Meghasandesam Serial Today Episode: నక్షత్ర రూంలోకి వెళ్లి డ్రెస్ మార్చుకుంటుంటే.. బయట విండో నుంచి గగన్ ఫోన్ నుంచి వీడియో తీస్తుంది గాయత్రి. వీడియో తీస్తున్న గాయత్రిని భూమి చూస్తుంది. మరోవైపు గగన్, భూమి కోసం వెతుక్కుంటూ వెళ్లి శరత్‌చంద్రను తగులుతాడు. దీంతో శరత్ చంద్ర తిడుతుంటాడు. పైన ఫోటో లు తీస్తున్న గాయత్రిని ఆపబోయి కింద నుంచి గగన్, శరత్ చంద్రల గొడవ విని కిందకు వెళ్తుంది. ఇంతలో మినిస్టర్ వచ్చి హలో శరత్ చంద్ర మీరు ఇంతలోనే ఫ్రెండ్స్ అయిపోయారా..? నన్ను భోజనానికి పిలిచి మీరు ఇక్కడ ఉంటే ఎలా రండి భోజనానికి వెళ్దాం అంటూ శరత్‌చంద్రను తీసుకుని వెళ్లిపోతాడు. పైన ఫోటోలు తీస్తున్న గాయత్రి, తనను నక్షత్ర చూసేలా చేస్తుంది. ఆ సౌండ్ విని నక్షత్ర కెమెరా వైపు చూస్తుంది. భయంతో ఏడుస్తూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది. భూమి భోజనం తీసుకుని గగన్ బయటకు తీసుకెళ్లి వాటర్ తీసుకురావడానికి పక్కకు వెళ్తుంది. ఇంతలో గాయత్రి వచ్చి ఫోన్ మారిపోయిందని ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంతలో భూమి వస్తుంది.
భూమి: ఇంకా చూస్తున్నారేంటి..? తినండి.
గగన్: అదేంటి తినిపించవా..?
భూమి: నేనా..?
గగన్: నువ్వే
భూమి: తినిపించాలా..?
గగన్: అవును తినిపించాలి.
భూమి: అదేం కుదరదు మీరే తినాలి.
గగన్: తినిపించవా.. సరే అయితే నేను వెళతాను.
భూమి: అదేంటి ఆకలి అన్నారుగా
గగన్: ఏయ్ వెళతాను అంటే పూర్తిగా వెళతానని కాదు నక్షత్ర దగ్గరకు వెళతాను.
భూమి: ఎందుకు..?
గగన్: తనైతే నాకు కొసరి కొసరి తినిపిస్తుంది.
భూమి: అది తినిపిస్తే.. మీరు తింటారా..?అది తినిపిస్తుంటే.. మీరు తింటుంటే.. ఎవరైనా చూస్తే..
గగన్: గొడవలు అవుతాయని నీ రెగ్యులర్ డైలాగ్ అంతేగా కానీ..
భూమి: ఇందుకు తినొచ్చు అని నేను కన్వీన్స్ అయితే మిమ్మల్ని వెళ్లమని నేనే పంపిస్తాను
గగన్: నక్షత్ర నన్న ప్రేమిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. తను నాకు తినిపించినప్పుడు నువ్వు కూడా నాకు తినిపించాలి కదా కన్వీన్స్ అయ్యావా…? ఇంత సైలెంట్ గా ఉన్నావంటే అయ్యావన్నట్లే.. సరేలే ఇక నక్షత్ర దగ్గరకే వెళ్తాను.
అంటూ గగన్ వెళ్లబోతుంటే.. ఆగండి నేను తినిపిస్తే మీరు సంతోషంగా ఉంటారంటే తినిపిస్తాను అంటుంది భూమి. సరేనని గగన్ కూర్చోగానే భూమి భోజనం తినిపిస్తుంది. మరోవైపు అపూర్వ కోపంగా శరత్ చంద్ర దగ్గరకు వస్తుంది.
అపూర్వ: ఘోరం జరిగిపోయింది బావ..
శరత్: ఏంటి ఏం జరిగింది..
అపూర్వ: మన నక్షత్ర ఫోటోలు తీశారు బావ..
శరత్: ఎవరు ఎవరికి ఇంత ధైర్యం..
సుజాత: ఏదో మామూలు ఫోటోలు తీసినట్టు అడుగుతారేంటి అల్లుడుగారు. బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీశారు.
శరత్: ఎలా తీశాడు.
సుజాత, నక్షత్ర: ఫోన్ తో..
శరత్: నక్షత్ర చూసింది కాబట్టి తెలుసు మీకెలా తెలుసు..?
అపూర్వ: చెప్పు.. పిన్ని
సుజాత: అంటే ఈ రోజుల్లో కెమెరా ఎవరు వాడుతున్నారు అల్లుడు గారు. అందరూ ఫోన్ లే వాడుతున్నారు కదా అందుకే ..
అపూర్వ: ఫోటో దేనితో తీశారని కాదు ఇక్కడ సమస్య ఫోటోలు ఎవరు తీశారనేది. రేపు మన అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే మన పరువు ఏం కావాలి.
శరత్: కృష్ణప్రసాద్ ఎవ్వరూ బటయకు వెళ్లడానికి వీల్లేదు.
కృష్ణప్రసాద్: చెర్రి డోర్లన్నీ క్లోజ్ చేయ్.. ఎవ్వరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు.
శరత్: అందరూ ఫోన్లు ఇక్కడ పెట్టండి. ఫోటోలు ఉన్న వాళ్లు మాత్రమే ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్లు వాళ్ల ఇండ్లకు వెళ్తారు.
సుజాత: అందరూ ఇక్కడే ఉన్నారు కానీ ముఖ్యమైన వాడే ఇక్కడ లేడు.
అపూర్వ: ఏం మాట్లాడుతున్నావు పిన్ని ముఖ్యమైన వాళ్లు ఎవరు?
సుజాత: ఇంకెవడు ఆ గగన్..
మంత్రి: ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాతో వచ్చిన గెస్ట్ ను నువ్వు అనుమానిస్తున్నావా..?
శరత్: క్షమించండి మినిస్టర్ గారు వాడికి మాకు శత్రుత్వం ఉంది. మీ మీద గౌరవం తో వాడి అడుగు లోపల పడింది. లేదంటే వాడి తల ముక్కలయ్యేది.
మినిస్టర్: ఆ మాట ముందే తెలిస్తే బయటే ఉంచేవాడిని కదా..?
నక్షత్ర: డాడీ అతను అలాంటి పనులు చేస్తాడంటే నేను నమ్మను.. హీ ఈజ్ జెంటిల్మెన్.
అనగానే శరత్ చంద్ర నక్షత్రను కొట్టబోతాడు. మినిస్టర్ ఆపుతాడు. ఇంతలో బయటకు వెళ్లిన సుజాత, భూమి గగన్‌కు అన్నం తినిపించడం చూస్తుంది. నిన్ను లోపల పిలుస్తున్నారు రా అని గగన్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది సుజాత. లోపలికి వచ్చిన భూమి ఏమైందని చెర్రిని అడుగుతుంది. విషయం చెప్తాడు చెర్రి. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!