Meghasandesam Serial Today Episode: హనీమూన్‌లో ఉన్న నక్షత్రకు కాల్‌ చేస్తుంది అపూర్వ. రెండు రోజుల నుంచి కాల్ చేయడం లేదేంటని అడుగుతుంది. ఎందుకు నన్ను ఎవైడ్‌ చేస్తున్నావని తిడుతుంది. చెర్రి ఎదురుగా ఉన్నాడని నక్షత్ర నాటకం ఆడుతుంది.

Continues below advertisement

నక్షత్ర: నిన్న అంతా ఫోన్‌ సైలెంట్‌లో ఉండిపోయింది మమ్మీ అందుకే లిఫ్ట్‌ చేయలేదు.

అపూర్వ: ఫోన్‌ సైలెంట్‌ లో ఉందా..? ఇంకా నువ్వు  ఆ చెర్రి గాడిని చంపేస్తావు అనుకున్న..

Continues below advertisement

నక్షత్ర: ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నేను చెర్రిని చంపేయడం ఏంటి..? తను నా హస్బెండ్‌

అపూర్వ: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావే ఇక్కడి నుంచి వెళ్లినప్పుడు ఏం చెప్పావో మర్చిపోయావా..?

నక్షత్ర: ఎస్‌ మర్చిపోయాను. తాళి కట్టించుకున్న భార్యగా చెర్రితో నడవాలనుకుంటున్నాను. ఈ హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తూ.. రొమాన్స్‌ కూడా చేయాలనుకుంటున్నాను. నాకు పిల్లలు పుడితే హాయిగా ఆడించు మమ్మీ..

చెర్రి: నక్షత్ర ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను.

అంటూ చెర్రి బయటకు వెళ్తాడు.

సుజాత: అమ్మాయి నేను చెప్తాను కదా..? దీపాన్ని హారతి కర్పూరాన్ని పక్కన పెడితే అంటుకుంటుందని..నమ్మావా..? నువ్వు నా మాట నమ్మావా..?

అపూర్వ: నువ్వు నోరు మూసుకుని ఉండు పిన్ని.. నేనసలే టెన్షన్‌తో చచ్చిపోతున్నాను. ఏయ్‌ నక్షత్ర ఏం అంటున్నావే.. ఏంటి అక్కడికి వెళ్లాక వాడు ఏమైనా నీకు మందు పెట్టాడా..? ఇంతలా మారిపోయావు..

నక్షత్ర: మందు పెట్టలేదు మాకు పెట్టలేదు.. ఇప్పటి దాకా వాడు నా పక్కనే చచ్చాడు. అందుకే అలా మాట్లాడాను. నేను మారిపోయినట్టు నటిస్తున్నాను. మీరు కూడా మారిపోయాను అనుకుని కంగారు పడ్డావా ఏంటి..?

అపూర్వ: కంగారు పడటం కాదు నేనే అరకు వచ్చి మీ ఇద్దరిని అక్కడికక్కడే చంపేయాలనుకున్నాను. అంతలా నమ్మించేశావు.

నక్షత్ర: నమ్మించకపోతే మీ కూతురును ఎలా అవుతాను మమ్మీ. ఇక్కడ మూలకొండమ్మ తల్లి ఫేమస్‌.. ఆ తల్లికి ఒకరిని బలి ఇచ్చినట్టు నేను ఆ చెర్రి గాడిని ఆ ప్రకృతికి బలి ఇస్తాను. మమ్మీ వాడు వస్తున్నట్టున్నాడు ఉంటాను.

అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది నక్షత్ర. చెర్రి ఒక ప్లవర్‌ తీసుకుని వస్తాడు.

చెర్రి: నక్షత్ర నా ప్రేమకు గుర్తుగా గులాబీ పువ్వు తీసుకొద్దామని ట్రై చేశాను. కానీ ఈ మందారపువ్వు దొరికింది. ప్రేమ చూపించడానికి ఏ పువ్వు అయితే ఏంటని నా ప్రేమకు గుర్తుగా ఈ మందారపువ్వు ఇస్తున్నాను. నక్షత్ర మధ్యలో ఆగిపోయిన మన రొమాన్స్‌ ను మళ్లీ కంటిన్యూ చేద్దామా..?  

అని చెర్రి అడగ్గానే.. నక్షత్ర సిగ్గు పడుతుంది. చెర్రి నవ్వుతూ నక్షత్ర దగ్గరకు వెళ్తాడు. మరోవైపు గగన్‌ను అరెస్ట్ చేసిన స్టేషన్‌కు వెళ్తారు భూమి, కేపీ. భూమి కోపంగా ఎస్పీ సూర్య చాంబర్‌ లోకి వెళ్తుంది.

సూర్య: ఏంటి ఇద్దరూ ఇలా వచ్చారు..?

భూమి: ఎస్పీ గారు మీరు మా వారిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారని తెలిసింది. మా వారు ఎక్కడున్నారు..?

సూర్య: ఇంటరాగేషన్‌ సెల్‌ లో ఉన్నాడు.

భూమి: మా మామయ్యను మీరు చంపబోతుంటే.. అయన అడ్డుకుని మిమ్మల్ని కొట్టాడని మీరు ఇదంతా చేస్తున్నారు.

సూర్య: నేను ఇదంతా చేస్తున్నానని నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా..? భూమి.

భూమి: జరిగిందంతా మర్చిపోయి మా ఆయన్ని మర్యాదగా వదిలేయండి ఫ్లీజ్‌.. లేదంటే మీకే నష్టం..

అంటూ భూమి వార్నింగ్‌ ఇచ్చి స్టేసన్‌ నుంచి వెళ్లిపోతుంది. ఎస్పీ సూర్య కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!