Meghasandesam Serial Today Episode: భూమిని తన కారులో తీసుకుని ఎస్పీ సూర్య వెళ్లడం గగన్ చూస్తాడు. వెంటనే భూమిని తిట్టుకుంటాడు. భూమి మీద కోపంతో ఊగిపోతుంటాడు. ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని అనుమాన పడుతుంటాడు. భూమి అంతకు ముందు సూర్య గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో భూమి వస్తుంది. గగన్ ను చూసి ఏడుస్తూ వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది.
భూమి: నిన్ను మళ్లీ చూస్తానని అనుకోలేదు బావ. చాలా పెద్ద ప్రమాదంలోంచి తప్పించుకున్నాను. అసలు ఏమైందంటే..?
గగన్: ఏమ్ ఏమైతే నాకేంటి..? నీకేం జరిగితే నాకేంటి..? అసలు నువ్వు ఎవరు.?
భూమి: అదేంటి బావ..
గగన్: మాట్లాడకు ఇంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడకు. ఇదిగో తాళి కట్టాను భార్యను అవుతాను అంటావు. అది పెద్ద అబద్దం. ఇన్‌ప్యాక్ట్ నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇది నిజం ఓహో మరి ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నాను అంటావా..? మేడం నేను ఉండనివ్వడం లేదు. ఏదో మా అమ్మ ఇష్టం కొద్ది ఉంటున్నావు.. మా అమ్మ మనసును నేను ఎప్పుడూ బాధ పెట్టలేను కాబట్టి ఉండనిస్తున్నాను. ఈ ఇంట్లో ఉంటున్నాము అనే కామన్ పాయింట్ తప్ప నీకు నాకు సంబధమే లేదు. ఏ సంబంధం లేనప్పుడు నీ జీవితంలో ఏం జరిగితే నాకేంటి..? చూడు భూమి ఇష్టానుకు అనుగుణంగా ఎవరి జీవితం వాళ్లు బతకొచ్చు. అలాగే నీ ఇష్టానికి నువ్వు ఎవ్వరితోనైనా బతకొచ్చు
అని చెప్పి గగన్ వెళ్లిపోతాడు. భూమి సైలెంట్‌గా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కేపీ, భూమికి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట చేసిన భూమి బాధగా కేపీని పలకరిస్తుంది.
భూమి: హలో మామయ్య.. చెప్పండి..
కేపీ: అమ్మా భూమి ఎక్కడున్నావు.. ఏం చేస్తున్నావు..?
భూమి: ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను మామయ్య.. గార్డెన్‌లో ఉన్నాను..
కేపీ: నీకు రాత్రంతా నిద్ర పట్టని ఓ తీపి కబురు చెప్పమంటావా..? భూమి..
భూమి: మనకు తీపి కబుర్లు ఏముంటాయి మామయ్య.. మనం ఏం చేసినా అంతా నెగెటివ్ అవుతుంది. ఒక్క సక్సెస్ కూడా మనకు రావడం లేదు..
కేపీ: ఉంది భూమి.. ఇన్నాళ్లకు మనకు మంచిరోజులు వస్తున్నాయి. ఇందాక మీ నాన్నతో మాట్లాడాను భూమి. మీ నాన్న నిన్ను తన కూతురుగా నా కొడుకుని తన అల్లుడిగా అంగీకరిస్తానని చెప్పారు. ఇక హ్యాపీగా నిద్రపో భూమి..
అని చెప్పి ఫోన్ పెట్టేయగానే.. భూమి హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే రూంలో నిద్రపోతున్న గగన్ దగ్గరకు వెళ్తుంది. నిద్రపోతున్న గగన్ ను చూసి ముద్దాడుతుంది.
భూమి: నిద్రలో కూడా ఎంత ముద్దొస్తున్నాడో నా ముద్దుల మొగుడు. కళ్లు మండుతున్నాయని చెప్పి కళ్ల మీద దూది ఉండలు పెట్టుకోవాలా..? అడిగితే నేను ముద్దులు పెట్టనూ..! ఇప్పుడైనా వదులుతానా..? పెట్టేస్తాను.
అంటూ నిద్రలో ఉన్న గగన్‌కు ముద్దులు పెట్టడానికి భూమి బెడ్ మీదకు వెళ్లుంది. ఇంతలో గగన్ చిన్నగా మెదులుతాడు. దీంతో భూమి ఉలిక్కి పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!