Meghasandesam Serial Today Episode : చెర్రి దగ్గరకు  వెళ్లి భూమి బాధపడుతుంది. ఏమైందని చెర్రి అడుగుతాడు. ఏం జరిగిందో నీకు తెలియదా..? చెర్రి మీ అన్నయ్యను ఆ ఫ్యామిలీ మొత్తాన్ని బాధపెడుతున్నాను. దానికే గిల్టీగా ఉంది అంటుంది. దీంతో అలాంటి ప్రపోజల్‌తో వస్తాడని నువ్వూ ఊహించలేదు. అలా రియాక్ట్‌ అవుతావని అన్నయ్యా ఊహించి ఉండడు. దానికి  నువ్వేం చేస్తావు అని చెప్తుండగానే.. శరత్‌ చంద్ర వచ్చి భూమిని పిలుస్తాడు.

భూమి: చెప్పండి నాన్నా..

శరత్‌: నాకో ఆలోచన వచ్చింది అమ్మా..అది వెంటనే నీతో పంచుకుందామని వచ్చాను.

భూమి: ఏంటి నాన్నా అది..

శరత్‌: నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అమ్మా..

భూమి: ఇప్పటికిప్పుడే పెళ్లేంటి నాన్నా..?

శరత్‌: పెళ్లంటే వెంటనే జరిగేది కాదు కదమ్మా..? కాస్త టైం పడుతుంది. నేను చూసే సంబంధం ఎలా ఉంటుందంటే ఆ గగన్‌ గాడు ఆ స్థాయి నేను ఎప్పటికీ అందుకోలేను అనుకునేంత. నీ కన్న వాళ్లు రేపు నిన్ను కలుసుకున్నప్పుడు  ఇంత గొప్ప సంబంధం మేమైతే చూడలేకపోయేవాళ్లం అనేంత.

భూమి: ఇప్పటికిప్పుడు నా పెళ్లికి తొందరేం వచ్చింది నాన్నా..?

శరత్‌: వచ్చింది అమ్మా.. పెళ్లి జరగనంత కాలం.. ఆ గగన్‌ గాడు మన ఇంటి చుట్టూ కుక్కలా తిరుగుతూనే ఉంటాడు. ఇలా ఓంటరిగా ఉంటే వాడి వలన నీకు ఎప్పటికైనా ప్రమాదమే.. నువ్వు ఎక్కడికి వెళ్లినా వాడు నిన్ను ఫాలో అవుతూనే ఉంటాడు. అది మన ఇద్దరికీ డిస్టర్బ్‌ . అదే నీ పెళ్లి అయిపోయింది అనుకో వాడి తలనొప్పి వదిలిపోతుంది.

భూమి: అది కాదు నాన్నా ఇప్పుడే కదా నన్ను దత్తత తీసుకుంటున్నారు. ఇదే ఇంట్లో ఉంటూ నాన్నా అని మిమ్మల్ని పిలిచే అదృష్టం నాకు దక్కనివ్వండి నాన్నా.

శరత్‌: నువ్వు ఏ ఇంట్లో ఉన్నా నన్ను నాన్నా అని పిలుస్తావు అమ్మా.. విషయం అది కాదు నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది. ఆ గగన్‌ అనే వెధవను నువ్వు ఎలాగూ ప్రేమించడం లేదు. ఎవ్వరిని ప్రేమిస్తున్నావో ఈ నాన్నకు నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు.. నేను నీ ప్రేమకు ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా.. అంగరంగవైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. చెప్పమ్మా ఎవరా అబ్బాయి.

భూమి: నాన్నా.. అది..

శరత్‌: పోనీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్న మాట నిజమా కాదా..? అదైనా చెప్పు..

భూమి: నిజమే నాన్నా.. ప్రేమిస్తున్నాను.

పక్క నుంచి అంతా వింటున్న చెర్రి ఆనందంతో భూమి తననే ప్రేమిస్తుంది అనుకుంటాడు.

శరత్‌: మరి ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమిస్తున్న వాడి వివరాలు చెప్పడానికి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు.

భూమి: టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాన్నా.. అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు.

శరత్‌: సరేనమ్మా ఆ గగన్‌ గాడి వల్ల డిస్టర్బ్‌ అవుతున్నావనీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీ మనసులో ఒకడు ఉన్నాడంటున్నావు కదా.. ఇక ఎప్పటికీ ఆ గగన్‌ గాడు నీకు ఎప్పటికీ దగ్గర కాలేడు. నాకు ఆ ధైర్యం చాలమ్మా..

అంటూ శరత్‌ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నక్షత్ర గగన్‌ దగ్గరకు వెళ్తుంది.

నక్షత్ర: చూడు బావ నువ్వు భూమిని ప్రేమించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆ భూమి చేతిలో అవమానానికి గురయ్యావు. ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడ్డావేంటి బావ.

గగన్‌: చూడు నక్షత్ర మంచితనానికి, మూర్ఖత్వానికి, అణుకువకు, అహంకారానికి మధ్య తేడా నీకెప్పటికీ అర్థం కాదు నక్షత్ర 

అంటూ చెప్పి గగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిన్ను దక్కించుకోవడానికి నన్నేం చేయమంటావు అని అడుగుతుంది నక్షత్ర. నువ్వేం చేసినా నేను దక్కను అంటాడు గగన్‌. దీంతో ఎందుకు అని అడుగుతుంది నక్షత్ర. ఎందుకంటే నువ్వు శరత్‌చంద్ర కూతురువి అంటాడు గగన్‌. నేను నీ కోసం చావడానికైనా రెడీ బావ అంటూ బిల్డింగ్‌ మీద నుంచి కిందకు దూకబోతుంది నక్షత్ర.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!