Meghasandesam Serial Today Episode:  భూమి నిన్ను ప్రేమిస్తుందా..? అని ఇందు అడుగుతుంది. నువ్వు మరి అంత ఎగ్జైట్‌ అవ్వొద్దే… ప్రేమిస్తుందని వీడి ఫీలింగ్‌ అని బిందు చెప్తుంది. భూమి వీడిని ప్రేమిస్తుంది అన్న భ్రమలో ఉన్నట్లు ఉన్నాడు. భూమి అందరినీ భోజనానికి పిలిచిందనుకో.. వీడినే స్పెషల్‌గా పిలిచిందని ఫీల్‌ అవుతాడు. దీంతో చెర్రి ఇప్పుడేంటే భూమి నన్ను ప్రేమిస్తుందని నీకు ఫ్రూవ్‌ చేయాలా..? ఎలా చేయాలో చెప్పు అని అడుగుతాడు చెర్రి. అయితే నక్షత్ర కేక్‌ కట్‌ చేశాక చిన్న కేక్‌ ముక్క నువ్వు తినిపించు తిన్నదనుకో భూమి నిన్ను ప్రేమిస్తుందని అర్థం అని బిందు చెప్పగానే సరే అంటాడు చెర్రి. మరోవైపు భూమి టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతుంటే ప్రసాద్‌ వస్తాడు.

ప్రసాద్‌: భూమి ఏంటమ్మా టెన్షన్‌గా ఉన్నావు.

భూమి : ఆయన నాకు కేక్‌ తినిపిస్తా అన్నారు మామయ్య..

ప్రసాద్‌: తినిపిస్తే తిను ఎందుకు టెన్షన్‌..

భూమి: ఆయన కేక్‌ తినిపిస్తే నాన్న చూస్తారు కదా మామయ్యా.. మళ్లీ గొడవ అవుతుంది.

ప్రసాద్: అవునమ్మా సరేలే ఏదో ఒకటి చేద్దాం..

ఇంతలో కేక్‌ కటింగ్‌ అవుతుంద అందరూ రండి అంటూ అపూర్వ పిలుస్తుంది. శరత్‌ చంద్ర మంత్రిని తీసుకుని కేక్‌ కటింగ్‌ దగ్గరకు వస్తాడు. నక్షత్ర కేక్‌ కట్‌ చేయబోతుంటే మినిస్టర్‌ ఆపి గగన్‌ దూరంగా నిలబడ్డావేంటి..? దగ్గరకు రా అని పిలుస్తాడు. గగన్‌ రాకుండా అలాగే ఉంటే.. ఓ శరత్‌ చంద్ర పిలిస్తే వస్తావా..? అంటూ శరత్.. గగన్‌ను దగ్గరకు రమ్మని పిలువు అని చెప్పగానే.. శరత్‌ చంద్ర పిలుస్తాడు. గగన్‌ దగ్గరకు వెళ్తాడు.

శరత్‌: అమ్మా భూమి నువ్వెందుకు నెర్వస్‌గా ఉన్నావు వచ్చి నక్షత్ర పక్కన నిల్చో

భూమి: మామయ్యా నాన్న పిలుస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది.

ప్రసాద్‌: నాకు భయంగా ఉందమ్మా.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. సరేలే నువ్వు వెళ్లు .. భూమి వెళ్లమ్మా పిలుస్తున్నారుగా…

శరత్‌: రామ్మా.. ఇక్కడ నుంచో..

ఇందు: అరేయ్‌ చెర్రి ఇది నీకు మంచి అవకాశం రా.. కేక్‌ తినిపించడం ఈజీ..

చెర్రి: అవును కేక్‌ తినిపించడం చాలా ఈజీ. కాకపోతే ఈ కథలో హీరో నేనే కదా..? అన్నయ్యతో పాటు నాకు ఇంపార్టెంట్‌ ఉండాలి కదా..? మామయ్య నన్ను పిలవడే..

సుజాత: ప్రతి బ్రేక్‌ నీకు బాకులా తగులుతుంది కదూ.. నువ్వు ఎంత తిట్టుకున్నా సరే నాకా మినిస్టర్‌ అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడిలా కనిపిస్తున్నాడు.

నక్షత్ర కేక్‌ కట్‌ చేయబోతుంటే.. చెర్రి ఆగండి అని శరత్ చంద్రను అడిగి గగన్‌ పక్కకు వెళ్లి నిల్చుంటాడు. నక్షత్ర కేక్‌ కట్ చేస్తుంది. భూమి టెన్షన్‌ పడుతుంది. ఇంతలో కరెంట్‌ పోతుంది. చీకట్లో చెర్రి, నక్షత్రకు.. గగన్‌, భూమికి కేక్‌ తినిపిస్తారు. నక్షత్ర మాత్రం తనకు గగనే కేక్‌ తినిపించాడు అనుకుంటుంది. చెర్రి తాను భూమికి కేక్‌ తినిపించాను అనుకుంటాడు. ఇంతలో కరెంట్‌ వస్తుంది. భూమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ప్రసాద్‌: భూమి అంతా ఓకేనా…

భూమి: అంతా ఓకే కానీ కరెక్టు టైంకు కరెంట్‌ పోయింది మామయ్యా..

ప్రసాద్‌: ఆ పవర్‌ ఆపింది నేనే భూమి..

తర్వాత నక్షత్రకు అపూర్వ, శరత్‌ చంద్ర బర్తుడే విషెష్‌ చెప్తారు. వెంటనే శరత్‌ చంద్ర ఇప్పుడు చెప్పమ్మా నీకేం కావాలో అని అడుగుతాడు. గగన్‌, భూమి, ప్రసాద్‌, అపూర్వ, సుజాత టెన్షన్‌ పడుతుంటారు. ఇంతలో భూమి పక్కకు వెళ్లి నక్షత్రకు ఫోన్‌ చేస్తుంది. గిఫ్టుగా గగన్‌ గారిని అడుగుతున్నావా..? నువ్వు అడిగితే అంకుల్ ఓప్పుకుంటాడా..? ఒకవేల ఒప్పుకుని నీకోసం గగన్‌ కాళ్లు పట్టుకుంటే నా శత్రువు నా కాళ్లు పట్టుకున్నాడని హ్యాపీగా ఫీలువుతాడు అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తుంది. నక్షత్ర, శరత్‌ చంద్రకు తర్వాత అడుగుతానని చెప్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!