Meghasandesam Serial Today Episode: విడాకుల పేపర్స్‌ మీద గగన్‌ బలవంతంగా కేపీతో సంతకం చేయించాలని చూస్తాడు. కేపీ చేయడు. తిరిగి గగన్‌ను కొడతాడు. దీంతో అందరూ షాక అవుతారు. గగన్‌ కోపంగా చూస్తుంటాడు.

కేపీ: తెంపుకుంటే బంధాలు తెగిపోతాయా..?

గగన్‌: తెగిపోతాయి..

కేపీ: కాసేపు నేను ఈ పేపర్స్‌ మీద సంతకం పెట్టాను అనుకుందాం. కోర్టు నాకు మీ అమ్మకు విడాకులు మంజూరు చేసింది అనుకుందాం. అంటే మేము ఇద్దరం విడిపోయినట్టే కదా..? అలాంటప్పుడు మన మధ్య బంధం తెగిపోయినట్టే కదా..? నేను నిన్ను తిరిగి కొట్టాను కదా..? నువ్వు తిరిగి నన్ను కొట్టరా..? కొట్టు తెంపుకుంటే తెగిపోయే బంధాలు కాదురా..? బజారులో వస్తువులు

అంటూ విడాకుల పేపర్స్‌ చింపేసి కేపీ వెళ్లిపోతాడు. మరోవైపు సాధన కోపంగా భూమి చేసిన అవమానం గుర్తు చేసుకుని రగిలిపోతుంది. ఇంతలో అక్కడకు అపూర్వ వస్తుంది.

సాధన: రండి మీ కోసమే ఎదురుచూస్తున్నాను. మీరేదో గొప్పోళ్లని డబ్బులు ఇచ్చాను కదా ఎందుకు ఇచ్చనా అనుకుంటూ బాధ పడుతున్నాను.

సుజాత: అదేంటి అమ్మాయి నువ్విచ్చిన డబ్బులతో మా అమ్మాయి ఏదో కోటలు కట్టినట్టు అంటున్నావు. మేమేమైనా దేహి అంటే ఇచ్చావా..? నీకు అవసరం అయి ఇచ్చావు.

సాధన: ఇచ్చాను మరి మీరు ఏం చేస్తున్నారు.

అపూర్వ: సాధన పొగరుకు ప్రతిరూపాన్ని నేను నా ముందే ఇంకొకరు పొగరుగా మాట్లాడుతుంటే నేను అసలు తట్టుకోలేను. నేను నా పొగరు చూపిస్తే అసలు తట్టుకోలేను. విషయానికి రా

సాధన: ఓ మీకు ఈ చిన్న విషయం కూడా తెలియదన్నమాట. డాన్స్‌ అకాడమీకి మీ ఆయన్ని భూమి ఒప్పించింది.

అపూర్వ: తెలుసు..

సాధన: తెలుసా..? తెలిసే ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారా..? అవునులే ఆవిడ డాన్స్‌ అకాడమీ పెడితే మీకు పోయేదేముంది. ఇక్కడ డాన్స్‌ అకాడమీ పెట్టుకున్న నేను అడుక్కు తినాలి.

సుజాత: అడుక్కుంటే.. ఇక్కడ అబిడ్స్‌లో ఎక్కువ కలెక్షన్‌ ఉంటుందా..? అక్కడ జగదాంబ సెంటర్‌లో ఎక్కువ ఉంటుందా..?

సాధన: నా సిచ్యుయేషన్‌ మీకు కామెడీలా అనిపిస్తుందా

సుజాత: లేదు సీరియస్‌ గానే అనిపిస్తుంది.

అపూర్వ: పిన్ని కూడా కరెక్టు గానే అంది కదా సాధన. ఆ భూమి ఉన్న ఆస్థి అంతా డాన్స్‌ కే కరిగించేస్తే మేము అడుక్కు తినాలి. నీ కంటే ఎక్కువ నష్టం నాకే. కనక దాన్ని అకాడమీ పెట్టకుండా ఆపాల్సిన అవసరం నాకే ఎక్కువ. అవసరం అయితే దాన్ని లేపేస్తాను.

సాధన: మీరిలా మాట్లాడుతుంటే నాకు ధైర్యంగా ఉంది. అమ్మను చంపిన చేతితో కూతురును చంపటం లెక్కా..?

అంటూ మీ మీద నమ్మకంతోనే డాన్స్‌ అకాడమీ ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది సాధన. తర్వాత శారద దగ్గరకు వెళ్లిన కేపీ కోపంగా మాట్లాడుతుంటాడు.

కేపీ: ఇన్నాళ్లు నా  కొడుకు పక్కన నిలబడే అవకాశం కూడా నాకు దక్కలేదు. కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా ఆ అవకాశం నాకు దక్కనివ్వు శారద.

శారద: దక్కదు. మీరు తండ్రిగా వాడి పెళ్లిలో నిలబడతాను అంటే అసలు ఈ పెళ్లే జరగదు.

కేపీ: ఏంటీ నేన తండ్రిగా పెళ్లిలో నిలబడితే ఈ పెళ్లే జరగదా..? సరిగ్గా వాడి పెళ్లికి ముందే ఈ కండీషన్‌ ఎందుకు పెట్టాడు శారద.

శారద: కండీషన్‌ పెట్టింది వాడు కాదండి..

కేపీ: వాడు చెప్పలేదు. నీకు ఇష్టం లేదు మరి ఎవరు చెబితే ఈ నిర్ణయం తీసుకున్నావు

అని కేపీ గట్టిగా అడగ్గానే శారద ఏడుస్తూ అసలు నిజం చెప్తుంది. ఈ కండీషన్‌ పెట్టింది శరత్‌ చంద్ర, అపూర్వ అని చెప్పగానే కేపీ షాక్‌ అవుతాడు. వాడి పెళ్లి కోసం నాకు విడాకులు ఇవ్వండి అని శారద వేడుకుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!