Meghasandesam Serial Today Episode : ఇంటికి వచ్చిన భూమిని తన మీద ఒట్టేసి నిజం చెప్పమని శరత్ చంద్ర అడగ్గానే.. భూమి ఆలోచిస్తుంది. దీంతో అపూర్వ రెచ్చిపోతుంది. ఇది నీ మీద ఒట్టేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది బావ అంటూ శరత్చంద్రను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

అపూర్వ: ఇన్ని అబద్దాలు చెప్పి నీ మీద ఒట్టేసి ఇంకో అబద్దం చెప్పడం దీనికి కష్టమేం కాదు. కానీ నేను వదలను కదా..? నీ మీద ఒట్టేసి నేను గగన్‌ దగ్గర పని చే యడం లేదని చెబితే అప్పుడు నేను గగన్‌ మీద ఒట్టేసి నిజం చెప్పమంటాను కదా..? ఇది గగన్‌ మీద ఒట్టేసి అబద్దం చెప్పలేదు. ఎందుకంటే ఇది గగన్‌ గాడిని గాఢంగా ప్రేమిస్తుంది కనక. ఇది చాలా తెలివైంది బావ. గగన్‌ మీద ఒట్టేసేంత వరకు వెళ్లకుండా.. నీ దగ్గరే ఆగింది. ఆ గగన్‌ గాడితో ఇది చేతుల కలిపి. నిన్ను నేల మీదకు లాగేయాలని చూసింది. అందుకే ఇది ఈ ఇంట్లోనే ఉండాలని ప్లాన్‌ చేసింది.

భూమి: కాదు.. అబద్దం అంతా అబద్దం.. నిజం కాదు..

అపూర్వ: నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఏం నువ్వు ఆ గగన్‌ గాడిని ప్రేమించడం నిజం కాదు. పైగా దీన్ని వాడు ప్రేమించాను అంటూ రావడం. ఇదేమో కాదనడం. ఇదంతా నీ మనసును చెడగొట్టడానికి ఆ గగన్‌ గాడితో ఇది కలిసి ఆడిన డ్రామా బావ. నీ మనసు చెదిరితే బిజినెస్‌ మీద మనసు లగ్నం కాదు. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మన బిజినెస్‌ సీక్రెట్‌ తెలిస్తే నిన్ను నేలమీదకు లాగి.. ఆ గగన్‌ గాడిని ఆకాశంలోకి ఎక్కించి అప్పుడు వాళ్లిద్దరూ కలిసి నిన్ను చూసి వికటాట్టహాసం చేయాలనుకుంటున్నారు బావ.

భూమి: లేదు మీకు దండం పెడతాను. అంత పెద్ద పెద్ద నిందలు నా మీద వేయకండి. ఏ కూతురు తన తండ్రి నేల మీద పడిపోవాలని కోరుకోదు.

అపూర్వ: నోరు మూయ్‌ ఇంకొక్కసారి నీ నోట్లోంచి నాన్నా అన్న మాట వస్తే నాలుక చీరేస్తాను. ఆ గగన్‌ గాడిని నువ్వు ప్రేమించావన్నది  నిజం కాదా..?

భూమి: నిజమే.. నేను గగన్‌ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.

అపూర్వ: చూశావా.. బావ..

శరత్: భూమి నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించాను. అయిన వాళ్లందరినీ నీ తర్వాతే అనుకున్నాను. చివరికి నా రక్త సంబంధాన్ని కూడా నీకోసం వదులుకోవడానికి సిద్దపడ్డాను. నన్ను మోసం చేయాలని ఎలా అనుకున్నావమ్మ. సరే నేను కలవక ముందే వాడు నిన్ను మాయ చేసి ప్రేమలో పడేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఉన్నానమ్మా.. నేను ఉన్నాను. వాడిని మర్చిపో.. నాతో రామ్మా..?

అంటూ భూమి చేయి పట్టుకుని శరత్ చంద్ర తీసుకెళ్లబోతుంటే.. భూమి వెళ్లద్దు. దీంతో శరత్‌ చంద్ర కోపంగా భూమి చేయి వదిలేసి చివరగా ఒక్క ప్రశ్న అంటూ నీకు నేను కావాలా..? ఆ గగన్‌ కావాలా అని అడుగుతాడు. తనకు గగన్‌ అంటే చాలా ఇష్టమని చెప్తుంది భూమి. దీంతో భూమిని ఇంట్లోంచి వెళ్లమని శరత్ చంద్ర చెప్తాడు. భూమి బయటకు వెళ్లిపోతుంది. భూమిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన విషయం శారదకు తెలస్తుంది. గగన్‌ ఇంటికి రాగానే శారద ఏడుస్తూ వెళ్లి విషయం చెప్తుంది.

శారద: గగన్‌ భూమిని నువ్వు వెంటనే వెళ్లి వెతికి తీసుకురావాలిరా..?

గగన్‌: భూమిని నేను వెతికి తీసుకురావడం ఏంటి..? తను ఆ శరత్ చంద్ర ఇంట్లో హాయిగా ఉంది.

శారద: లేదురా భూమిని వాళ్లు బయటకు పంపించివేశారు. నీ ఆఫీసులో భూమి పని చేస్తుందని ఆ శరత్ చంద్రకు తెలిసింది. నిన్ను ప్రేమిస్తుందని అర్థం చేసుకుని బయటకు వెళ్లిపోమ్మన్నారట. భర్తగా నాకు గగనే కావాలని చెప్పిందటరా..?

అంటూ శారద చెప్పగానే… గగన్‌ ఎమోషనల్‌ అవుతాడు. ఎలాగైనా నా భూమిని నేను తెచ్చుకుంటాను అంటూ గగన్‌ బయటకు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!