Chinni Serial Today Episode మధుని తన గెస్ట్‌హౌస్‌ దగ్గరకు తీసుకు రమ్మని సంజు తన ఫ్రెండ్స్‌తో చెప్తాడు. ఇక మ్యాడీ కూడా ఆ లొకేషన్‌కి వస్తాడు. వాళ్లని కొట్టి మధుని కాపాడతాడు. మధు మ్యాడీని హగ్ చేసికొని థ్యాంక్స్ చెప్తుంది. అమ్మానాన్న ఎంత టెన్షన్ పడుతున్నారో అని మధు అంటే విషయం వాళ్లకి చెప్పాను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద అని మధుని తీసుకెళ్తాడు.

Continues below advertisement

మధు కోసం స్వరూప, సుబ్బు వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో మధుని తీసుకొని మ్యాడీ వస్తాడు. మధుని పట్టుకొని తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతారు. మ్యాడీ నా పక్కన ఉండగా నాకు ఏం కాదు అని అంటుంది. కిడ్నాపర్లు ఎవరమ్మా అని సుబ్బు అంటే నాకు తెలీదు అని మధు అంటుంది. దానికి మ్యాడీ నేను తెలుసుకుంటాను.. నీ జోలికి ఎందుకు వచ్చారు.. అసలు వాళ్లు ఎవరు అని మొత్తం తెలుసుకుంటా అని అంటాడు. స్వరూప, సుబ్బు దండం పెట్టి మ్యాడీకి థ్యాంక్స్ చెప్తారు. చంటి మ్యాడీ కాళ్లకి దండం పెట్టి థ్యాంక్స్ చెప్తాడు. మా అమ్మాయి గురించి ఎలాంటి విషయం వినాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాం కానీ మాకు దేవుడిలా ఆదుకున్నావ్ అని అంటారు. 

నా ఫ్రెండ్‌కి కష్టం వస్తే ఆదుకోవడం నా బాధ్యత అని మ్యాడీ మధుని దగ్గరకు తీసుకుంటాడు. మ్యాడీ వెళ్లిపోయిన తర్వాత స్వరూప, సుబ్బులు మ్యాడీ పెట్టుకున్న అపార్థాలు అన్నీ తొలగిపోయి చిన్నప్పటి చిన్ని, మహిల్లా ఇద్దరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. దేవా దగ్గరకు నాగవల్లి వెళ్లి అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్ ఏంటి అని అడిగితే దానికి దేవా నాకు ఎందుకో మ్యాడీ మధు జస్ట్‌ ఫ్రెండ్స్ అనిపించడం లేదు.. మ్యాడీ మధుని ప్రేమిస్తున్నాడు అని అనిపిస్తుందని అంటాడు. అలా ఎందుకు అనుకుంటావ్ బావ అని నాగవల్లి అడిగితే ఇలాంటివన్నీ ఫ్రెండ్‌షిప్‌లో ఉండవు.. లవ్‌లో మాత్రమే ఉంటాయి,, అని అంటాడు.

Continues below advertisement

చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమిస్తున్న వాడు మధుని ఎందుకు ప్రేమిస్తాడు అని నాగవల్లి అడుగుతుంది. ఆ మధులో చిన్ని లక్షణాలు ఉండి మధుని లవ్ చేయొచ్చు కదా అని అంటాడు. అలాంటిదేమీ ఉండదు అనవసరంగా ఆలోచిస్తున్నావ్ అని నాగవల్లి చెప్తుంది. ఇంతలో మ్యాడీ వచ్చి మధు సేఫ్‌ అని చెప్తాడు. దేవా మ్యాడీతో నువ్వు ఎందుకు వెళ్లావ్ నాన్న ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా నేను చూసుకుంటాను. ఏ మనిషి మీద అంత అటాచ్‌ మెంట్ పెట్టుకోవద్దు.. మొన్నటి వరకు చిన్ని మీద అటాచ్‌ మెంట్ పెట్టుకున్నావ్.. ఇప్పుడు మధు అని అంటాడు. 

మహి తండ్రితో చిన్నిని మధుని పోల్చి చూడొద్దు డాడీ.. మధు వేరు చిన్ని వేరు.. మధు స్నేహం వల్ల చిన్నిని మర్చిపోతున్నా.. ఈ టైంలో చిన్ని గురించి మాట్లాడొద్దు అని అంటాడు. రాత్రి మధు ఓ చోట ఉంటే మ్యాడీ వెళ్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ మధు అని అంటే నీ గురించే మ్యాడీ నా ప్రతీ కష్టంలో నువ్వు నాకు అండగా ఉంటున్నావ్ అని అంటుంది. అన్నీ మర్చిపో అని మ్యాడీ చెప్తాడు. ఇక రేపు కాలేజ్ ఫెస్ట్‌ కదా అని అంటే మధు రాను అంటుంది. ఇద్దరం జంటగా పేర్లు ఇచ్చాం కదా నువ్వు రాను అంటే నేను రాను అని మ్యాడీ అంటాడు. మనం వెళ్తున్నాం ఫస్ట్‌ ఫ్రైజ్ కొడుతున్నాం అని మ్యాడీ అనగానే మధు సరే అంటుంది.

కాలేజ్‌లో అందరూ మ్యాడీ ఫస్ట్‌ ఫ్రైజ్ కొడతారని అనుకుంటున్నారని అలా జరగకుండా చేస్తానని సంజు తన ఫ్రెండ్స్‌తో చెప్తాడు. ఫెస్ట్‌కి మ్యాడీ తల్లిదండ్రులు చీఫ్ గెస్ట్‌లు. సంజు శ్రేయతో మాట్లాడి కంగ్రాట్స్ చెప్తాడు. మీ బావ చిన్నిని సైడ్ చేసేశాడు.. ఇప్పుడు మధుతో తిరుగుతున్నాడు.. ఇద్దరూ లవర్స్ అని త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మధు కూడా సైడ్ అయిపోయింది నీ లైన్ క్లియర్ అయిపోయిందని అంటాడు. మా బావ మధుని లవ్ చేయలేదు అని శ్రేయ అంటుంది. మధు, మ్యాడీ కలిసి బైక్ మీద రావడం చూసిన సంజు ఇప్పుడైనా వాళ్లు లవర్స్ అని నమ్ముతావా అని చూపిస్తాడు. మీ బావ పెద్ద లవర్ చిన్ని లవర్ అని ఇద్దరిని మ్యానేజ్ చేస్తున్నాడు.. పెళ్లయ్యాక నువ్వు తిడితే మధు దగ్గరకు వెళ్తాడు.

మధు తిడితే నీ దగ్గరకు వస్తాడు మీ బావ గ్రేట్ అంటాడు. శ్రేయ కోపంగా మ్యాడీ వాళ్లకి అడ్డంగా నిల్చొంటుంది. మనం కలిసి కాలేజ్‌కి వెళ్దాం అంటే వేరే పని ఉంది అన్నావ్.. ఇదేనా ఆ పని.. నువ్వు దాని డ్రైవర్‌వా అని అడుగుతుంది. నాకు మా బావకి పెళ్లి ఫిక్స్ అయింది.. నీకు బుద్ధి ఉందా మధు..పెళ్లి ఫిక్స్ అయిన మగాడితో తిరగడానిక బుద్ధి లేదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.