Meghasandesam Serial Today Episode: ఇందు దగ్గరకు వెళ్లిన మీరా గగన్ కుటుంబాన్ని తిట్టి నాకు అందరినీ దూరం చేస్తున్న వాళ్లు బాగుపడరని నాశనం అయిపోతారని ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇందు బాధపడుతుంది. మరోవైపు గగన్ దగ్గరకు వెళ్తాడు చెర్రి
చెర్రి: అన్నయ్యా నీకో బాడ్ న్యూస్ ..
గగన్: అల్‌రెడీ అమ్మ చెప్పింది. పెళ్లి అయ్యేంత వరకు నేను భూమిని కలవకూడదు అంతే కదా..?
చెర్రి: అది కాదు అన్నయ్యా ఇది అంతకంటే బ్యాడ్ న్యూస్
గగన్: ఏంట్రా అది..
చెర్రి: పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని మామయ్య చెప్పమన్నారు. భూమిని నువ్వు కొట్టబోయావంట కద అన్నయ్యా ఆ విషయం తెలిసి మామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
గగన్: భూమి ఏమంది..?
చెర్రి: ఏమంటుంది అన్నయ్యా సరే నాన్నా మీ ఇష్ఠం అని చెప్పింది.
గగన్: నో వే భూమి అలా చెప్పదురా.. చెప్పిందంటే నేను నమ్మను.
చెర్రి: అంటే మీ ఉద్దేశంలో మామయ్య కంటే నువ్వే ఎక్కువ అని ఫీల్ అవుతున్నావా.? అదే నిజం అయ్యుంటే తనని నువ్వు తీసుకెళ్లడానికి వచ్చిన మొదటి రోజే నీతో వచ్చేసి అన్నయ్య. అసలు ఫస్ట్ ప్రిపరెన్స్ అనే పదం వస్తే తనకు నువ్వు కాదు అన్నయ్యా తనకు వాళ్ల నాన్నే కావాలి.
అని చెర్రి చెప్పగానే.. ఇంతకు ముందు శరత్ చంద్ర కోసం భూమి తీసుకుని నిర్ణయాలు గుర్తు చేసుకుంటాడు. గగన్.
గగన్: కేవలం కోపంతో చెయ్యి ఎత్తినందుకే తన నాన్నా ఇష్టం అని చెప్పింది. అరేయ్ ఇన్నాళ్లు నా ప్రేమ తనకు కనిపించలేదా..?
చెర్రి: కనిపించింది అన్నయ్యా..? కనిపించింది కనుకే సీరియస్ గా నువ్వు వెళ్లిపోయాక ఏమైంది అని మామయ్య అడిగితే మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ థింక్ అని కవర్ చేసింది. అసలు భూమి నిజం చెప్పేసి ఉంటే ఏం జరిగేదో నీకు తెలియడం కోసమే పెళ్లి ఆగిపోయిందని నేను అబద్దం చెప్పాను. ఈ పెళ్లి ఆగిపోయింది అంటేనే నీ కంట్లో కన్నీళ్లు తిరిగాయే ఒకవేళ అదే నిజం అయితే అక్కడ భూమి ప్రాణం పోతుంది. అంతగా నిన్ను ప్రేమించింది అన్నయ్యా.. ఒక చిన్న విషయానికే కొట్టేయాలా అన్నయ్యా.. ప్రేమగానే ఇది జరగదు అని చెప్పేయొచ్చు అన్నయ్య.
గగన్: రేయ్ ఇన్నాళ్లు అల్లర చిల్లరగా తిరిగే చిన్న పిల్లవాడిని నీలో చూశానురా.. అప్పుడే ఎంత మెచ్యూర్ అయిపోయావురా..? నేను భూమి మీద కోప్పడకుండా ఉండాల్సింది. కొట్టాలన్న ఆలోచనతో ఈ చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది. తను నిజంగా గొప్పదిరా.. తను దేవతరా ఒక్క నిమిషం ఉండు నేను ఇప్పుడే తనకు కాల్ చేసి మాట్లాడతాను.
అంటూ గగన్ భూమికి కాల్ చేస్తాడు. గగన్ కాల్ చేయడం చూసిన భూమి కోపంగా కట్ చేస్తుంది. పదే పదే కాల్ చేయడంతో భూమి లిఫ్ట్ చేస్తుంది. గగన్ సారీ చెప్తాడు. తర్వాత నీ ఎయిమ్ కోసం నేను నిలబడతాను అంటూ చెప్పి ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అంటూ వెళ్తాడు. ఇంటికి వెళ్లిన గగన్ భూమికి కొన్ని పేపర్లు ఇస్తాడు.
గగన్: ఈ అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టు
సుజాత: అగ్రిమెంట్ ఏంటి బాబు
గగన్: ఈ ఆస్తికి సంబంధించిన అగ్రిమెంట్స్ గోరింటాకు. నా పేరు మీదకు మార్చుకుందామని సంతకం తీసుకుంటున్నాను. సంతకం పెట్టేయ్ భూమి.
భూమి: అమ్మ సంపాదించింది అంతా మన భారతీయ నాట్య కళను అభివృద్ది చేయడానికి డాన్స్ అకాడమీలో పెట్టడానికి
గగన్: అది ఎందుకు పనికి వస్తుంది. నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను
శరత్: ఒప్పుకోకపోవడానికి నువ్వు ఎవ్వడివి.. నేను ఒప్పుకుంటున్నాను.
గగన్: అయితే మీరు డాన్స్ అకాడమీ పెట్టడానికే నిర్ణయించుకున్నారా..?
శరత్: అవును నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అదే నిర్ణయం
అంటూ కోపంగా గగన్‌ను తిట్టి అకాడమీ ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టమని.. డబ్బులు కావాలంటే నేను ఇస్తానని శరత్ చంద్ర భూమికి చెప్పి వెళ్లిపోతాడు. దీంతో భూమి హ్యాపీగా గగన్‌ను హగ్ చేసుకుంటుంది. అపూర్వ, సుజాత ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!