Meghasandesam Serial Today February 15th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కాళ్లు పట్టుకున్న అపూర్వ – గగన్‌ను చంపేందుకు ప్రయత్నించిన శరత్‌చంద్ర
Meghasandesam Today Episode: నక్షత్ర, గగన్‌ను ప్రేమిస్తుందన్న విషయం శరత్‌చంద్రకు చెప్పొద్దని అపూర్వ గగన్‌ను వేడుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : ఐసీయూలో నక్షత్రను చూసి అపూర్వ ఏడుస్తుంది. గగన్ దగ్గరకు వెళ్లి తనకో సాయం చేయాలని ప్రాధేయపడుతుంది. నీలాంటి దానికి నేను ఎప్పటికీ సాయం చేయనన గగన్ చెప్తాడు. నక్షత్ర నిన్ను ప్రేమించిందని తెలిస్తే మా బావ చంపేస్తాడని ఆయనుక ఈ విషయం చెప్పొద్దని అడుగుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన శరత్చంద్ర కోపంగా గగన్ దగ్గరకు వెళ్తాడు.
శరత్: అపూర్వ వాడితో మాటలేంటి..? ఏంటి వీడితో మాటలు..
అపూర్వ: అదీ… నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతున్నాను బావ.
శరత్: ఇంకా నీకు అర్థం కాలేదా..? అపూర్వ. భూమిని నేను వీడికి దూరం చేస్తున్నానన్న అపోహతోనో అక్రోషంతోనో వీడు మన నక్షత్రను చంపేయాలనుకున్నాడు. ఇంకా చావలేదని తెలిసి చంపడానికి మళ్ళీ ఇక్కడకు వచ్చాడు. అంతే కదరా..?
గగన్: శరత్ చంద్ర ఫస్ట్ నేను చెప్పేది విను.
శరత్: ఏంట్రా నువ్వు చెప్పేది. నేను వినేది. తిరిగి స్పృహలోకి వస్తే గాని బతుకుతుందో లేదో తెలియని పరిస్థితుల్లోకి మా నక్షత్రను నెట్టేసి ఇంకా నువ్వేంట్రా చెప్పేది. అసలు నక్షత్రను ఎందుకు చంపాలనుకున్నావు. చెప్పరా..? చెప్పరా..?
అంటూ శరత్ చంద్ర గగన్‌ను కొడుతుంటాడు. గగన్ చెప్పబోతుంటే వెనక నుంచి అపూర్వ ఏడుస్తూ.. చేతులెత్తి మొక్కుతూ.. గగన్‌ను చెప్పొద్దని సైగ చేస్తుంది. గగన్ చెప్పకుండా ఉండిపోతాడు.
శరత్: నా కూతురిని చంపాలనుకున్న నిన్ను నేను కొట్టడమేంట్రా.. కొట్టకూడదు..
అంటూ కోపంగా పక్కకు వెళ్లి సిజేరియన్ చేసే కత్తి తీసుకుని గగన్ ను పొడవడానికి వెళ్తాడు. గగన్ చేయి పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. గగన్ చేయి కట్ అవుతుంది.
అపూర్వ: బావ వదిలేయ్.. బావ చాలు వదిలేయ్ బావ.. ఏదో పని మీద వచ్చాడని చెప్పాడు కదా.. అదే నిజమేమో..
శరత్: నిజం కాదు అపూర్వ..
అపూర్వ: బావ వదిలేయ్ బావ మనకు ఈ గొడవంతా ఎందుకు..? నక్షత్ర స్పృహలోకి వచ్చి నిజం చెప్తుంది కదా..? బావ అంతవరకు వదిలేయ్ బావ. దూరం నుంచి అంతా చూస్తున్న భూమి ఏడుస్తుంది.
శరత్: రేయ్ నా కూతురుకు ఏమైనా అయినా ఇదే నీకు ఆఖరు రోజు గుర్తు పెట్టుకో..
అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు శరత్ చంద్ర. గగన్ చేయి చూసి ఏడుస్తుంది భూమి. పక్కనే ఉన్న చందు సిస్టర్‌ను పిలిచి గగన్ చేతికి కట్టు కట్టిస్తాడు. సిస్టర్ కట్టు కడుతుంటే భూమి దగ్గరకు వెళ్లి గగన్ చేయి చూసి ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది.
భూమి: శరత్ చంద్ర అంకుల్ మీద తిరగబడినట్టు యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు కదా..?
గగన్: మనసులో ఉన్నది చెప్పడమే నాకు తెలుసు. ఏదో ఒకటి చెప్పడం నాకు రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పా అబద్దాన్ని అడ్డం పెట్టుకుని దాక్కోవడం నాకు అసలు రాదు.
భూమి: దాక్కోవడం రాదని చెప్పి అవమానపడుతూ అక్కడే నిలబడిపోతారా..?
గగన్: ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి. నేను నిన్ను ఇవ్వమని అడిగింది ప్రేమ. అది నీ దగ్గర లేదని చెప్పావు. నీ జాలి, నీ సానుభూతి నాకు అవసరం లేదు.
అంటూ చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!