Meghasandesam Serial Today Episode: చెర్రిని రౌడీలతో కొట్టించాలనుకున్న నక్షత్ర అందుకోసం కిరాయి రౌడీలకు డబ్బులిచ్చి కొట్టమని చెప్తుంది. రౌడీలు న్న దగ్గరకు వెళ్లాక కారులో పెట్రోల అయిపోయేలా చేస్తుంది.. పెట్రోల్ కోసం చెర్రి కారు దిగగానే రౌడీలు వచ్చి చెర్రి మీద అటాక్ చేస్తారు. చెర్రి వాళ్లను కొట్టి తరిమేస్తాడు. నక్షత్ర దగ్గరకు వెళ్తాడు.
చెర్రి: కారులో పెట్రోల్ ఎందుకు అయిపోయిందో ఇప్పుడు నాకు అర్థం అయింది. నక్షత్ర కారు ఇక్కడే ఆగేలా బలే సెట్ చేశావే సూపర్. పద
నక్షత్ర: ఎందుకు నవ్వుతున్నావు..?
చెర్రి: ఏం లేదు ఈ సారి నన్ను కొట్టించాలి అనుకున్నప్పుడు నా నలుగురు ఎక్కువైనా పర్వాలేదు. ముసలి రౌడీలనే పెట్టుకో.. వయసులో ఉన్న వాళ్లను పెట్టుకున్నావు అనుకో ఇదిగో ఇలాగే జరుగుతుంది. అన్ని సార్లు నేను కాపాడలేను సరేనా పద వెళ్దాం.
అంటూ కారు తీసుకుని వెళ్లిపోతాడు చెర్రి. మరోవైపు ఇంటికి వెళ్లిన శరత్ చంద్ర మీరాను పిలుస్తాడు. బిందు వస్తుంది.
బిందు: అమ్మ ఇంట్లో లేదు మామయ్య..
శరత్: లేదా మీ అమ్మ నాకు ఫోన్ చేసింది బిందు. ఎందుకు చేసిందో ఏంటో నీకేమైనా తెలుసా అమ్మ బిందు.
బిందు: అంటే మామయ్య అది..
కేపీ: తెలిస్తే మరి మామయ్యకు చెప్పడానికి తడబాటు ఎందుకు.. చెప్పు
బిందు: తెలుసు నాన్న.. అంటే మామయ్య ఇందు అక్క కట్నం గగన్ అన్నయ్య ఇచ్చాడని అమ్మకు తెలిసిపోయింది మామయ్య.
శరత్: ఏంటి మన ఇంటి అమ్మాయి కట్నం వాడు ఎవడో ఇవ్వడం ఏంటి..? కేపీ ఇది నీకు తెలుసా..?
కేపీ: తెలుసు..
శరత్: తెలిసి కూడా మరి నాకెందుకు చెప్పలేదు.. చెప్పు కేపీ..
కేపీ: ఏం చెప్పమంటారు..? ఎలా చెప్పమంటారు..? చెప్పండి.. కట్నం అడిగింది ఇందు అత్తగారు.. ఇస్తామని చెప్పింది మీరు అపూర్వ. మీరు ఎంతకీ ఇవ్వకపోయే సరికి అక్కడ అత్తగారింట్లో ఇందుకు నరకం చూపించడం మొదలుపెట్టారు. అది తెలిసి గగన్ డబ్బు ఇచ్చారు. ఆ విషయం కూడా నాకు ఇందు అత్తగారే చెప్పారు. ఇప్పుడు ఇందును వాళ్ల అత్తగారు బాగానే చూసుకుంటున్నారు.
శరత్: నీ కూతురు బాగుందని చెప్పి ఈ ఇంటి పరువు పోతున్నా నాకు చెప్పలేదా..?
కేపీ: బావగారు ఏ తండ్రైనా కూతురు బాగుండాలనే కోరుకుంటాడు. ఇక పరువు అంటారా..? అది నిలబడటం పోవడం మీ చేతుల్లోనే ఉంది.
అని కేపీ చెప్పగానే.. శరత్ చంద్ర కోపంగా అపూర్వను పిలిచి గట్టిగా తిడతాడు.. అపూర్వ నేనేం చేశానని అడగడంతో లాగిపెట్టి కొడతాడు.. దీంతో అపూర్వ షాక్ అవుతుంది.
అపూర్వ: బావ నేనేం చేశాను బావ.
శరత్: ఏం చేశానని అడుగుతున్నావా..? ఈ ఇంటి పరువు తీశావు.. మన బద్ద శత్రువును ఆ గగన్‌ను ఈ ఇంటి దేవుణ్ని చేశావు.
అపూర్వ: నువ్వేం మాట్లాడుతున్నావే నాకు అర్థం కావడం లేదు బావ.
శరత్: ఇందు అత్తగారికి మనం ఇస్తానన్న కట్నం ఇచ్చావా..?
అని అడగ్గానే అపూర్వ సైలెంట్‌గా వెళ్లిపోతుంది. తర్వాత శరత్ చంద్ర వెళ్లి అపూర్వను తిట్టి గగన్ ఇంటికి వెళ్తున్నామని రెడీ అవ్వమని చెప్తాడు. శరత్ చంద్ర చెప్పినట్టే అపూర్వ రెడీ అవుతుంది. అందరూ కలిసి గగన్ ఇంటికి వెళ్తారు. గగన్ ఎందుకొచ్చారని అడగ్గానే.. మీకు మా అమ్మాయి భూమికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామని వచ్చాం అంటూ అపూర్వ చెప్తుంది. దీంతో గగన్ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!