Meghasandesam Serial Today Episode: గెస్ట్‌హౌస్‌ నుంచి ఇంటికి వచ్చిన శరత్‌చంద్ర ఎస్సై మర్డర్‌ గురించే ఆలోచిస్తుంటాడు. ఎస్సై చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతలో అపూర్వ టీ తీసుకుని వస్తుంది.

అపూర్వ: ఏమైంది బావ. ఇందాక మీకు జ్యూస్‌ ఇద్దామని వస్తే హడావిడిగా వెళ్లిపోయారు. ఏదో ఆఫీసు టెన్షన్ లో ఉన్నారని నేను కూడా నిన్ను డిస్టర్బ్‌ చేయలేదు. అలా ఎందుకు ఉన్నావు బావ. ఆఫీసులో ఏం జరిగింది.

శరత్‌: ఆఫీసులో ఏం జరగలేదు అపూర్వ. నా జీవితంలోనే పెద్ద విషాదం జరిగింది. అదే శోభాచంద్ర మరణం.

అపూర్వ: అయ్యో బావ ఎప్పుడో చనిపోయిన అక్క గురించి ఇప్పుడు ఇలా బాధపడటం ఏం బాగా లేదు బావ. ముందు ఈ టీ తాగండి.

శరత్‌: వద్దు అపూర్వ.. ఇప్పుడు నాకేం తాగాలి అనిపించడం లేదు. నీకు తెలుసా..? మీ శోభా అక్కా ఫ్యాక్టరీ షార్ట్‌ సర్య్కూట్‌లో చనిపోలేదు. అది మర్డర్‌.

అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు బావ. అజాత శత్రువు అయిన అక్క మర్డర్‌ అవ్వడం ఏంటి..? నేను నమ్మలేను బావ.

శరత్‌: ఎస్సై చెప్తున్నప్పుడు నమ్మాలో లేదో నాకు అర్థం కాలేదు అపూర్వ. అది తెలసుకుందామనే ఆ ఎస్సైని మన గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాను. నేను అక్కడికి వెళ్లే సరికే ఆ ఎస్సై అక్కడ చనిపోయి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి..? ఆ ఎస్సై నాకు నిజం చెప్పేస్తాడని ఎవరో చంపేసి ఉంటారు కదా..? నా శోభ ఆయుష్సు తీరి చనిపోలేదు. ఎవరో చంపేశారు. ఒకరి మేలు తప్ప కీడు చేయని నా శోభను చంపిది ఎవరు…?

అంటూ ఎమోషనల్‌ అయిన శరత్‌ చంద్ర  కింద పడిపోతాడు. అపూర్వ కంగారుగా నీళ్లు చల్లి శరత్‌ను లేపుతుంది. తీసుకెళ్లి బెడ్‌ మీద పడుకోబెడుతుంది.

అపూర్వ: అయ్యో ఏంటి బావ ఇది నువ్వు కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్‌ చెప్పారు కదా బావ. మీరు ఎక్కువగా ఆలోచించవద్దని.. అనవసరంగా మీరు టెన్షన్‌ పడకండి.

శరత్‌: ఎలా అపూర్వ నా శోభ మర్డర్‌ అయిందని తెలిశాక నేను ఆలోచించకుండా టెన్షన్‌ పడకుండా ఎలా ఉండగలను. అంత కాన్ఫిడెంట్‌గా ఆ ఎస్సై చెప్పాడంటే తను ఏదో బలమైన ఆధారమే చూసి ఉంటాడు. అందుకే అతన్ని కూడా మర్డర్‌ చేసి ఉంటాడు.

అపూర్వ: చూడు బావ దీన్ని మనం మరో యాంగిల్‌లో ఎందుకు ఆలోచించకూడదు. మనల్ని ఎవరో మిస్‌ గైడ్‌ చేస్తున్నారని నాకు అర్తం అవుతుంది.

శరత్‌: నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెం అర్థం అయ్యేట్టుగా చెప్పు అపూర్వ.

అపూర్వ: అది కాదు బావ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటేనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ శత్రువుల్లో ఒకరు ఆ ఎస్సైని మర్డర్‌ చేయడానికి ప్లాన్‌ చేసి ఉండొచ్చు కదా బావ.

అంటూ అపూర్వ తన మాటలతో శరత్‌ను కన్వీన్స్‌ చేస్తుంది. కానీ శరత్‌ చంద్ర మాత్రం అపూర్వ మాటలు నమ్మినట్టే నమ్మి ఎస్సై మాటల్లో కూడా నిజం ఉందని అనిపిస్తుంది అంటాడు. నిజంగానే శోభను ఎవరైనా చంపి ఉంటే వాళ్లను నేను పట్టుకోవాలి. వాళ్లను నా చేతులతో నేనే చంపేయాలి అని చెప్పడంతో అపూర్వ షాక్‌ అవుతుంది. తర్వాత భూమి గగన్‌కు కాల్ చేస్తుంది.

గగన్‌: ఎందుకు ఫోన్‌ చేశావు.. ఏంటో చెప్పు..

భూమి: నేను చెర్రి లైఫ్‌ నాశనం చేశానా..? ఇప్పుడు చూడండి వాళ్లిద్దరూ రేపటి నుంచి ఎంత ఆనందంగా ఉంటారో..

గగన్‌: అవునా ఇంతకీ ఏం చేశావు..?

భూమి: వాళ్లిద్దరికి ఇవాళ ఫస్ట్‌ నైట్‌ ఏర్పాటు చేశాను.

గగన్‌: అసలు నువ్వు మనిషివా సైకోవా.? దాన్ని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో దూకినట్టే.. ఇప్పుడు నక్షత్రతో ఫస్ట్‌ నైట్‌ అంటే వాడికి పాడె కట్టినట్టే..

అంటూ తిడుతూ గగన్‌ కాల్ కట్‌ చేస్తాడు. తర్వాత శోభనం గదిలోకి వెళ్లిన నక్షత్ర తనను తానే కొట్టుకుని ఏడుస్తూ బయటకు వచ్చి చెర్రి తనను కొట్టాడని చెప్తుంది. దీంతో శరత్‌ చంద్ర కోపంగా చెర్రిని కొడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!