Brahmamudi Serial Today Episode: స్మగుల్‌ గోల్డ్‌ కేసులో రాజ్ ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తారు. రాజ్‌ జైలుకు వెళ్లడంతో కావ్య కంగారు పడుతుంది. ఏడుస్తూ రాజ్‌ ను ఎలాగైనా బయటకు తీసుకురండని ఇంట్లో వాళ్లకు చెప్తుంది.

Continues below advertisement

కావ్య: అత్తయ్యా ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది అత్తయ్యా..

అపర్ణ: నువ్వేం టెన్షన్‌ పడుకు కావ్య.. ధాన్యం కొంచెం వాటర్‌ తీసుకురా.. ( ధాన్యం వాటర్‌ తెస్తుంది) ఇదిగో ఈ వాటర్‌ తాగు

Continues below advertisement

కావ్య: అత్తయ్యా మా ఆయనేంటి ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటి..? అసలు కలలో కూడా ఇలాంటి తప్పు చేశారని మనం ఊహించగలమా..?

కళ్యాణ్‌: ఇదంతా ఎవరో కావాలనే చేశారు వదిన. ఇదంతా ఎవరో ఒక ప్లాన్‌ ప్రకారమే చేశారు.

కావ్య:  అప్పు ఏదో ఒకటి చేయవే.. ఎవరితోనైనా మాట్లాడు.. మీ బావ గారిని బయటకు తీసుకురా అప్పు

అప్పు: అవసరం లేదు బావను ఎలాగైనా బయటకు తీసుకొస్తాము అక్క నువ్వు రిలాక్స్‌ గా ఉండు..

కావ్య: నా వల్ల కావడం లేదే.. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు. ఈరోజు చేయని తప్పుకు ఆయన్ని జైలుకు పంపించారు నాకెందుకో కంగారుగా ఉంది అప్పు..

ఇంద్రాదేవి: కావ్య నీకు దండం పెడతాను.. నువ్వు అలా కంగారు పడకు కావ్య.. కడుపులో బిడ్డకు మంచిది కాదే తల్లి నా మాట విను..

కావ్య: మామయ్య ఎలాగైనా ఆయన్ని కాపాడండి మామయ్య గారు ఎవరో కావాలనే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు..  ఆయన మీద దొంగ బంగారం కేసు పెట్టి ఆయన పేరును చెడగొట్టాలనుకుంటున్నారు.. కంపెనీ పరువును దుగ్గిరాల వారి ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్నారు మామయ్య.. అమ్మమ్మ మీరే ఏదో ఒకటి చేయండి.. మీ మనవడు  ఎలాగైనా కాపాడాలి

అంటూ కావ్య కుప్పకూలిపోతుంది. అందరూ టెన్షన్‌ పడుతుంటారు.

కావ్య: అమ్మా నొప్పులు..

ఇంద్రాదేవి: భగవంతుడా ఏడో నెలలో నొప్పులు ఏంటి..?

సుభాష్‌:  ఓరేయ్‌ కళ్యాణ్‌ కారు తీయరా..? హాస్పిటల్‌కు వెళ్దాం

కళ్యాణ్‌:  సరే పెద్దనాన్న

అని కళ్యాణ్‌ కారు తీస్తారు. కావ్యను తీసుకెళ్లి హాస్పిటల్‌ లో అడ్మిట్‌ చేస్తారు. ఐసీయూలో డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తుంటుంది.

అపర్ణ: అత్తయ్యా కావ్య పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది అత్తయ్యా..

ఇంద్రాదేవి: అపర్ణ అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు.. నువ్వు కంగారు పడకు

అపర్ణ: కానీ సమయానికి రాజ్‌ ఇక్కడ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

సుభాస్‌: అపర్ణ నువ్వేం టెన్షన్ పడకు కళ్యాణ్‌ వెళ్లాడు కదా..? నేను స్టేషన్‌కు వెళ్తాను ఎలాగైనా రాజ్‌ ను తీసుకొస్తాను

ఇంద్రాదేవి: ముందు ఆ పని చేయరా..?

సుభాష్‌: అలాగేనమ్మా

అప్పు: పెద్దమామయ్య ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే ఫోన్‌ చేయండి

సుభాష్‌: అలాగేనమ్మా..

అంటూ వెళ్లిపోతాడు సుభాష్‌. లోపల ఐసీయూలో ఉన్న కావ్య, రాజ్‌ ను చూడాలని డాక్టర్‌కు చెప్తుంది. బయటకు వచ్చిన డాక్టర్‌ అపర్ణతో కావ్య కండీషన్‌ సీరియస్‌ గా ఉందని వెంటనే ఆమె హస్బెండ్‌ ను పిలిపించండి అని చెప్తుంది. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌లో రాజ్‌ ను కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తారు. రాజ్‌ కంగారు పడుతుంటాడు.  మరోవైపు రాజ్‌ వస్తేనే ఆపరేషన్‌ చేయించుకుంటానని కావ్య చెప్పడంతో డాక్టర్‌ బయటకు వచ్చి అపర్ణకు విషయం చెప్తుంది. అందరూ కంగారు పడుతుంటారు. ఇంతలో అప్పు.. ఆరోజు రాత్రి రాహుల్‌ పట్టుకున్న బ్రీఫ్‌కేస్‌ గుర్తు చేసుకుని రాహుల్‌ ను నిలదీస్తుంది. దీంతో స్వప్న, అప్పుల మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!