గుండెనిండా గుడిగంటలు జూన్ 16 ఎపిసోడ్
పార్లర్ అమ్మేసి కూడా ఉందని అబద్ధం చెప్పి ఇంట్లో నెట్టుకొస్తున్న రోహిణి గుట్టు బయటపడింది. బాలుకి తెలిసినా సత్యం కారణంగా నిజం బయటపెట్టకుండా ఆపుతూ వచ్చాడు. కానీ నేరుగా మనోజ్ పార్లర్ కి వెళ్లి క్వీన్ బ్యూటీ పార్లర్ అనే బోర్డ్ చూసి షాకవుతాడు. ఇదేంటని అడిగితే ఫ్రాంచైజీకి ఇచ్చానని మరో అబద్ధం చెబుతుంది రోహిణి. అయితే సూపర్..బిజినెస్ బాగా పెరుగుతుంది మనకు మరిన్ని డబ్బులొస్తాయని కంగ్రాట్స్ చెబుతాడు మనోజ్. అదే ఆనందంలో ఇంటికెళ్లి అసలు విషయం బయటపెట్టేస్తాడు. రోహిణి గురించి గొప్పగా చెబుతాడు. అందరి ముందూ కక్కలేక మింగలేక రోహిణిని సపోర్ట్ చేసిన ప్రభావతి..లోలోపలే రగిలిపోతుంటుంది.
ఎవరి రూమ్స్ లోకి వాళ్లు వెళ్లిన తర్వాత నేరుగా రోహిణి దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది ప్రభావతి. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది. చెబుదాం అనుకున్నా అత్తయ్యా అని కవర్ చేసేందుకు రోహిణి ప్రయత్నించినా ప్రభావతి కళ్లలో నీళ్లు పెట్టుకుంటూనే కోపంగా విశ్వరూపం చూపిస్తుంది. ఇదొక్కటేనా ఇంకా ఏమైనా దాచావా అని గొంతు పట్టుకుంటుంది. తన పని ఇవాల్టితో అయిపోయిందని విలవిల్లలాడుతుంది రోహిణి. మరోవైపు మలేషియా పేరు చెప్పి కూల్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ మలేషియా పేరు చెబితే తగ్గుతా అనుకుంటున్నావా అని ఇచ్చిపడేస్తుంది. అయిపోయింది అంతా అనుకుంటుంది రోహిణి. ఈ గొడవంతా హాల్లో కూర్చుని కూరగాయలు కట్ చేసుకుంటున్న మీనా వింటుంది.
మరోవైపు తన స్నేహితుల కోసం కారు అమ్మేస్తాడు బాలు. ఆటో నడుపుకోవడంతో ఆరోగ్యంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతోందని మీనా బాధపడుతుంది. పూలు అమ్మగా వచ్చిన డబ్బులతో కారు కొనివ్వాలని ప్లాన్ చేసుకుంటుంది. బాలు స్నేహితుడు రాజేష్ ని కలసి బాలుకి కారు కొనాలి అనుకుంటున్నా అని చెప్పి కన్సల్టెన్సీకి వెళ్లి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంది. అయితే పూలమ్మినిన డబ్బంతా పుట్టింటికి దోచిపెట్టిందని ప్రభావతి ఫైర్ అవుతుంది. నిందలేస్తుంది..బాలు, సత్యం, రవి, శ్రుతి మీనాను సపోర్ట్ చేయడంతో నోరు మూసేస్తుంది ప్రభావతి.
రోహిణి అంత మోసం చేసినా కానీ ప్రభావతి సపోర్ట్ చేసిన తీరు చూసి సత్యం,బాలు షాక్ అవుతారు. చూశావా నాన్నా పార్లలమ్మ ఎంత పెద్ద తప్పు చేసినా పల్లెత్తు మాట కూడా అనలేదు..కానీ మీనాపై ఎలాంటి కారణం లేకుండా విరుచుకుపడుతుంటుందని అంటాడు. బయటకు అలా కవర్ చేసింది కానీ లోలోపల మీ అమ్మకు కాలిపోతుంటుంది. ఆ మంట నెమ్మదిగా ఎలా బయటపడుతుందో చూడు అని చెబుతాడు సత్యం. సత్యం చెప్పినట్టే రోహిణి రూమ్ కి వెళ్లి ప్రభావతి నిలదీసింది ప్రభావతి. పైగా రోహిణి తన పేరు తీసేసింది అనే బాధకన్నా బాలు, మీనా తనను చులకనగా చూస్తారనే బాధే ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ ఎఫెక్ట్ రోహిణిపై పడింది.
అయితే రోహిణిని ప్రభావతి నిలదీసినదంతా రోహిణి కలా? లేదంటనే నిజంగా జరిగిందా? మరి మొత్తానికి రోహిణి ఇప్పటికైనా తన డ్రామాకు చెక్ పెడుతుందా? మరో కొత్త కథ అల్లి ప్రభావతిని మభ్యపెడుతుందా? ఇంకా మనోజ్ ని మోసం చేస్తూ తను మోసపోతూ ఉంటుందా? మీనా కారు కొన్న సంగతి బయటపడిన తర్వాత ప్రభావతి రియాక్షన్ ఏంటి? ఇవన్నీ వచ్చే వారం ఎపిసోడ్స్ లో హైలెట్ గా నిలవబోతున్నాయ్.