Meghasandesam Serial Today Episode: నక్షత్ర ఫుల్లుగా తాగొచ్చి గొడవ చేస్తుంటే.. గగన్‌, చెర్రికి ఫోన్‌ చేస్తాడు. వెంటనే చెర్రి వస్తాడు. నక్షత్రను ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే.. ఏయ్‌ ఎవడ్రా నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు అంటూ తిడుతుంది.

చెర్రి: నేను నీ హస్బెండ్‌ను.. చెర్రిని

నక్షత్ర: ఏయ్‌ నువ్వు నా హస్బెండ్‌ కాదు.. నా హస్బెండ్‌ కాదని ఒప్పుకో.. వస్తాను..

చెర్రి: సరే నేను నీ హస్బెండ్‌ను కాదు.. ఒప్పుకున్నాను.. నీ హస్బెండ్‌ను కాదు..

నక్షత్ర: సరే ఒప్పుకున్నావు కదా.. నా హస్బెండ్‌ కాదని ఒప్పుకున్నావు కదా..? వస్తా.. పద..

చెర్రి: సరే వెళ్దాం పద..

అంటూ నక్షత్రను తీసుకుని బయటకు వెళ్తాడు చెర్రి. గగన్‌ అమ్మా మీరు లోపలికి వెళ్లండి అని చెప్పి గగన్‌ బయటకు వెళ్తాడు.

చెర్రి: వస్తాను అన్నయ్య..

గగన్‌: రావొద్దురా..? చెర్రి.. ఇక్కడ కాక ఎక్కడో తాగి పడిపోయే భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి నువ్వు రావొద్దురా..? అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరి ప్రేమనో నిలబెట్టడానికి ఇంకొక ఆడపిల్ల మెడలో తాళి కడితే సరిపోదురా తను కూడా ఒక ఆడపిల్లే. అది నువ్వు గుర్తించరా..? తను లవ్‌ లో ఫెయిల్‌ అయిన ఆడపిల్లరా..?తనకు నువ్వు బంధువుగా దగ్గర అవ్వాలి.  భర్తగా నువ్వు చూపించే.. ప్రేమ తను పోగొట్టుకున్న ప్రేమకన్నా గొప్పదని నువ్వు నిరూపించాలి. నేను చెప్పేది అర్థం అవుతుందా..? నీకు.

చెర్రి: అర్థం అవుతుంది అన్నయ్య. నువ్వు చెప్పిన ప్రతి మాటను పాటించడానికి ప్రయత్నిస్తాను. తనకు మంచి భర్తగా ఉండి నీ తమ్ముణ్ని అని నిరూపించుకుంటాను.

అంటూ చెర్రి ఎమోషనల్‌ అవుతూ గగన్‌ను హగ్‌ చేసుకుంటాడు. గగన్‌ సరేరా జాగ్రత్తగా వెళ్లిరా అని చెప్తాడు. ఓకే అన్నయ్యా అంటూ చెర్రి వెళ్లిపోతాడు. భూమి శివ ద్వారా నాటకం ఆడి కేపీ, శారదలను కలపాలనుకుంటుంది. అందుకోసం శివ, శారద ఫోన్‌ నుంచి కేపీకి ఏవండి నేను డాన్స్‌ అకాడమీ ఓపెనింగ్‌కు వస్తున్నాను మీరు వస్తున్నారా..? అని  మెసేజ్‌ చేయిస్తుంది. శివ మెసేజ్‌ చేసి బయటకు వెళ్లి శివ, భూమికి ఫోన్‌ చేసి చెప్తాడు.  ఇంతలో మెసేజ్‌ చూసుకున్న కేపీ హ్యపీగా ఫీలవుతాడు. వెంటనే శారద ఇంటికి వెళ్తాడు. భూమి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు.

భూమి: అత్తయ్య మీరు డాన్స్‌ అకాడమీ ఓపెనింగ్స్‌ రావడం లేదని నాకు ఫోన్‌ చేసి చెప్పింది. మీకు రమ్మని చెప్పింది. నాకు రాలేదని ఫోన్‌ చేసి చెప్పిందంటే అందులో అర్థం ఏంటి..?

అంటూ భూమి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని లోపలికి వెళ్తాడు కేపీ. కేపీని చూసిన శారద షాక్‌ అవుతుంది.

శారద: మీరు ఎందుకు వచ్చారు..? నేను బతకడం ఇష్టం లేదా..?

కేపీ: నీతో కాస్త ప్రశాంతంగా మాట్లాడుదామని వస్తే.. అలా అంటావేంటి శారద. నేను అన్నింటికీ తెగించే వచ్చాను. మనం ఇప్పుడు  మాట్లాడుకోవాల్సింది మన భవిష్యత్తు గురించి..

అని చెప్తుండగానే.. గగన్‌ ఇంట్లో ఉన్న బొమ్మను తీసుకురమ్మని అపూర్వ కొందరు రౌడీలను పంపిస్తుంది. వాళ్లు గగన్‌ ఇంటి ముందుకు వచ్చి అపూర్వకు ఫోన్‌ చేస్తారు. ఇంట్లో శారద ఒక్కతే ఉంటుంది. వెంటనే ఆ బొమ్మను తీసుకుని రండి అని చెప్తుంది. రౌడీలు లోపలికి వెళ్లి కేపీ కొట్టి శారదను తోసేస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!