Meghasandesam Serial Today Episode: నక్షత్ర అచ్చం శోభాచంద్రలా పూజ చేస్తుంది. అమ్మవారి శ్లోకం పఠిస్తుంది. అది చూసిన శరత్‌చంద్ర ఆశ్చర్యపోతాడు. సంతోసిస్తుంటాడు. అపూర్వ కూడా హ్యాపీగా ఫీలవుతుంది. పూజ పూర్తి అందరికి హారతి ఇస్తుంది నక్షత్ర.
శరత్: అమ్మా నక్షత్ర నువ్వేనా ఇది. ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇవన్నీ..
నక్షత్ర: పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని అమ్మ చెప్పింది డాడీ. మీరు ఎలాంటి కూతురుగా నన్ను చూడాలని ఆశించారో అలా మారిపోవాలని పట్టుదలగా నేర్చుకున్నాను డాడీ.
సుజాత: అమ్మ నక్షత్ర పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకో..
అని చెప్పగానే.. నక్షత్ర, శోభాచంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి మొక్కుతుంది.
అపూర్వ: నిజమే పిన్ని నువ్వు చెప్పింది. ఇదేదో పెద్ద ప్లానే వేసింది.
శరత్: నక్షత్ర పెద్దమ్మ ఆశీస్సులు తీసుకోవాలని నీకెవరు చెప్పారమ్మా..?
నక్షత్ర: ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే పెద్దమ్మే కారణం కదా డాడీ.
శరత్: నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా.. నీ ఈ బర్తుడేకు ఏం కావాలో చెప్పమ్మా..
నక్షత్ర: ఏం అడిగినా ఇస్తారా..? డాడీ
శరత్: డాడీ మాటిస్తే తప్పరని తెలుసు కదా..? అడుగు ఏం అడిగినా ఇస్తాను.
నక్షత్ర: ప్రామిస్ చేయండి..
అని అడగ్గానే శరత్ చంద్ర ప్రామిస్ చేస్తాడు. దీంతో ఈవెనింగ్ బర్తుడే పార్టీలో అడుగుతాను డాడీ అంటంది నక్షత్ర. సరే అంటాడు శరత్‌చంద్ర. తర్వాత అందరితో ఆశీర్వాదాలు తీసుకుంటుంది నక్షత్ర. తర్వాత అందరికీ నా చేతులతో పాయసం చేసి తీసుకొస్తాను అని కిచెన్‌లోకి వెళ్తుంది నక్షత్ర. తర్వాత భూమి గార్డెన్‌లోకి వెళ్లి ఆలోచిస్తుంటే.. నక్షత్ర వచ్చి డాడీని నేను ఏం అడుగుతానో తెలుసుకోవాలని ఉందా..? అని అడుగుతుంది. నాకేం లేదని చెప్తుంది భూమి అయితే చెప్పాలని నాకు ఉంది అంటూ ఈవెనింగ్ డాడీని అడగబోయేది బావతో నాకు పెళ్లి చేయమని బావంటే నాకు ఇష్టమని చెప్తాను అంటుంది. దీంతో భూమి షాక్ అవుతుంది. నాన్న మాటిచ్చారు కాబట్టి నా పెళ్లికి ఒప్పుకోక తప్పదు అని వెళ్లిపోతుంది. రూంలోకి వెళ్లిన భూమి, నక్షత్ర మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో చెర్రి పాయసం తీసుకుని వస్తాడు.
భూమి: చెర్రి గారు ఆ మూడ్ ఏం బాగాలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి.
చెర్రి: అలా అంటే ఎలా బంగారం.. అదే బంగారం లాంటి పాయసం నువ్వు తినకుండా పైకి వచ్చేశావు కదా… స్వీటుగా ఉంది. నీకు నీటుగా తినిపిద్దామని..
భూమి: ఇదిగో ఇలా అర్తం పర్థం లేకుండా మాట్లాడి చెడిన మూడ్‌ను ఇంకా చెడగొడతావని రావొద్దన్నాను వెళ్లు ఇక్కడి నుంచి
అంటూ భూమి డోర్ వేయగానే.. చెర్రి చేయి ఇరుక్కోపయి బ్లడ్ వస్తుంది. భూమి లోపలికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ సారీ చెప్తుంది. దీంతో నీకోసం వేలు ఏంటి..? తలైనా తీసేసుకుంటా అంటాడు. దీంతో నీ తలేమైనా చెర్రి ప్రూటా..? అని అడుగుతుంది. చెర్రి తనలో తాను మాట్లాడుకుంటుంటే.. ఇవే తగ్గించుకోమంటున్నాను అంటుంది భూమి. తర్వాత చెర్రి చేతిని చేతికి ఉన్న కట్టును చూసుకుంటూ ముద్దాడుతుంటే బిందు వచ్చి ఏమైందని అడుగుతుంది. వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!