Nindu Manasulu Serial Today Episode ఐశ్వర్య పార్టీ అడగటంతో మా కేఫ్‌కి వచ్చేయ్ మంచి కాఫీ ఇస్తా అని ప్రేరణ అంటుంది. అక్కా అని ఐశ్వర్య అంటుంది. ఇక రంజిత్ ప్రేరణతో గణని దెబ్బకొట్టి పెళ్లి అయితే ఆపారు కానీ గణని ఆపడం కష్టం.. మీరు చేసిన పనికి వాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కచ్చితంగా మిమల్ని ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. వాడేంటో వాడి బుద్ధి ఏంటో తెలిసిన వాడిగా చెప్తున్నా ఇక నుంచి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రంజిత్ చెప్తాడు.
ఇందిర చాలా భయపడుతుంది. ఈశ్వరికి పెళ్లి ఆగిపోయినందుకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడుతూ చిరాకు పడుతుంది. గణ అయితే తను అనుకున్నవి ఏవీ జరగలేదు అని ధీనంగా శూన్యంలోకి చూస్తూ జరిగింది తలచుకొంటూ ఉంటాడు. ఇంతలో సుధాకర్ వచ్చి కావాలనే సానుభూతి చూపిస్తాడు. ఇంట్లో ఎంత సేపు ఉంటారు సార్ బయటకు వెళ్దాం అంటాడు. గణ వద్దని గసిరేస్తాడు. ఇంతలో ప్రేరణ వస్తుంది. అందరూ ఆరు బయట ఉండటం చూసి పర్లేదు డాక్టర్ చెప్పినట్లు నాన్నని చూసుకుంటున్నారని అంటుంది.
ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న నేను నీ కూతురిని అయినా కొడుకులా పెంచావు.. నీకు మంచి పేరు తేవాలని ఆశపడ్డావ్.. నీ ఆశలు నేను నెరవేర్చే పనిలో ఉంటే.. నీ కొడుకు గణ నీకు తలవంపులు తీసుకొచ్చేలా చేస్తున్నాడు. మీరు తలదించుకునే పరిస్థితి కలలో కూడా రాకుండా చేస్తాను నాన్న అని ప్రేరణ అంటుంది. సుధాకర్ ప్రేరణతో వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్లు అంటాడు. ఇంకా అయిపోలేదు నువ్వు వెళ్లి నాలుగు కాఫీ కప్పులు తీసుకురా అని అంటుంది.
సుధాకర్ వెళ్లి కాఫీ కప్పులు తీసుకొస్తాడు. ప్రేరణ ప్లాష్క్లోని కాఫీ పోసి జరిగిన దానికి ఎవరూ మంచి నీరు కూడా ముట్టరు అందుకే నేను నా చేతులతో చేసి కాఫీ తీసుకొచ్చా తాగండి రిలాక్స్ అవుతారు అని కప్పుల్లో పోస్తుంది. అక్కర్లేదు అని ఈశ్వరి వెళ్లిపోతుంది. గణ కూడా వద్దని కోపంగా చేయి చూపిస్తాడు. సుధాకర్ కాఫీ తీసుకొని తాగుతాడు. ప్రేరణ కూడా కాఫీ తాగుతూ ఎవరైనా మంచి చెప్తే వినాలి సుధా గారు.. సుధాగారు నేను మీ సార్తో మాట్లాడాలి మీరు కాస్త వెళ్లండి అని అంటుంది. మా సార్ చెప్తేనే వెళ్తా అని సుధా అంటాడు. గణ వెళ్లమని సైగ చేస్తాడు. సుధాకర్ కాస్త దూరం వెళ్లి ఎలా వార్నింగ్ ఇస్తుందో దూరం నుంచి చూద్దామని వెళ్లి చూస్తాడు.
ప్రేరణ గణతో మంచిగా చెప్పినప్పుడు వినాలి.. హెచ్చరిస్తే తగ్గాలి.. కానీ పవర్ ఉంది కదా అని దూకుడుగా వెళ్తే ఇదిగో నీలా ఇలా బొక్కాబొర్లా పడతారు. నీ విషయంలో నేను చేసింది100శాతం కరెక్ట్. ఇప్పటికీ మించి పోయింది లేదు. వర్షని పెళ్లి చేసుకో.. మా నాన్న కూడా సంతోషపడతాడు. ఏయ్ ఆపవే.. ఊరుకుంటున్నా అని రెచ్చిపోతున్నావ్.. ఆయన మా నాన్న మాత్రమే.. ఇప్పటికే నువ్వు నా విషయంలో చాలా జోక్యం చేసుకుంటున్నావ్.. అసలు నువ్వు ఎవరే.. ప్రతీ దాన్లో నన్ను అడ్డుకుంటున్నావ్.. రేపు దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని అంటాడు. దానికి ప్రేరణ అది నువ్వు అనుకుంటున్నావ్.. కానీ దేన్ని అయినా తట్టుకొని నిల్చొనే శక్తి నాన్న నాకు ఇచ్చారు.. నువ్వేం చేయలేవ్ అంటుంది. నువ్వు భయపడేలా నేను చేస్తా.. ఇప్పటి వరకు నువ్వు నాలో ఒక్క కోణాన్ని మాత్రమే చూశావ్, నేను కొట్టే దెబ్బ మీ కుటుంబం మొత్తానికి కొడతా.. ఎందుకు బతికి ఉన్నామా అనుకుంటావ్ అని అంటాడు. నేను చూస్తూ ఊరుకోను ఇంతకు ఇంత నీకు బుద్ధి చెప్తూనే ఉంటాను.. నీకు శిక్ష పడేలా చేస్తా అలా జరగకూడదు అంటే వర్షని పెళ్లి చేసుకో లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు అని అంటుంది. మొత్తానికి అన్నా చెల్లెళ్లు ఒకరికి ఒకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు.
సాహితి జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుంది. సిద్ధూ వచ్చి చెల్లి దగ్గర కూర్చొని జరిగింది తలచుకొని బాధ పడుతున్నావా అమ్మా.. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు బాధ పడటం ఎందుకు.. తప్పు చేసిన ఆ గణకి బుద్ధి చెప్పాం కదా మరి ఇంకా నువ్వు బాధ పడటం ఎందుకు అని అడుగుతాడు. దాంతో సాహితి అన్నని హగ్ చేసుకొని ఏడుస్తుంది. విజయానంద్ మనసులో సిద్ధూని చూసి నేను నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వు మాత్రం నా కూతురి జీవితం కాపాడావు అని అనుకుంటాడు. సిద్ధూ తండ్రితో ఏంటి మనసులో సంతోషం ఉన్నా పైకి బాధ నటిస్తున్నావా అని అడుగుతాడు. అలా ఏం లేదు సిద్ధూ అయినా నువ్వు నీ చెల్లిని కాపాడుకున్నావ్ కదా అంటాడు. నీకు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా పెళ్లి ఆపకుండా పైగా గణ మంచోడు అని పెళ్లికి అమ్మని, చెల్లిని ఎందుకు ఒప్పించావు.. ఇప్పటికైనా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావో చెప్పు అని అడుగుతాడు. ఈ టాపిక్ ఇక వద్దు అన్నయ్యా అని సాహితి అంటుంది.
విజయానంద్ సిద్ధూతో మీ అమ్మ నీకు ముఖం చూపించలేక బాధ పడుతూ ఆగదిలోనే ఉండిపోయింది సిద్ధూ.. ఎంతైనా కన్న పేగు కదా అంటాడు. పోనీలే అమ్మ ఇప్పటికైనా కళ్లు తెరిచింది. అమ్మ పూర్తిగా కళ్లు తెరిస్తే గణ కంటే మోసగాళ్ల గురించి తెలుస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా అని అంటాడు. విజయానంద్ మనసులో ఆ రోజు రానివ్వను అని అంటాడు. ఇంతలో ప్రేరణ ఇంటికి వస్తుంది. విజయానంద్ ప్రేరణతో ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నిన్ను మంజుల చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పిందే ఆంటీ అని ప్రేరణ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.
ప్రేరణ, సిద్ధూ మంజుల దగ్గరకు వెళ్తారు. విజయానంద్ కూడా వస్తాడు. నిన్ను కలవాలి అని రావాలి అనుకున్నా కానీ రాలేకపోయానమ్మా.. నిన్ను ఇక్కడికి రావొద్దని నేనే చెప్పా.. ఈ ఇంట్లోనే నిన్ను చాలా మాటలు అన్నాను.. అవమానించాను.. తిట్టాను.. ప్రేరణతో పాటు నిన్నూ అర్థం చేసుకోలేకపోయాను.. ప్రేరణని ఈ ఇంటికి రావొద్దని నా నోటితో నేను చెప్పాను.. ఇప్పుడు తనని ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను అంటుంది. మీరు అన్నదానికి నేను బాధ పడ్డాను కానీ అర్థం చేసుకున్నా ఆంటీ.. మీకు మీ బిడ్డలు అంటే మమకారం ఎక్కువ అందుకే అలా మాట్లాడారు అని అంటుంది. దానికి మంజుల మీ ఇద్దరూ నన్ను అర్థం చేసుకున్నారు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు ఇప్పుడు నాకు సాయం చేయాలి అని ఇద్దరి చేతులు పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.