Meghasandesam Serial Today Episode: గగన్‌ను ప్రతిసారి భూమి సేవ్‌ చేస్తుందని ఆలోచిస్తుంది. సుజాత చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. భూమి ఉండగా గగన్‌ను ఏమీ చేయలేమని.. గగన్‌ ఉండగా భూమిని ఏమీ చేయలేమని సుజాత మాటలు గుర్తు చేసుకున్న అపూర్వ రివాల్వర్‌ తీసుకుని భూమిని చంపాలని బయటకు వెళ్తుంది. రివాల్వర్‌తో భూమి రూంలోకి వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేస్తుంది. దుప్పటి మూసుకుని నిద్రపోతున్న భూమికి గన్‌ ఎయిమ్‌ చేస్తుంది. తర్వాత గన్‌ పక్కన పెట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాలనుకుంటుంది. దిండు తీసుకుని నొక్కుతుంటే.. విలవిలలాడుతున్న వ్యక్తిని చూసి పక్కకు జరుగుతుంది. దుప్పట్లో సుజాత ఉంటుంది. అపూర్వ షాక్ అవుతుంది.


సుజాత: అమ్మాయి నన్ను చంపేద్దామనుకున్నావా..?


అపూర్వ: భూమి అనుకున్నాను పిన్ని..


సుజాత: అయినా చంపే ముందు ఒకసారి ముఖం చూడొద్దా..?


అపూర్వ: అయినా నువ్వు ఈ రూంలో ఎందుకు పడుకున్నావు..


సుజాత: నా చావు కొచ్చి.. నా రూంలో ఏసీ పనిచేయడం లేదు. అందుకే ఇక్కడ నేను పడుకున్నాను.. నా రూంలో భూమి పడుకుంది. అయినా ఇప్పటికిప్పుడు ఆ భూమిని ఎందుకు చంపాలనుకున్నావు.


అపూర్వ: నువ్వే చెప్పావు కదా పిన్ని అది ఉంటే వాణ్ని ఏం చేయలేమని.. అందుకే చంపాలనుకున్నాను.


సుజాత: రేపు కోర్టులో కూడా ఇదే చెప్పి నన్ను నీతో పాటు జైలుకు పట్టుకుపోయేలా ఉన్నావే.. ఇంట్లో దాన్ని చంపితే ఇంట్లో వాళ్లకు ఎవ్వరికీ అనుమానం రాకపోవచ్చు. కానీ గగన్‌ గాడికి అనుమానం వస్తుంది. అందుకే దాన్ని బయటకు ఎక్కడికైనా తీసుకెళ్లి చంపాలి.


అని సుజాత చెప్పగానే.. అపూర్వ అర్తం అయింది పిన్ని అంటుంది. మరోవైపు ఇందు హాల్లో కింద కూర్చుని ఏడుస్తుంది. వంశీ కిటికీలోంచి ఇందును పిలుస్తాడు. సారీ చెప్తాడు. ఎందుకులేండి ఇదంతా నా కర్మ అంటుంది ఇందు. ఇంతలో వంశీ కీ ఇస్తూ ఇది తీసుకుని డోర్‌ తీయ్‌ అని చెప్తాడు. ఇందు డోర్‌ తీయగానే.. ఇద్దరు లోపలికి వెళ్లి బాధపడతారు. ఇక్కడే పడుకో అంటే వద్దని బయటే పడుకుంటాను అంటుంది ఇందు. ఉదయమే భూమి కాఫీ తీసుకుని ప్రసాద్‌ ఇస్తుంది.


ప్రసాద్‌: ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు ఇంట్లో పనోళ్లు ఎవరూ లేరా..?


భూమి: ఎందుకో తేవాలనిపించింది మామయ్య


ప్రసాద్‌: థాంక్యూ.. ఏంటమ్మా అలా చూస్తున్నావు.


భూమి: ఎందుకో మీ అబ్బాయి ఫోన్‌ చేస్తారనిపిస్తుంది మామయ్య.


ప్రసాద్‌: ఓహో అందుకే నాకు కాఫీ తీసుకొచ్చావా..? అదిగో ఫోన్‌ మోగుతుందిగా వాడే అయ్యుంటాడు వెళ్లు..


భూమి వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది..


భూమి : చెప్పండి పొద్దునే ఫోన్‌ చేశారు..


గగన్‌: ఏం చేయకూడదా..?


భూమి: చేయోచ్చు అనుకోండి కానీ కారణం లేకుండా ఎవరూ చేయరు కదా..?


గగన్‌: మనిద్దరి మధ్య మాటలకు కారణం ప్రేమే.


భూమి: పొద్దున్నే మొదులుపెట్టారా..? కవిత్వం..అసలు విషయం ఏంటో చెప్పండి..


అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. నక్షత్ర వస్తుంది. భూమి సిగ్గు పడుతూ మాట్లాడుతుంది బావతో కాదు కదా అనుకుని తన ఫోన్‌తో గగన్‌కు కాల్‌ చేస్తుంది. బిజీ రావడంతో నక్షత్ర అనుమానిస్తుంది. ఇంతలో గగన్‌ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అమ్మా పూరికి చెప్పాను. వాళ్లు కూడా ఒప్పుకున్నారు అని గగన్‌ చెప్పగానే భూమి కాల్‌ కట్‌ చేస్తుంది. వెనకే నిలబడి వింటున్న నక్షత్ర కోపంగా చూస్తుంది. దగ్గరకు వచ్చి ఎవరితోనే అంత సిగ్గుగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నీకు కాబోయే మొగుడుతో మాట్లాడుతున్నాను అంటుంది భూమి. నక్షత్ర కోపంగా తిట్టగానే సరే నీకు కాబోయే మొగుడితో కాదు నాకు కాబోయే మొగుడితో మాట్లాడుతున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!