Meghasandesam Serial Today Episode: పూరి కాలేజీలో తనను కొట్టిందని బిందు ఇంటికెళ్లి చెప్పగానే.. మీరా, అపూర్వ కోపంతో రగిలిపోతారు. కేపీ మాత్రం ఎందుకు కొట్టిందోనని ఆలోచిస్తుంటాడు. దీంతో బిందు భయంగా అనవసరంగా అమ్మకు చెప్పాను ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమిటో అని మనసులో అనుకుంటుంది.

Continues below advertisement

అపూర్వ: ఏంటి పూరి నిన్ను కొట్టడం ఏంటి..?

మీరా: బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావేంటే..? కొట్టిందని నాకు చెప్పావుగా అత్తయ్య అడిగితే చెప్పవేం..

Continues below advertisement

అపూర్వ: వాళ్లు ఎంత వాళ్ల బతుకులు ఎంత వాళ్లకు కూడా నువ్వు భయపడుతున్నావా…? బిందు.. నిజంగానే కొట్టిందా..?

బిందు: కొట్టింది అత్తయ్య..

మీరా: చూశావా వదిన ఆ పూరి అమ్మ శారద మొన్న నన్ను కొట్టింది. ఈ రోజు కూతురు నా కూతురును కొట్టింది. వాళ్లను ఇలాగే వదిలేస్తే వాళ్ల స్థాయికి మనం దిగజారిపోయాం అనుకుంటారు వదిన. వాళ్లదే పైచేయి అనుకుంటారు. వాళ్లను ఏదో ఒకటి చేయాలి వదిన

అపూర్వ: ఆ పూరి మన బిందును కొట్టింది అని తెలియగానే రక్తం సలసలా కాగడం మొదలుపెట్టింది మీరా..? ఈ ఆవేశంలో ఆ పూరి ఇంటికి వెళ్లి దాన్ని బయటకు లాక్కొచ్చి మరీ నాలుగు తన్నాలని ఉంది.

కేపీ: అపూర్వ గారు తన్నాలని ఉంది.. చంపాలని ఉంది అని మీరు ఆవేశపడే ముందు అసలు ఏం జరిగింది. ఏం జరిగితే కొట్టేంత వరకు వచ్చిందని తెలుసుకోరా..?

సుజాత: తెలుసుకోవాలి అమ్మాయి కేపీ చెప్తున్నాడు కదా తెలుసుకుని ఒకవేళ బిందుదే తప్పు అనుకుంటే మీరు కూడా బిందునే కొట్టాలి. అంతే కదా కేపీ..

కేపీ: మీరు కాస్త హద్దులో ఉంటే బాగుంటుందండి..

సుజాత: అవును అవును మీరాయే నిన్ను హద్దుల్లో పెట్టి ఉంటే ఈరోజు మీరు వాళ్ల వైపు మాట్లాడి ఉండేవారే కాదు.

మీరా: బాగా చెప్పారు అత్తయ్య గారు ఈయన సపోర్ట్‌ చూసుకునే వాళ్లు అంతకు అంతకు రెచ్చిపోతున్నారు.

కేపీ: అది కాదు మీరా..? నేను చెప్పేది

అపూర్వ: కేపీ కాస్త తగ్గుతావా..? చ నా పరిస్థితి ఇలా ఉండి ఉండకపోతే మన మధ్య ఇన్ని మాటలు ఉండేవి కాదు. ఇప్పటికే నేను వెళ్లి వాళ్ల ఇంటి ముందు ఉండేదాన్ని..

మీరా: నువ్వు వెళ్లకపోతే ఏంటి వదిన నేను వెళ్తాను. నీలాగే కొట్టలేకపోవచ్చు కానీ మాటలతో కొట్టగలను.. అడగాల్సిన నాలుగు మాటలు అడిగేసి కడిగేసి వస్తాను..

కేపీ: మీరా కావాలంటే నేను బిందును తీసుకెళ్లి వాళ్లతో మాట్లాడి వస్తాను.

మీరా: కావాలని ఏమీ కాదు.. కల్పించుకోని మరీ మాట్లాడేస్తారు మీరు. ఈ వంకతో ఆ శారదను చూద్దామనుకుంటున్నారు కదూ బిందును తీసుకుని నేనే వెళ్తాను. ఏ విషయం అనేది నేనే తేల్చుకుంటాను. నాతో పాటు మీరేమీ రానవసరం లేదు.

అని మీరా చెప్పగానే.. కేపీ మీరాను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు. మీరా అసలు కన్వీన్స్‌ కాదు. దీంతో బిందు అసలు నిజం తెలుస్తుందేమోనని భయపడుతుంది. ఇక గగన్‌ ఇంట్లో స్నానం చేయడానికి వెళ్తూ.. భూమి రాకముందే స్నానం చేయాలని అనుకుని బాత్రూంలోకి వెళ్తాడు. అప్పటికే అక్కడ భూమి ఉంటుంది. భూమిని చూసి గగన్ షాక్‌ అవుతాడు. ఇంతలో భూమి దగ్గరకు వచ్చి గగన్‌కు స్నానం చేయిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సిచ్యుయేషన్‌ మొదలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!