Meghasandesam Serial Today Episode: నక్షత్ర అనే ఎరను గగన్ గాడికి వేసి సోర చేప అనే భూమిని చంపేస్తాను అంటుంది అపూర్వ. ఒక్కదెబ్బతో ఆ భూమిని పైకి పంపిస్తాను. ఆ గగన్ గాణ్ని పాతాళంలోకి పంపిస్తాను. అంటుంది. మరోవైపు భూమిని పక్కకు తీసుకెళ్లి నీ దగ్గర హద్దు దాటితే ఆ గగన్‌ను కొడతానని మాటివ్వు అంటాడు. సరేనని బాధతో మాటిస్తుంది భూమి. మరోవైపు శరత్ చంద్ర సిట్టింగ్ కోసం అంతా రెడీ చేస్తాడు చెర్రి. శరత్ వచ్చి నా బ్రాండ్ ఏదిరా అంటే నేనే తీసేశాను డాడీ అంటూ నక్షత్ర వచ్చి స్పెషల్ బ్రాండ్ చూపిస్తూ మీ కోసమే దుబాయ్ నుంచి తెప్పించాను అంటుంది. ఆ మందు బాటిల్ తీసుకుని వెళ్తుంటే భూమి వస్తుంది.
భూమి: బాగుంది అంకుల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని డ్రింక్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. మీరు ఎంజాయ్ చేద్దామన్నట్లుగా వెళ్తున్నారు.
శరత్: అది కాదు భూమి..
అపూర్వ: నువ్వు ఆగు బావ.. చూడు భూమి ఎంత మన అనుకున్నా పరాయికి మనకు ఎంతో తేడా ఉంటుందని ఇప్పుడు నువ్వు ఫ్రూవ్ చేస్తున్నావు.
శరత్: అపూర్వ అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు. భూమికి నిజం తెలియదు కదా..?
అపూర్వ: నేను అదే చెప్తున్నాను బావ.. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి.
శరత్: సరే శాంతించు.. చూడమ్మా భూమి నా శోభాచంద్ర దూరం అయ్యే వరకు నాకు డ్రింక్ అలవాటే లేదు. తనను మర్చిపోవడం కోసమే తాగడం మొదలుపెట్టాను. ఇలాంటి అకేషన్‌లో శోభాచంద్ర లేదనే బాధతో తాగుతాను.
భూమి: సారీ అంకుల్ మిమ్మల్ని తప్పుగా అర్తం చేసుకుని అలా మాట్లాడేశాను. తాగితే మీ మనసులో ఉన్న శోభాచంద్ర గారు వెళ్లిపోతారా..? తాగుతున్నంత సేపు మీరు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా..?
శరత్: లేదు.. ఇంకా తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి.
భూమి: ఎక్కువ అవుతున్న కొద్ది మీరు ఇంకా ఎక్కువ తాగుతూనే ఉంటారు.
అపూర్వ: చాల్లే ఆపు. నీ మాటలు వింటూ పోతే బావను ఇంకా ఎక్కువ తాగించేలా ఉన్నావు.
శరత్: సారీ భూమి ఇది నువ్వు నా బలహీనత అనుకున్నా పర్వాలేదు.
అంటూ వెళ్లి శరత్ చంద్ర తాగడానికి వెళ్తాడు. అపూర్వ దగ్గరకు వచ్చి నేను చెప్తేనే మానని బావ నువ్వు చెప్తే వింటాడా అంటుంది. ఈ క్షణంలోనే ఆయనతో మందు మాన్పించకపోతే నేను ఆయన కూతురినే కాదు అంటూ వెళ్లి నాకు పోయి చెర్రి అని అడుగుతుంది. అందరూ షాక్ అవుతారు. భూమి తన మాటలతో శరత్ ను కన్వీన్స్ చేస్తుంది. ఈరోజు నుంచి నేను మందు తాగడం లేదు అంటాడు శరత్. తర్వాత భూమి ఒక్కతే ఉండటం చూసిన పూరి, శారద దగ్గరకు వెళ్తుంది.
పూరి: అమ్మా వెజిటేబుల్స్ కడగడానికి భూమి టాప్ దగ్గరకు వచ్చింది. ఎవ్వరూ లేరమ్మా ఒక్కతే ఉంది. నీ కోడలిగా రావడానికి ఇష్టమే అంది అనుకో.. ఇంకేం ఆలోచించకు.. చేయి పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చేయ్.
శారద: అబ్బా ఏం చెప్పావే.. ముందు భూమి మనసులో ఏముందో కనుక్కోనివ్వు..
పూరి: అమ్మా సరేలే మాటలతో టైం పాస్ చేయకు మళ్లీ ఇలాంటి టైం రాదు..
శారద: ఆ వెళ్తానులే..
అంటూ శారద కూడా కూరగాయలు తీసుకుని టాప్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో భూమి దగ్గరకు నక్షత్ర వెళ్లి ఆ వెజిటేబుల్స్ నేను కడుగుతాను అంటుంది. సరే కడుగు అని భూమి వెళ్లిపోతుంది. అటు పక్కగా వచ్చిన శారద వెజిటేబుల్స్ కట్ చేస్తూ.. అమ్మా నీతో మాట్లాడదామని వనభోజనాల పేరు మీద ఇక్కడి దాకా వచ్చాము అంటుంది. నక్షత్ర ఆశ్చర్యంగా నాతో మాట్లాడటానికి వచ్చారా..? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని నక్షత్ర అనగానే ఎప్పటి నుంచో నిన్ను కోడలిగా చేసుకోవాలని ఆశ పడుతున్నాను అమ్మా.. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అంటుంది శారద. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!