Brahmamudi Serial Today Episode: ఇంట్లో బోర్ కొడుతుందన్న కావ్య, అప్పులను ఎంటరటైన్‌ చేయడానికి కళ్యాణ్‌, రాజ్‌ గేమ్ ఆడాలని అందరిని పిలిచి చెప్తారు. ఆ గేమ్‌ ఏంటంటే కొన్ని చీటీలు రాసి అందరూ ఒక్కొక్కరుగా ఆ చీటీలు తీయాలి ఎవరికి ఏం వస్తే అది చేయాలని చెప్తారు. అందరూ రెడీగా ఉంటారు.

Continues below advertisement

రాజ్: ముందు ఎవరితో మొదలు పెట్టాలి..? ఆ తాతయ్య ముందు మీరే తీయండి (సీతారామయ్య  చీటీ తీస్తాడు) మంచి పద్యం పాడాలి తాతయ్య

అని చెప్పగానే..  ఆయన పద్యం చెప్తాడు..

Continues below advertisement

ప్రకాష్‌: నాన్న నువ్వు సూపర్‌

రాజ్‌: సూపర్‌ తాతయ్యా.. సూపర్‌ అరేయ్‌ ఇప్పుడు ఎవరితో తీయిద్దాం

కళ్యాణ్‌: మా అమ్మా నాన్నలతో తీయిద్దాం అన్నయ్య

రాజ్: బాబాయ్‌, పిన్ని వచ్చేయండి కమాన్‌.. బాబాయ్‌ ముందు నువ్వు తీస్తావా..? పిన్ని తీస్తుందా..?

ప్రకాష్‌: మీ పిన్నిని తీయమను

ధాన్యలక్ష్మీ చీటీ తీస్తుంది. ఇద్దరు కలిసి డాన్స్‌ చేయాలని రావడంతో ఇద్దరూ డాన్స్‌ చేస్తుంటారు.

కావ్య: ఏవండి మీరు ఇటు రండి నా పక్కకు

ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ డాన్స్‌ అయిపోతుంది.

కళ్యాణ్‌: నెక్ట్స్‌ ఎవరు అన్నయ్యా

రాజ్: నెక్స్ట్‌ రాహుల్‌, స్వప్న.. రండి.. రండి

రాజ్‌: మీ ఇద్దరిలో ఎవరు తీస్తారు

రాహుల్‌: స్వప్న తీస్తుంది

వాళ్లిద్దరి ఫర్మామెన్స్‌ చేసి వెళ్లిపోతారు.

కళ్యాణ్‌: అన్నయ్య నెక్స్ట్‌ ఎవరిని పిలుద్దాం

రాజ్: నెక్స్ట్‌ అత్తను పిలుద్దాం.. అత్త రా చీటీ తీయ్‌..

రుద్రాణి కి సినిమా డైలాగ్‌ చెప్పాలని వస్తుంది. రుద్రాణి డైలాగ్‌ చెప్పగానే.. ఇందిరాదేవి భయపడుతుంది.

ఇందిరాదేవి: అదేంటే అలా భయపెట్టి చచ్చావు.. దడుసుకున్నాను..

రుద్రాణి: ఎలా ఉంది నా డైలాగ్‌..

ధాన్యలక్ష్మీ: బాలయ్య బాబు చెబితే ఓల్టేజీలా ఉంటుంది. నువ్వు చెబితే డ్రైనేజీలా ఉంది.

రాజ్‌: నెక్స్ట్‌ ఎవరు..? అరే కళ్యాణ్‌ నువ్వు తీయరా..?

అనగానే కళ్యాణ్‌ చీటీ తీస్తాడు. అప్పు వచ్చి కళ్యాణ్‌తో కలిసి ఫర్మామెన్స్‌ చేస్తుంది.

రాజ్: ఏంటి ఇంత ఈజీగా గెస్‌ చేశారు

కళ్యాణ్‌: సూపర్‌ కపుల్స్‌ అన్నయ్య మేము

రాజ్‌: సరే కానీ నెక్స్‌ ఎవరిని పిలుద్దాం.. అత్తాకోడళ్లను పిలుద్దామా

కళ్యాణ్‌: ఓకే అన్నయ్య పిలిచేయ్..

అపర్ణ, ఇందిరాదేవిని పిలుస్తారు. ఇద్దరూ వెళ్లి చీటీ తీస్తారు.

రాజ్: ఇద్దరూ కలిసి డ్రామా ప్లే చేయాలి.. అవును కళావతి నువ్వు కషాయం తాగావా..?

కావ్య: తాగలేదండి..

రాజ్‌: నువ్వు కషాయం తాగే టైం ఇది ఉండు నేను వెళ్లి తీసుకొస్తాను

అని రాజ్‌ లోపలికి వెళ్తాడు.

రాహుల్‌: మమ్మీ రాజ్‌ కారు కీ తీసుకురావడానికి ఇదే కరెక్ట్‌ టైం

రుద్రాణి: అయితే వెళ్లి తీసుకురాపో

అనగానే రాహుల్‌ దొంగతనంగా రాజ్‌ రూంలోకి వెళ్లి కారు కీ తీసుకొస్తాడు. ఇంతలో రాజ్‌ కూడా లోపలి నుంచి కషాయం తీసుకొచ్చి కావ్యకు వద్దంటున్నా తాగిస్తాడు. తర్వాత రేఖ డాన్స్‌ చేయాలని రావడంతో ఒక్కదాన్నే చేయలేనని ఎవరైనా తోడుగా రమ్మని అడుగుతుంది. ఎవ్వరూ రాకపోతే రాజ్‌ను పిలుస్తుంది. రాజ్ భయపడుతూనే డాన్స్‌ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!