Meghasandesam Serial Today Episode: తన ఇంటికి వచ్చిన భూమిని చూసి గగన్ కోపంగా శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు. దీంతో భూమి కోపంగా ఎందుకు బావ అనవసరంగా నాన్నకు కాల్ చేశావు అని అడుగుతుంది. దీంతో గగన్ కోపంగా చూస్తూ..
గగన్: నువ్వెందుకు అనవసరంగా ఈ ఇంటికి వచ్చావు
భూమి: ఈ కోపంలో నువ్వు ఏం చెప్పినా పట్టించుకోవు. మళ్లీ వస్తాను.
గగన్: మళ్లీ అదే మాట.. రావొద్దు.. ఇంకెప్పుడు మా ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దు. వెళ్లిపో.. గెట్ అవుట్..
అంటూ తిట్టగానే భూమి ఏడుస్తూ వెళ్లిపోతుంది.
శారద: భూమి.. అనవసరంగా నీవు శరత్‌చంద్ర గారికి ఫోన్ చేసి చెప్పావురా..?
గగన్: అనవసరం కాదు అమ్మా అవసరమే.. ఈ ఇల్లు ఆ ఇల్లు అంటూ మన బతుకులతో దాగుడు మూతలు ఆడుతుంది భూమి. అయినా ఇంట్లోకి వచ్చాక మెడ పట్టి గెంటేయకుండా నువ్వెందుకు అమ్మా తనను ఇంకా సపోర్ట్ చేస్తున్నావు. చూశావా..? శరత్ చంద్రకు భూమి ఇక్కడ ఉందని చెప్పే సరికి భయంతో ఎలా పారిపోతుందో తనకు తన నాన్నే కావాలి. ఆ నాన్నను కాదనుకుని వచ్చే భూమి నాకు కావాలి. అలాంటి భూమి లేదని కన్ఫం అయింది. ఇలాంటి భూమిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇంకెప్పుడు మన ఇంటికి వచ్చినా తరిమేయ్ అమ్మా..
అంటూ చెప్పి గగన్ లోపలికి వెళ్లిపోతాడు.
శారద: గగన్.. నేను చెప్పేది విను..
శివ: అక్కంటే సార్‌కు ఎందుకు అంత కోపం.. అక్కంటే సారుకు ఎందుకు అంత కోపం అని అడుగుతున్నాను.
పూర్ణి: కొట్టానంటే మూతి ముక్కు ఒక్కటై పోతాయి. అయినా డీటెయిల్స్ అన్ని నీకెందుకురా..?
అని తిట్టి కోపంగా పూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శివ: పోనీ మీరైనా చెప్తారా ఆంటీ..? అక్కంటే సారుకు ఎందుకు అంత కోపం
శారద: చెప్పాలంటే చాలా పెద్ద కథ శివ ఇక్కడే ఉంటున్నావు కదా పోను పోను నీకే తెలుస్తుంది.
అని చెప్పి శారద ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శివ బాధపడుతుంటాడు. మరోవైపు కారులో ఇంటికి వెళ్తున్న భూమి, గగన్ మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. తర్వాత శివను ఎంత వరకు చదివానని గగన్ అడుగుతాడు. తాను డిగ్రీ డిస్ కంటిన్యూ చేశానని చెప్తాడు. దీంతో గగన్.. శివను తీసుకెళ్లి కాలేజీలో జాయిన్ చేస్తాడు. తర్వాత శివ, భూమికి ఫోన్ చేస్తాడు.
శివ: బావ నన్ను కాలేజీలో జాయిన్ చేశాడు. నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి జాలిగా మాట్లాడుతూ బావ అందరికీ స్వీట్లు తినిపించారు. కానీ తర్వాత అదంతా నటన అని అర్థం అయిపోయింది.
అంటూ స్వీట్లు పంచిన తర్వాత గగన్ తన రూంలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడని రూంలో పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేశాడని అదంతా తాను చాటు నుంచి చూశానని శివ చెప్తాడు. శివ మాటలకు భూమి ఏడుస్తుంది. తర్వాత గగన్ ఆఫీసుకు వెళ్తుంటే భూమితో పెళ్లి పిక్స్ అయిన పెళ్లి కొడుకు గగన్‌ను లిఫ్ట్ అడుగుతాడు. గగన్ కారు ఆపి అతన్ని ఎక్కించుకుంటాడు.
గగన్: ఎక్కడ దిగుతారు మీరు..?
వ్యక్తి: శరత్‌చంద్ర గారి ఇంటి దగ్గర దిగుతాను.
గగన్: శరత్ చంద్ర గారు మీకు కావాల్సిన వారా..?
వ్యక్తి: ఆయనకు కాబోయే అల్లుడిని..
అని చెప్పగానే.. గగన్ ఆవ్యక్తితో మాట్లాడుతూ పెళ్లి చూపుల వివరాలు తెలుసుకున్నట్టు నటిస్తూ ఆ అమ్మాయి లేకుండా పెళ్లి ఫిక్స్ చేసేశారా..? అమ్మయికి ఇష్టమో కాదో కనుక్కోలేదా..? అని గగన్ అడగ్గానే ఆ వ్యక్తి వెంటనే భూమికి కాల్ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!