Meghasandesam Serial Today Episode:  ఇంతకీ మా అబ్బాయి ఏమన్నాడు అని ప్రసాద్  అడగ్గానే మీ అబ్బాయి చిలిపియే కాదు మామయ్యా.. తెలివైనోడు కూడా.... నేను ప్రేమిస్తున్నాను అని  నా మనసులో మాట కనిపెట్టేశాడు మామయ్యా అంటుంది భూమి. సరేలేమ్మా నీకు ఐలవ్యూ చెప్పే శ్రమ తప్పించాడు అని ప్రసాద్ చెప్పగానే ఏమో మామయ్య నేను ప్రేమించాను అని చెప్పాక ఇక ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉందని చెప్తుంది. సరేలే నువ్వు వెళ్లు అంటాడు ప్రసాద్‌. భూమి వెళ్లిపోతుంది.


   మరోవైపు గగన్‌ హ్యాపీగా రూంలోంచి రావడం చూసిన శరత్‌ చంద్ర కోపంగా చూస్తూ..   మినిస్టర్‌ను అడ్డుపెట్టుకుని రాకుంటే.. ఎప్పుడో నిన్ను చంపేవాణ్ని అంటాడు. నేను కూడా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను ఎందుకో తెలుసా..? భూమికి షెల్టర్‌ ఇస్తున్నావన్న కారణంతో ఒక్కసారి తన గుండెల్లో నేను ఉన్నానని తెలిస్తే.. నీ గుండెల మీద తన్ని తనను తీసుకెళ్తాను అని చాలెంజ్‌ చేస్తాడు గగన్‌. భూమి నా కూతురురా ఎప్పటికీ నిన్ను ప్రేమించదు.. ప్రేమించనివ్వను అంటాడు శరత్‌ చంద్ర. భూమి నిజంగా నీ కూతురే అయితే ప్రాణం అయినా వదిలేస్తాను కానీ భూమిని మాత్రం ప్రేమించను అని వెళ్లిపోతాడు గగన్‌. తర్వాత శరత్ చంద్ర మందు తాగుతుంటే అపూర్వ వస్తుంది.


అపూర్వ: బావా ఏంటి బావా ఈ ఫ్రస్టేషన్‌.. మీరు ఇలా తాగడం ఏంటి..?


శరత్‌: ఆ గగన్‌గాడిని చూడగానే నీకు కోపం రాలేదా..? అపూర్వ..


అపూర్వ: వచ్చింది బావా.. కానీ వాడికి మనకు రక్షణ గోడలా ఆ మినిస్టర్‌ ఉన్నాడే మనం ఏం చేయగలం.


శరత్‌: ఏం చేయలేమనే వాడు రెచ్చిపోతున్నాడు. నా అహాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నాడు.


అపూర్వ: బావా వాడు మాట్లాడుతున్నాడని నువ్వు తాగుతూ వాడిని గెలిపిస్తున్నావు.


శరత్‌: నువ్వు చెప్పింది నిజమే అపూర్వ ఓటమితో కాదు అవమానంతో వాడు తల దించుకునే పని చేయాలని ఉంది. కానీ ఏం చేద్దాం ఏం చేద్దామన్నా మినిస్టర్‌ గారు ఉన్నారు.


అపూర్వ: బావా ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా మినిస్టర్‌ గారికి కంపెనీ ఇవ్వండి.


శరత్‌: సరే అపూర్వ


అంటూ శరత్‌ చంద్ర వెళ్లిపోతాడు. ఇంతలో సుజాత వస్తుంది. నేను అంతా చూస్తూనే ఉన్నాను. అల్లుడు గారు దువ్వని కుక్కలా హాల్లోకి వెళ్లిపోయాడు అంటుంది. దీంతో అపూర్వ కోపంగా బావను తప్పుగా మాట్లాడొద్దని వార్నింగ్‌ ఇస్తుంది. తర్వాత నక్షత్ర బయటకు వచ్చి గగన్‌ను చూసి కన్ను కొడుతుంది. అది చూసిన సుజాత షాక్‌ అవుతుంది.


సుజాత: అమ్మాయి మన అమ్మాయి కన్ను కొడుతుంది చూశావా..?


అపూర్వ: చూడలేదు పిన్ని నువ్వు కొంచెం సైలెంట్‌ గా ఉండు. నన్ను ఆలోచించుకోనివ్వు..


సుజాత: చూశావా..?


నక్షత్ర: గుర్తుంది కదా బావ నువ్వు కేక్‌ కట్‌ చేసి నాకు తినిపించాలి.


గగన్‌: తప్పకుండా కేక్‌ కట్‌ చేసి తినిపిస్తాను.. నీకు షాక్‌ ఇస్తాను.


నక్షత్ర: అది షాక్‌ అవ్వదు బావ ఇక్కడ అట్మాస్పియర్‌ షేక్‌ అవుద్ది..


భూమి: చూశారా.. మామయ్యా.. ఆ నక్షత్ర చాలా ఎక్కువ చేస్తుంది.


ప్రసాద్‌: ఎందుకమ్మా నక్షత్ర కన్ను కొట్టినంత మాత్రానా వాడు పడిపోతాడా ఏంటి..? నువ్వు వెళ్లి వాడితో మాట్లాడు.


అపూర్వ: ఏంటో వాడితో మాట్లాడుతున్నావు.


నక్షత్ర: వచ్చినందుకు థాంక్స్‌ చెప్తున్నాను మమ్మీ..


అపూర్వ: మనం థాంక్స్‌ చెప్పాలన్నా ఓ రేంజ్‌ ఉండాలి.


భూమి: ఏం చెప్పింది అది.


గగన్‌: కేక్‌ కట్‌ చేసి తినిపించమంది..


భూమి: మీరు అలా చేస్తే గొడవలు అవుతాయి..


గగన్‌: హలో ఏ హక్కుతో చెప్తున్నావు.. ఆ.. మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదూ..


భూమి: ప్రేమిస్తున్నానని నేను చెప్పానా..?


గగన్‌: అయితే నేను కేక్‌ తినిపిస్తాను.


భూమి: సరే మీకు నచ్చినట్టు మీరు ఉండండి.. కానీ కేక్‌ తినిపించిన మరుక్షణం మీతో మాటలు ఉండవు..


గగన్‌: అదేంటి నీకు కేక్‌ తినిపిస్తే మాట్లాడవా..?


భూమి: నాకెలా తినిపిస్తారు.


గగన్‌: చూశావా..? ఎలా తినిపిస్తానని అడుగుతున్నావు కానీ తినని అనడం లేదు


అంటాడు గగన్‌. దీంతో నేను తినను అంటుంది భూమి. మరోవైపు చెర్రి హడావిడిగా ఇందు వాళ్ల దగ్గరకు వెళ్లి మీరు ఇంకా రెడీ కాలేదా అని అడుగుతాడు. దీంతో మీ అమ్మ మీ చెల్లితో సూట్‌ కేసు పంపిస్తానని చెప్పింది అందుకే ఆగామని రమేష్‌ చెప్తుండగానే.. బిండు పాత బట్టలు ఉన్న సూట్‌ కేసు తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అప్‌సెట్‌ అయిన రమేష్‌, సౌందర్య, వంశీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!