

చెర్రి: ఏంటి అత్తయ్య మామయ్యను పిలవమంటారా..? అప్పుడు నక్షత్ర తాగి ఉందన్న విషయం మామయ్యకు బాగా అర్థం అవుతుంది. అప్పుడు మామయ్య నక్షత్రను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా తిడతాడు ఇలా పెంచినందుకు. ఇప్పుడు నా భార్య, భర్త విలువ అంటే నా విలువ తెలుస్తుంది.

నక్షత్ర: అవును తెలుసుకున్నాను.

చెర్రి: నాతో కలిసిపోయిందని అర్తం

నక్షత్ర: అవును కలిసిపోయాను.

చెర్రి: మమ్మల్ని చూసి కుళ్లుకోకండి అత్తయ్య..

నక్షత్ర: చెర్రి పదా వెల్దాం..

చెర్రి: వెళ్దాం నక్షు.. వెళ్దాం..

అపూర్వ: చీ వాణ్ని వదలమని చెప్పు పిన్ని..

సుజాత: వాణ్నే మన నక్షత్ర వదిలేలా లేదు అమ్మాయి. వెళ్లనివ్వు వయసులో ఉన్నారు కదా..?

అంటూ చెప్తుండగానే.. అప్పుడే భూమి అక్కడకు వస్తుంది.

చెర్రి: భూమి ఏదేమైనా ఈ క్రెడిట్‌ అంతా నీదే భూమి. నువ్వు చెప్పకపోయి ఉంటే నేను వెళ్లి ఉండేవాణ్‌నే కాదు. నా నక్షత్ర దృష్టిలో హీరోను కాకపోయేవాణ్ని. థాంక్యూ భూమి.

భూమి: ఆల్‌ ద బెస్ట్‌ చెర్రి. మిమ్మల్ని ఇలా చూడాలనేదే మా కొరిక. ఇప్పటికైనా నిన్ను నక్షత్ర అర్థం చేసుకుంది.

అంటూ చెప్పగానే.. నక్షత్ర మత్తుగా అలాగే ఉంటాము.. చెర్రి పదా అంటుంది. చెర్రి అత్తయ్యా కొంచెం సైడు ఇస్తారా..? అంటూ నక్షత్రను తీసుకుని లోపలికి వెళ్తాడు. అపూర్వ షాకింగ్‌ గా చూస్తుంటుంది. వీళ్లిద్దరిని విడదీయాలని నేను చూస్తుంటే.. అది వాన్ని వెనకేసుకొస్తుంది ఏంటి..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!