Meghasandesam Serial Today Episode:  భూమి జాలి పడి కట్టు కట్టి ఉంటుంది. నువ్వు నా చెవుల్లో పూలు పెడుతుననావు అర్థం అయిందిరా అంటుంది బిందు. దీంతో చెర్రి కోపంగా పెడర్థాలు తీసే పిశాచివే నువ్వు అంటు తిట్టడంతో బిందు కోపంగా భూమి దగ్గరకు వెళ్తుంటే చెర్రి ఆపి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత భూమి కంగారుగా ప్రసాద్‌ దగ్గరకు వెళ్తుంది. నేను అర్జెంట్‌గా ఆయనతో మాట్లాడాలి మీ ఫోన్‌ ఇవ్వండి మామయ్య అని అడుగుతుంది. నా ఫోన్‌ నుంచి చేస్తే వాడు లిఫ్ట్‌ చేయడమ్మా అంటూ వెళ్లి మీరా ఫోన్‌ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు. భూమి లోపలికి వెళ్తుంది. మరోవైపు గగన్‌ ఏదో ఆలోచిస్తుంటే పూరి వస్తుంది.

పూరి: అన్నయ్యా ఏదో ఆలోచిస్తున్నావు.

గగన్‌: భూమి గురించి..

పూరి: ఎంటన్నయ్యా…?

గగన్‌: అంటే ఆఫీసుకు భూమి కావాలి కదా..? ఆ భూమి గురించి ఆలోచిస్తున్నాను.

పూరి: అంటే నమ్ముతున్నాను అన్నయ్యా కాఫీ తీసుకో..

 ఇంతలో పూరికి భూమి ఫోన్‌ చేస్తుంది.

పూరి: నీకు నిండు నూరేళ్లు ఆయుష్షు భూమి ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను.

భూమి: మీ అన్నయ్యా ఫోన్‌ కలవడం లేదు.

పూరి: అన్నయ్యా నీ ఫోన్‌ కలవడం లేదంట..

భూమి: మీ అన్నయ్యా అక్కడే ఉన్నారా..?

పూరి: ఇక్కడే ఉన్నారు..

భూమి:ఒక్కసారి మీ అన్నయ్యకు ఫోన్‌ ఇవ్వవా

పూరి: అన్నయ్య నీతో మాట్లాడుతుందట..

అని ఫోన్‌ ఇచ్చి పూరి వెళ్లిపోతుంది. సాయంత్రం మీరు నక్షత్ర బర్తుడే ఫంక్షన్‌కు వస్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో వస్తున్నాను అంటాడు గగన్‌. రావొద్దని వస్తే కొంపలు అంటుకుంటాయి అని గగన్‌ చెప్పగానే వాటర్‌ ట్యాంకర్‌తో వస్తాను నేనే నీతో ఐలవ్యూ చెప్పించుకుంటాను అని ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తాడు గగన్‌. ఫోన్‌ తీసుకెళ్లి ప్రసాద్ కు ఇవ్వగానే సీక్రెట్స్‌ అన్ని మాట్లాడేశావా..? అని ప్రసాద్‌ అడుగుతాడు. సీక్రెట్స్‌ కాదు మామయ్య టెన్షన్స్‌ మిగిలాయి అంటూ బాధపడుతూ బయటకు వెళ్తుంది. వెనకే వెళ్లిన ప్రసాద్‌కు నక్షత్ర ప్రేమ గురించి మొత్తం చెప్పి ఏడుస్తుంది భూమి. మరోవైపు భూమిని గుర్తు చేసుకుని శారద ఏడుస్తుంది. ఇంతలో పూరి వచ్చి ఏంటమ్మా అదోలా ఉన్నావు అని అడుగుతుంది.

శారద: ఇప్పుడే జరిగిన కథ చదివానే.. అది చదువుతుంటే నాకు భూమి గుర్తుకు వచ్చింది.

పూరి: రాత్రే కదా నువ్వు అన్నయ్యా చూసొచ్చారు. అప్పుడే 20 ఏళ్లు అయిపోయాయా..? రాత్రి వెళ్లిన వాళ్లు భూమిని తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు బాధపడేవారు కాదు కదా..?

శారద: తన కన్నవాళ్లను కలిసేందుకే అక్కడ ఉన్నాను అంటుంది కదా..?

పూరి: సరే కన్నవాళ్లను కలుసుకునేంత వరకు అక్కడ ఉంటుంది. తర్వాత కన్నవాళ్ళతో కలిసి ఉంటుంది .ఇక మనతో ఎప్పుడు ఉంటుంది.

శారద: అసలు భూమియే కోడలు అయితే అంతకంటే కావాల్సింది ఏముంది.

అంటూ శారద ఏదో కవర్‌ చేయబోతుంటే.. మొత్తానికి మనసులో మాట బయటపడింది. కానీ భూమిని కోడలుగా చేసుకోవాలని అన్నయ్యకు చెప్పావా..? అని అడుగుతుంది పూరి. లేదని శారద చెప్తుంది. దీంతో వెంటనే పూరి ఫోన్‌ తీసుకుని భూమితో మాట్లాడమని చెర్రికి కాల్‌ చేస్తుంది.  భూమికి ఫోన్‌ ఇవ్వమని చెప్తుంది. చెర్రి ఫోన్‌ భూమికి ఇవ్వగానే శారదను మాట్లాడమని పూరి ఫోన్‌ శారదకు ఇస్తుంది. శారద చెప్పడానికి మొహమాట పడుతుంటే.. పూరి ఫోన్‌ తీసుకుని భూమి నీకు మా గగన్‌ అన్నయ్యతో పెళ్లి జరిపించి నిన్ను మా ఇంటికి కోడలిగా తీసుకురావాలనుకుంటుంది అని చెప్పగానే భూమి హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే సరిగ్గా వినిపించడం లేదని ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!