Meghasandesam Serial Today Episode: కాలేజీలో శివ కోసం వెతుకుతుంది పౌర్ణమి. కాలేజీ మొత్తం తిరుగుతూ ఎదురైన వాళ్లందరినీ శివ గురించి అడుగుతుంది. ఎవ్వరిని అడిగినా తెలియదని చెప్తారు. దీంతో పౌర్ణమి వెతుకుతూనే ఉంటుంది. శివ మాత్రం బిందుతో కలిసి కలిసి ఎవ్వరికీ కనిపించకుండా కూర్చుని ఉంటాడు.
బిందు: ఈ రోజు ఏంటి చాలా అందంగా ఉన్నావు..
శివ: ప్రేమలో ఉన్నప్పుడు అలాగే కనిపిస్తారు. అయినా మా భూమి అక్క అందంగా ఉన్నట్టే నేను కూడా హ్యండ్ సమ్ గా ఉంటాను..
బిందు: తనకు నీకు పోలికేంటి.?
శివ: తను మా అక్క కదా..? చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాము..
బిందు: ( అనుమానంగా) కలిసి పెరగడమేంటి..?
శివ: అది ఆ విషయం వదిలేయ్ బిందు..
బిందు: లేదు శివ నువ్వు ఏదో దాస్తున్నావు..? నా కల్లల్లోకి చూసి నిజం చెప్పు..
శివ: చెప్తాను బిందు.. భూమి నిజంగా నా సొంత అక్కే.. నేను అసలు ఇక్కడికి వచ్చిందే మా అక్క గురించి అందుకే మా అక్కను వెతుక్కుంటూ నేను మీ ఇంటికి వచ్చాను.
అంటూ తన ప్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేస్తాడు శివ.
బిందు: మీరు ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు.
శివ: కొన్ని కారణాల వల్ల విషయాన్ని దాయాల్సి వచ్చింది. ఎవ్వరికీ చెప్పొద్దని మా అక్క మరీ మరీ చెప్పింది. ప్రేమికుల మధ్య ప్రేమ ఉండాలి తప్ప రహస్యాలు ఉండకూడదు కదా అందుకే నువ్వు అడిగిన వెంటనే ఈ నిజాన్ని చెప్పేశాను. నీకు తప్ప ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు.. చెప్పను కూడా.. నువ్వు ఎవ్వరికీ చెప్పకు
బిందు: ప్రేమను దాచుకోకూడదు. ప్రేమికుడు చెప్పిన రహస్యాన్ని దాచాలి. చెప్పకూడదు. అయినా నువ్వు భూమికి సొంత తమ్ముడివి అయితే నాకు బావవి కదా సో రేపు మన పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.
శివ: వస్తాయి ప్రాబ్లమ్సే వస్తాయి. మా అక్క గగన్ బావను చేసుకుంటేనే ఎంత గొడవ అయిందో చూశావు కదా..? అలాంటిది మన పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటారు. గగన్ బావ ఇందు పెళ్లిక డబ్బులు ఇస్తే అది మీరా పిన్నికి తెలిసి ఇందును ఇంటికి తీసుకొచ్చింది. అలాంటిది నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా..?
బిందు: నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయం వేస్తుంది శివ. ప్రాణంగా ప్రేమించుకున్నాం.. దూరంగా ఉండి బతగ్గలమా..? విడిపోయి ఉండగలమా..?
శివ: అందుకే మన ప్రేమ విషయాన్ని భూమి అక్కకు చెప్తాను. తనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తుంది. మన ప్రేమను గెలిపించి పెళ్లి చేస్తుంది.
బిందు: ఒకవేళ ఒప్పుకోకపోతే.. వద్దు అని చెబితే అప్పుడు మర్చిపోతావా నన్ను..
శివ: నిన్ను మరవడం అంటే నేను చచ్చిపోవడమే..
బిందు: శివా అలా మాట్లాడకు..
శివ: అయినా ప్రేమ పెళ్లి చేసుకున్న మా అక్క మన ప్రేమను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. మన ప్రేమను గెలిపిస్తుంది.
అంటూ శివ చెప్తుంటే.. బిందు ఎమోషనల్ అవుతుంది. మరోవైపు శివ కోసం అంతా వెతుకుతుంది పూరి.. ఎక్కడ శివ కనిపించకపోయే సరికి శివ ఎక్కడున్నాడు కాలేజీకి వచ్చాడు కదా అనుకుంటుంది. తర్వాత శివ, భూమి తమ్ముడన్న విషయం గగన్‌కు తెలిసి ఇంట్లోంచి గెంటి వేస్తుంటే.. శారద వచ్చి అడ్డుపడుతుంది. నీకు తెలియని ఇంకో నిజం ఉందని గగన్‌ను లోపలికి తీసుకెళ్లి పూరి, శివను ప్రేమిస్తుందని చెప్తుంది. దీంతో గగన్ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!