Meghasandesam Serial Today Episode:  మీరేం చెప్పినా చేస్తాను కానీ భూమిని పెళ్లి మాత్రం చేసుకోలేనని చెర్రి ఏడుస్తుంటాడు. దీంతో శరత్‌ చంద్ర కోపంగా అపూర్వ అందరికీ వంట చేసి అందులో నేనిచ్చిన పాయిజన్‌ కలుపు అందరం తిని చనిపోదాం ఎందుకంటే ఈ శరత్‌చంద్రకు ప్రాణం కంటే పరువే ముఖ్యం కాబట్టి అంటూ వెళ్లిపోతాడు. చెర్రి ఏడుస్తుంటాడు.

Continues below advertisement


మీరా: చెర్రి ఏడవకు నాన్నా..


అపూర్వ: మీరా విన్నావుగా మనం చావడమో బతకడమో ఇక నీ కొడుకు చేతుల్లోనే ఉంది.


అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


మీరా: బిందు నువ్వైనా చెప్పు..


చెర్రి: నాన్నా నువ్వైనా వాళ్లకు చెప్పు నాన్నా.. ఒక్కసారి మామయ్యతో మాట్లాడు నాన్నా.. నా వల్ల కాదని నీకు కూడా తెలుసు కదా నాన్నా


కేపీ: చెర్రి మీ నాన్నా అసమర్థుడురా.. ఆ కొడుక్కి న్యాయం చేయలేడు.. ఈ కొడుక్కి న్యాయం చేయలేడురా..? కుదిరితే క్షమించరా..


మీరా: రేయ్‌ చెర్రి ఎవరు ఏడ్చినా ఎవ్వవు బాధపడినా నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలిరా


అని కరాకండిగా చెప్తుంది. చెర్రి ఏడుస్తుంటాడు. మరోవైపు టెర్రస్‌ మీద ఉన్న భూమి ఏడుస్తుంటే.. నక్షత్ర వెళ్తుంది.


నక్షత్ర: ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటి ఇక్కడ ఏడుస్తున్నావు. నువ్వు కూడా సంతోషంతో గెంతులేసే విషయం ఒకటి చెప్తాను. అదేంటంటే చెర్రితో నీ పెళ్లి త్వరలోనే.. ఏంటి అలా చూస్తున్నావు. నీ ముఖంలో ఇప్పుడు బాధ, కోపం, ఉక్రోషం అవేమీ కనిపించకూడదు. డాడీకి నువ్వు బంగారు కూతురువి కదా డాడీ ఫిక్స్‌ చేసిన పెళ్లి ఇది.


భూమి: నక్షత్ర నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో


నక్షత్ర: అయ్యో భూమి ఇప్పుడు నువ్వు విసుక్కోకూడదు. ఇంత చెప్తున్న నా మాట నీ చెవికి ఎక్కినట్టు లేదు. గగన్‌ బావ అంత స్మార్ట్‌ కాకపోయినా.. చెర్రి కూడా మంచోడు భూమి. పెళ్లి అయ్యాక వాడు నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు. నీ మీద ఈగ కూడా వాలనివ్వడు. ఎందుకంటే వాడు నిన్ను ప్రేమించాడు. గగన్‌ బావ నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలియదు కానీ చెర్రి మాత్రం నిన్ను బాగా లవ్‌ చేశాడు. నీకిద్దామని వాడు రాసుకున్న లవ్‌ లెటర్లు.. నీకోసం తయారు చేసుకున్న కాఫీ కప్పు ఇలా వాడి ప్రేమ సాక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఈ జన్మకు నువ్వు చెర్రి బావతో సెటిల్‌ అయిపో నేను గగన్‌ బావతో సెటిల్‌ అవుతాను.


అంటూ నక్షత్ర చెప్పి వెళ్లిపోతుంది. దీంతో భూమి ఏడుస్తూ.. చెర్రి తనతో రొమాంటిక్‌గా చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. అప్పుడే చెర్రి టెర్రస్‌ మీదకు వస్తాడు. భూమి ఏడవడం చూసి ఎమోషనల్‌ అవుతాడు.


చెర్రి: భూమి నీకీ విషయం తెలుసా..?


భూమి: త్వరలో మన పెళ్లి..


అని భూమి చెప్పగానే చెర్రి షాక్‌ అవుతాడు.


చెర్రి: పెళ్లి అని తెలిసి కూడా నువ్వు కూల్‌గా ఉన్నావా..


భూమి: కూల్‌గా ఉండటం ఏంటి చెర్రి బాధతో మనసు చచ్చిపోతుంది


చెర్రి: అలా మాట్లాడకు భూమి. రేపు జరగబోయే పెళ్లి ఎలా ఆపాలో అది ఆలోచించు.


భూమి: ఎలా ఆపగలం చెర్రి.


చెర్రి: నా దగ్గర ఒక ప్లాన్‌ ఉంది. ఆ ప్లాన్‌ ప్రకారం చేస్తే ఈ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది.


భూమి: ఏంటా ప్లాన్‌ చెర్రి..?


అని భూమి అడగ్గానే.. చెర్రి తన ప్లాన్‌ చెప్తాడు. భూమి సరే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత రాత్రికి అందరూ పడుకున్నాక తమ ప్లాన్‌ ప్రకారం లగేజీ సర్దుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుంది భూమి.  అప్పటికే బయట ఉన్న చెర్రి గగన్‌కు ఫోన్‌ చేసి తనను ఎవరో కొడుతున్నారని కాల్‌ కట్‌ చేస్తాడు. దీంతో గగన్‌ కారేసుకుని బయలుదేరుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!