Meghasandesam Serial Today Episode : నక్షత్ర బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతుంటే అపూర్వ వస్తుంది. కోపంగా చూస్తుంది. అపూర్వను చూసిన నక్షత్ర భయంతో వణికిపోతుంది. ఇంతలో సుజాత వచ్చి చూశావా అమ్మాయి నీ కూతురు టాలెంట్ ఇది ఆ గగన్ గాడిని ప్రేమిస్తుందని చెప్పాను కదా..? ఇన్నాళ్లు నువ్వు నమ్మలేదు అంటుంది. దీంతో అపూర్వ కోపంగా నువ్వు ఆ గగన్ గాడిని ప్రేమిస్తుంటే.. మీ డాడీ ఊరుకుంటాడా అంటుంది. డాడీ ఏదైనా చేస్తుంటే.. బావ ఊరుకుంటాడా అంటుంది నక్షత్ర. దీంతో అపూర్వ నక్షత్రను కొట్టి నువ్వు నా కడుపున ఎలా పుట్టావే అంటూ వాడు భూమి కోసం వస్తున్నాడు. వాడితో పాటు నిన్ను చంపేస్తాడు మీ డాడీ అంటూ నక్షత్రను రూంలో వేసి బయటకు వెళ్లి తాళం వేస్తుంది అపూర్వ. మరోవైపు భూమి రెడీ అవుతూ తన మువ్వతో మాట్లాడుతుంది. ఇంతలో చెర్రి వస్తాడు.
చెర్రి: మువ్వా.. ఏంటి ఈరోజు నీ ముఖం కడిగిన ముత్యంలా ఇంతలా మెరిసిపోతుంది. ఏంటి..? ఏంటి విషయం..
భూమి: అలా అంటావేంటి చెర్రి.. నీకు తెలియదా..? శారద ఆంటీ వాళ్లు ఇవాళ వస్తున్నారు కదా..? అందుకే ఆనందంగా ఉంది.
చెర్రి: ఏంటి ఒక పక్క నేను టెన్షన్ తో చచ్చిపోతుంటే.. నీకు ఆనందంగా ఉందా..? కొంచెమైనా టెన్షన్‌గా లేదా..?
భూమి: కొంచెం ఏంటి..? రాత్రి నుంచి బోలెడంత టెన్షన్ పడ్డాను. ఇందాకే కొంచెం క్లారిటీ వచ్చింది. జరిగేదేదో జరగక మానదు అన్నప్పుడు మన నిర్ణయం మనం తీసుకోక తప్పదు కదా చెర్రి.
చెర్రి: నువ్వు కూడా నాలాగే అప్పుడప్పుడు చాలా విచిత్రంగా మాట్లాడతావు మువ్వా.. అయినా నీకెందుకు ఉంటుంది టెన్షన్. టెన్షన్ అంతా తనకు కదా..? ఏ టెన్షన్ లేకుండా తను మా అన్నయ్యతో వెళ్లిపోయే వరకు నేనే మామయ్యతో మాట్లాడతాను
భూమి: నువ్వే విచిత్రంగా మాట్లాడుతున్నావు చెర్రి. అన్నయ్యతో నువ్వు వెళ్లిపోవడానికి అనడానికి బదులు తను అంటావేంటి..?
చెర్రి: నువ్వు వెళ్లిపోవడం ఏంటి..?
భూమి: అయ్యో చెర్రికి నిజం తెలియదు కదూ..( మనసులో అనుకుంటుంది.) అవును తనే
చెర్రి: నువ్వు కూడా ఇలా తడబడుతున్నావేంటి..?
అంటూ చెర్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి కూడా ఏ ఇబ్బంది రాకుండా నువ్వే కాపాడాలి అమ్మా అంటూ మనసులో అనుకుంటుంది. చెర్రి హాల్లో కూర్చున్న శరత్ చంద్ర దగ్గరకు చెర్రి వెళ్లి అన్నయ్య వస్తున్నాడని రాత్రే తెలిసింది మామయ్య. రాత్రి నుంచి నాకు నిద్ర పట్టలేదు. నేను మీకు చెప్పేంత వాణ్ని కాదు కానీ పీసుపుల్‌గా మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం అంటాడు. ఇంతలో అపూర్వ వస్తుంది.
అపూర్వ: ఏంట్రా.. మీ మామయ్యకే చెప్పేంత పెద్దవాడివి అయిపోయావా..?
చెర్రి: అయ్యో అది కాదు అత్తయ్యా..
అపూర్వ: నోర్మూయ్ రా.. మనకు ఆక్షన్ దక్కకూడదని పంతానికి పోయి ఎక్కువకు ఆక్షన్ దక్కించుకుని పంతానికి పోయింది ఎవర్రా…? ఆ గగన్ గాడు కదూ..? నా భార్య పేరు మీద టౌన్ షిప్ కడతానని మామయ్యను రెచ్చగొట్టింది ఎవర్రా..? అంతటితో ఆగకుండా ఈరోజు ఇంటికి వచ్చి బొట్టు పెట్టి భూమిని తీసుకెళ్తానని చెప్పింది వాడు కదూ..?
అని అపూర్వ చెప్పగానే.. చెర్రి షాక్ అవుతాడు. అంతకుముందు తాను గగన్‌తో భూమితో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు. ఎమోషనల్ అవుతాడు. అపూర్వ మాత్రం గగన్‌ను తిడుతూనే ఉంటుంది. నిజంగానే వాడు వస్తే వాణ్ని చంపేయ్ బావ అంటూ శరత్ చంద్రకు గన్ ఇచ్చి పైకి వెళ్తుంది. చెర్రి బాధతో అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా..? అంటూ ప్రసాద్‌ను అడుగుతాడు. ప్రసాద్ అవునని చెప్పడంతో చెర్రి గుండెలు పగిలేలా మనసులో బాధపడుతుంటాడు. ఇంతలో శారద, గగన్, పూరి తాంబూలాలు తీసుకుని వస్తారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!