Meghasandesam Serial Today Episode: గగన్‌, భూమితో డాన్స్‌ అకాడమీ పెట్టించడానికి ఎలాగైనా శరత్ చంద్రను ఒప్పిస్తానని చెప్తాడు. చూద్దామని భూమి అంటుంది. నువ్వు ఏదైనా మాట్లాడితే చివరకు అకాడమీ ఊసే ఎత్తనీయడు నాన్న అని చెప్తుంది. సరే చూద్దాం అంటాడు. ఇద్దరూ కిందకు వచ్చాక గగన్‌ తీసుకొచ్చిన పేపర్స్‌ భూమికి ఇస్తూ ఇందులో ఒక సంతకం పెట్టు అంటాడు. ఎందుకని సుజాత అడగ్గానే భూమి పేరు మీద ఉన్న ఆస్థి నా పేరు మీదకు రాయించుకుంటున్నాను అని చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. నేను డాన్స్‌ అకాడమీ పెట్టాలి అందుకోసం ఆస్థి కావాలి అని భూమి చెప్తుంది. డాన్స్‌ అకాడమీ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకు నేను ఒప్పుకోను  అని గగన్‌ చెప్తాడు.

శరత్‌: ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు..? నేను ఒప్పుకుంటున్నాను.

సుజాత: అయ్యో అమ్మాయి భూమితో పాటు లోపల వీడేసిన స్కెచ్‌ ఇది. అర్థం అవుతుందా..?

అపూర్వ: అర్తం అవుతుంది పిన్ని నాక్కూడా

శరత్‌: నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకో లేదా మానేయ్‌. అంతే కానీ నా శోభాచంద్ర ఆశయాలను భూమి ఇష్టాలను నీ గుప్పిట్లోకి తీసుకుని నలిపేయకు.

గగన్‌: అయ్యో శరత్‌ చంద్ర మామయ్యగారు ఎందుకు అంతలా కోప్పడుతున్నారు. ఏదో తెలియక ఆస్థి నా పేరు మీద మార్చుకోవాలనుకున్నాను. అయితే మీరు డాన్స్‌ అకాడమీ పెట్టడానికే నిర్ణయించుకున్నారా..?

శరత్‌: అవును నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే నా నిర్ణయం.

గగన్‌: నీ నిర్ణయం కూడా ఇదేనా భూమి

భూమి: అవును బావ..

శరత్‌: భూమి ఆ డాన్స్‌ అకాడమీ ఏర్పాట్లేవో చూడు డబ్బులు నేని ఇస్తాను.

అంటూ శరత్‌ చంద్ర చెప్పి వెళ్లిపోతాడు. దీంతో భూమి హ్యాపీగా గగన్‌ను హగ్ చేసుకుంటుంది. అపూర్వ, సుజాత ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంటారు. పక్కకు వెల్లి బాధపడుతుంటారు.

సుజాత: అదేంటి అమ్మాయి ఆ గగన్‌ గాడి ప్లాన్‌ అడ్డుకోలేక ఆ డాన్స్‌ అకాడమీని ఆపలేక పిసుక్కున్న చేతులకు రావాల్సిన నొప్పి తలకు వచ్చిందా..?

అపూర్వ: పిన్ని అసలే తలపోటులో బాధపడుతున్నాను. దానికి తోడు నీ మాటలు ఒక పోటు పొడిచానంటే పోతావు.

సుజాత: నీతో పొడిపించుకోవాల్సిన అవసరం నాకేంటి అమ్మాయి.

మీరా: వదిన.. వదిన..

అపూర్వ: ఏంటి మీరా..?

మీరా: ఇందు వాళ్ల ఇంటికి వెళ్తా అంటుంది. అక్కడికి వెళ్లాక మళ్లీ ఆ శారద ఇంటికి వెళ్తానంటుందేమో కొంచెం గట్టిగా చెప్పు వదిన.

అపూర్వ: పిలువు ఇక్కడకు తీసుకురా..?  ఏంటి ఆ ఇంటికి వెళ్తున్నావా..? పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో తాట తీస్తా..

అంటూ అపూర్వ వార్నింగ్‌ ఇవ్వగానే.. ఇందు వెళ్లిపోతుంది. తర్వాత గగన్‌ ను తీసుకుని పైకి గదిలోకి వెళ్లిపోతుంది భూమి.

భూమి: నువ్వు సూపర్‌ బావ.. ఇంత షార్ప్‌ బ్రెయిన్‌ ఉన్నవాడు దొరకడం నా అదృష్టం బావ. నువ్వు కేక బావ

గగన్‌: భోజనం చేసి వెళ్దువు కానీ ఆగవా..? అంటే నీతో కలిసి తినొచ్చు అనుకున్నాను. నువ్వె పెట్టే భోజనం ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు సుమీ.. ఆ సిగ్గుతో నాకొక ముద్దు ఇచ్చుకో..

భూమి: బావ…

గగన్‌: ఈ సిగ్గుతోనే..

 అంటూ గగన్‌, భూమిని కిస్‌ చేయబోతుంటే. నక్షత్ర వస్తుంది. గట్టిగా బావ అంటూ కేకలేస్తుంది. దీంతో భూమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నక్షత్ర దగ్గరకు వెళ్లి గగన్‌ ముఖానికి అంటిన భూమి లిప్‌స్టిక్‌ తుడుస్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!