Meghasandesam Serial Today Episode: అపూర్వ ఒక పోలీస్‌ ఫోన్‌ చేసి మీ అల్లుడు చెర్రి చనిపోయాడని డెడ్ బాడీ హాస్పిటల్‌ మార్చురీలో ఉందని మీరు వెళ్లి కన్‌ఫం చేయాలని చెప్తాడు. దీంతో పోలీస్‌ తో అపూర్వ ఏడుస్తన్నట్టు నటిస్తుంది. కాల్‌ కట్‌ చేశాక అపూర్వ నవ్వుతూ నక్షత్రను పిలుస్తుంది. వెంటనే నక్షత్ర, సుజాత వస్తారు.

Continues below advertisement

నక్షత్ర: ఏంటి మమ్మీ అలా పిలిచావు..

అపూర్వ: బేబీ గుడ్‌ న్యూస్‌ చెర్రి గాడు చనిపోయాడు.

Continues below advertisement

నక్షత్ర: ఏంటి మమ్మీ చెర్రి చనిపోయాడా..? నాకు తెలుసు మమ్మీ ఈ న్యూస్‌ ఏ క్షణమైనా రావొచ్చని నేను అనుకుంటున్నాను. అందుకే స్వీట్స్‌ ఆల్‌ రెడీ కొనిపెట్టాను మమ్మీ.. వన్ సెకన్‌.. మమ్మీ చెర్రి గాని చావు కబురు నువ్వే నాకు చల్లగా వినిపించినందుకు ఇదిగో ఈ స్వీట్‌. సడెన్‌ గా నేనే వాన్ని చావనంపాను కాబట్టి ఈ స్వీట్‌ నాకు ఈ న్యూస్‌ మనకు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టు ఉంది కనక ఇదిగో గోరింటాకు ఈ స్వీట్‌ నీకు

సుజాత: చాలు బేబీ..

కేపీ: నక్షత్ర ఏం చేశావు నా కొడుకును.. చెర్రిని చంపేశావా..? చెప్పు..

అపూర్వ: కేపీ ఏంటి నా కూతురు మీద అలా నోరు పడేసుకుంటున్నావు చెప్పు.. అసలు ఏ భార్యైనా మొగుణ్ని చంపేసుకుంటుందా..? ఏ ఇంట్లోనైనా అలా జరుగుతుందా..?

కేపీ: జరుగుతుంది. ఈ ఇంట్లో అలాగే జరుగుతుంది.

శరత్‌: కేపీ కాస్త ఆతు తూచి మాట్లాడు.. చెర్రిని చంపాల్సిన అవసరం నక్షత్రకు ఏముంది.?

కేపీ: ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి నేనంతా చూశాను.. విన్నాను.. ఆ సీఐ అపూర్వకు ఫోన్‌ చేసి ఎవరో అరకులో చనిపోయారని చెప్పడం.. చచ్చిపోయింది చెర్రి అని వీళ్లిద్దరికీ అపూర్వ చెప్పడం. దీంతో ముగ్గురూ స్వీట్లు తినడం. అసలు చేతిలో ఈ స్వీట్లు ఎందుకున్నాయో చెప్పమనండి..

అపూర్వ: పిన్ని అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. చెర్రి కనబడకుండా పోయిన రోజే నీ పుట్టిన రోజు స్వీట్లు ఇవ్వమని నేను నిన్ను అడిగానా…? సెలబ్రేషన్‌ లేకపోయినా సరే ఈ స్వీట్లు తినమని నాకు ఇచ్చావు.. ఇప్పుడు చూడు నా మీద నా కూతురు మీద ఎలా నిందలు వేస్తున్నాడో

సుజాత: ఏంటీ కేపీ నువ్వు మరీనూ..

కేపీ: ఏయ్‌ నువ్వు నోరు మూయ్‌.. బావగారు నక్షత్రే చెర్రిని ఏదో చేసింది. నేను వీళ్లు మాట్లాడుకోవడం విన్నాను..

అంటూ చెప్తుంటే.. డోర్‌ వైపు నుంచి చెర్రి నాన్నా అంటూ వస్తాడు. చెర్రిని చూసి అందరూ షాక్‌ అవుతారు. కేపీ మీరా వెళ్లి చెర్రిని హగ్‌ చేసుకుంటారు.  నక్షత్ర నిన్ను చంపాలని చూసిందని శరత్‌ చంద్రకు నిజం చెప్పమని కేపీ చెప్తాడు.

చెర్రి: నక్షత్ర నన్నెందుకు చంపుతుంది నాన్న.. నక్షత్ర నా బంగారం.

కేపీ: చెర్రి అబద్దాలు ఆడొద్దురా..? మామయ్యకు నిజం చెప్పరా..?

చెర్రి: నిజమే చెప్తున్నాను నాన్న. అనుకోకుండా నేను కాలు జారి లోయలో పడిపోయాను.

కేపీ: రేయ్‌ అర్థం అయిపోయిందిరా నువ్వు అబద్దం చెప్తున్నావు.. నిజం చెప్పరా..?

అపూర్వ: చాలు కేపీ చాలు ఇప్పటి వరకు నా కూతురు మీద నువ్వు వేసిన నింద. అన్ని చాలు దయచేసి ఇంతటితో ఆపేయ్‌

అంటూ తిడుతుంది అపూర్వ. మరోవైపు భూమి కోసం బుట్టెడు పూలు తీసుకుని ఇంటికి వెళ్తాడు గగన్‌. అది చూసి ఆనందంతో పరవశించిపోతుంది భూమి. పూలు తీసుకురావడం కాదు తలలో కూడా మీరే పెట్టాలి అని భూమి చెప్పగానే.. గగన్‌ పూలు పెడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!