Brahmamudi Serial Today Episode:   పెళ్లిని ఎలాగైనా ఆపాలని ఇందిరాదేవి, అపర్ణ ఆలోచిస్తుంటారు. అదే విషయం కావ్యకు చెబితే కావ్య ఐస్‌ క్రీమ్‌ తింటూ సైలెంట్‌గా ఉంటుంది. తాము చాలా టెన్షన్‌ పడుతున్నాం. నువ్వోమో కూల్‌గా ఐస్‌క్రీమ్‌ తింటున్నావు అని అడుగుతారు. జరగని పెళ్లికి టెన్షన్‌ ఎందుకు అంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని రెండు డ్రెస్సులు తీసుకుని రాజ్‌ దగ్గరకు వచ్చి ఏది బాగుందని అడుగుతుంది. నీకు ఏది నచ్చితే అదే బాగుంటుందని ముక్తసరిగా చెప్తాడు రాజ్‌. తర్వాత రూంలోకి వెళ్లిన యామిని దగ్గరకు వైదేహి వస్తుంది.

వైదేహి: బేబీ ఇప్పుడు ఎలా ఉంది పెయిన్‌ తగ్గిందా..?

యామిని: పొద్దున్నే కదా కోసుకున్నాను అప్పుడే ఎలా తగ్గుతుంది మమ్మీ..

వైదేహి:  అయినా పెళ్లి కోసం ఇలా కోసుకోవడం ఏంటే నీ పిచ్చి కాకపోతే

యామిని:  ఇది పిచ్చి కాదు మమ్మీ బావ మీద నాకున్న ప్రేమ. బావను దక్కించుకోవడం కోసం చేయ్యేంటి.. అవసరమైతే నా ప్రాణం కూడా తీసుకుంటాను

వైదేహి: అంత పని మాత్రం చేయకే తల్లి నువ్వే ప్రాణంగా బతుకుతున్నాం. కొంచెం మా గురించి కూడా ఆలోచించు

యామిని: మీ గురించి తర్వాత ఆలోచిస్తాను కానీ ముందు నేను కావ్యకు ఫోన్‌ చేయాలి నువ్వు ఉండు మమ్మీ

వైదేహి: బేబీ ఇప్పుడు ఆ కావ్యకు ఫోన్‌ చేయడం అంత అవసరమా..?

యామిని: అవసరమే మమ్మీ నేను బావను పెళ్లి చేసుకుంటున్న విషయం ఆ కావ్యకు తెలియాలి కదా.? మన శత్రువు కళ్ల ముందు మన జెండా ఎగిరితేనే కదా మనం పూర్తిగా గెలిచినట్టు.. ఆ కావ్యకు కాల్‌ చేసి షాక్‌ ఇస్తాను

యామిని: ఏంటి కావ్య ఫస్ట్‌ రింగ్‌కే లిఫ్ట్‌ చేశావు. నిద్ర పట్టడం లేదా..?

కావ్య: నా నిద్ర గురించి నేను చూసుకుంటాను కానీ ముందు విషయం చెప్పు

యామిని:  నీకో షాకింగ్‌ న్యూస్‌ కావ్య..

కావ్య: ఏటది

యామిని: రామ్‌ బావ నేను ఎల్లుండి పెళ్లి చేసుకోబోతున్నాం (కావ్య షాక్‌) ఏంటి న్యూస్‌ వినగానే షాక్‌ అయ్యాయా..? కళ్లు తిరిగి పడిపోతావేమో జాగ్రత్త.

కావ్య: ఆ అవసరం నాకు లేదు ఆయనకు ఇష్టం లేకపోయి ఉంటుంది. నువ్వే ఏదో చేసి ఆయనను బలవంతగా ఒప్పించి ఉంటావు

యామిని: భలే గెస్‌ చేశావు నువ్వన్నది కరెక్టే చనిపోతానని బావను బెదరించి ఈ పెళ్లికి ఒప్పించాను.

అంటూ చెప్పి రేపు మీ ఇంటికి వచ్చి నిన్న మా పెళ్లికి ఆహ్వానిస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. రూంలో నగలు సర్దుతుంది స్వప్న. అప్పుడే వచ్చిన రాహుల్ స్వప్నకు డౌట్ వచ్చిందా ఏంటి..? అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు యామిని.. వైదేహితో కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. యామినిని చూసి అందరూ షాక్‌ అవుతారు.

యామిని: ఏంటి అందరూ అలా చూస్తున్నారు. నేనండి గుర్తు పట్టలేదా..?

ధాన్యలక్ష్మీ:  నేను అంటే నువ్వేమైనా దేశానికి ప్రధానివా..? లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివా..? ఇలా చూడగానే అలా గుర్తు పట్టడానికి

యామిని:  అదేం కాదండి.. రామ్‌ గారికి కాబోయే భార్యను.. అదే కళావతి గారి ఫ్రెండ్‌ రామ్‌ గారి పియాన్సీని.. రామ్‌ బావకు నాకు పెళ్లి అని చెప్పి.. మీకు కార్డు ఇవ్వడానికి వచ్చాం కదా..? మర్చిపోయారా..?

ఇందిరదేవి: అంటే ఈ మధ్య డాక్టర్‌ గారు కూడా చెప్పారులేమ్మా..

యామిని: ఏమని చెప్పారు అమ్మమ్మ గారు

అపర్ణ: అడ్డమైన మనుషులను అనవసరమైన విషయాలను..

కళ్యాణ్‌: అంటే మా పెద్దమ్మ ఉద్దేశం ఏంటంటే అనవసరమైన విషయాలను ఎక్కువగా స్టోర్‌ చేసుకుంటే బ్రెయిన్‌ మీద ఎఫెక్ట్‌ పడుతుందని డాక్టర్‌ గారు చెప్పారని

యామిని: ఓహో హెల్త్‌ మీద కాన్సెషన్‌ అన్నమాట

అప్పు: ఏదో ఒకటి కానీ ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు

యామిని: రామ్‌ బావతో ఎల్లుండే నా పెళ్లి అని చెప్పడానికి వచ్చాను.  నా పెళ్లి పనులు అన్ని కావ్య దగ్గరుండి చూడాలి. అందుకే వచ్చాను.

కావ్య: అవునా..? వస్తాను యామిని నేనే కాదు మా ఇంటిల్లి పాది అందరినీ తీసుకొస్తాను

యామిని షాక్‌ అవుతుంది. తర్వాత తేరుకుని సరే మీరే నా పెళ్లికి పెద్ద ముత్తయిదువ కాబట్టి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్లిపోతుంది. కారులో వెళ్తున్న వైదేహి ఆ కావ్య ఏదో ప్లాన్‌ చేసింది అందుకే అంత కాన్ఫిడెంట్‌ గా ఉందేమో  బేబీ అంటుంది. ఆ కావ్య ఏ ప్లాన్‌ చేసినా నా పెళ్లి ఆపలేదు మమ్మీ అంటుంది యామిని. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!