Ammayi garu Serial Today Episode కోమలి అర్ధరాత్రి తన లవర్‌ అశోక్‌ని కలవడానికి వెళ్తుంది. కోమలి కంగారు వెళ్లడం రాజు చూసి ఫాలో అవుతాడు. కోమలి అశోక్‌ని హగ్ చేసుకుంటుంది. ఏడుస్తుంది. అశోక్ కోమలితో నువ్వు కూడా ఏడుస్తావా అని అడుగుతాడు. వాడు అలా ప్రవర్తించే సరికి భయం వేసిందని కోమలి ఏడుస్తుంది. 

కోమలి అశోక్‌తో నేను ఇక్కడ ఉండలేను నీతో వచ్చేస్తా అంటుంది. దాంతో అశోక్ కోమలితో మనం డబ్బు కోసం కదా ఇదంతా చేస్తున్నాం కదా ఆ దీపక్ ఇంకో సారి నీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ కోసం భయపడుతూ నాకు కాల్ చేశావ్ గుర్తుందా నేనే డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చాను అంటాడు. మరి జీవన్ తాను చేశానని చెప్పాడు అని కోమలి అంటే నేనే ఆ జీవన్‌కి చెప్పానని అంటాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం రాజు చూస్తాడు. చాటుగా నిల్చొని ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందా అని అనుకుంటాడు. వాడికి కూడా ఈ నాటకం గురించి తెలిసే ఉంటుంది. వాడు ఎవడో తెలుసుకోవాలి అనుకుంటాడు. 

రాజు దగ్గరకు వెళ్లే టైంకి అశోక్ వెళ్లిపోతాడు. వచ్చిన అవకాశం మిస్ అయింది అని రాజు అనుకుంటాడు. ఇక రాజు లోపలికి వెళ్తే మందారం పిలుస్తుంది. బయట నుంచి వస్తున్నావేంటి అని అడిగితే ఆ దొంగమ్మాయి ఎవరినో కలిసింది.. వాడిని పట్టుకుంటే ఈ నాటకం బయట పడుతుంది అని అంటాడు. ఇక మందారం దీపక్ కోమలితో తప్పుగా ప్రవర్తించాడని తాను వెళ్లిన వరకు గొడవ పడి వెళ్లగానే మాట మార్చేశారని చెప్తుంది. ఇక్కడ జరిగిన గొడవ చెప్పడానికే పిలిచినట్లు ఉంటుందని మందారం అంటుంది. దాంతో రాజు ఓహో అదా సంగతి అని అనుకుంటుంటాడు. మనసులో నువ్వు ఎవరో తెలియాలి అంటే నిన్ను కలిసిన వాడు ఎవడో తెలియాలి అలా తెలియాలి అంటే నువ్వు ఇక్కడ ఇబ్బంది పడాలి నువ్వు ఇబ్బంది పడేలా నేను చేస్తాను అని రాజు అనుకుంటాడు. 

చంద్ర రాజుని పిలిచి కాంట్రాక్ట్ పేపర్ల గురించి అడుగుతాడు. రాజు నిల్చొని చెప్తుంటే నువ్వు నా పీఏవి కాదు రాజు ఇంటి అల్లుడివి కూర్చొ అని పక్కన కూర్చొపెట్టుకొని ఫైల్ చెక్ చేస్తారు. మరోవైపు విరూపాక్షి బంటీకి తినిపిస్తుంటుంది. బంటీ విరూపాక్షికి మొత్తం పరుగెత్తిస్తుంటాడు. బంటీ వెనక పరుగెడుతూ విరూపాక్షి మెట్ల మీద నుంచి పడిపోబోతుంది. చేతిలో గ్లాస్, ప్లేట్ కింద పడిపోతాయి. విరూపాక్షి గాజు పెంకుల మీద పడిపోయే టైంకి సూర్యప్రతాప్‌ చూసి పట్టుకుంటాడు. సూర్యప్రతాప్‌ని చూసి విరూపాక్షి షాక్ అయిపోతుంది. అందరూ చాలా సంతోషపడతారు.   

సూర్య అని విరూపాక్షి ఏడుస్తూ సూర్యప్రతాప్‌ గెండెల మీద వాలిపోతుంది. సరైన టైంకి తాతయ్య అమ్మమ్మని కాపాడారు అందరూ చప్పట్లు కొట్టండి అని బంటీ చెప్పి తాతయ్యకి థ్యాంక్స్ చెప్తాడు. అవకాశం వచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు విరూపాక్షి అని సూర్యప్రతాప్‌ అంటాడు. నిన్ను పట్టుకున్నది కాపాడటానికి మాత్రమే. నా కళ్ల ముందు ఎవరు ప్రమాదంలో ఉన్నా చూస్తూ ఊరుకోలేని నా మనస్తత్వం నిన్ను కాపాడింది నీ ప్లేస్‌లో ఇంటి పని మనిషి ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతా అని అంటాడు. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. ఇప్పుడు పట్టుకున్నా కదా అని ప్రతీసారి ఇలా పడిపోవడానికి ప్రయత్నించకు అని అంటుంది. నేను మరీ అంత దిగజారను సూర్య అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్‌ పాతికేళ్ల క్రితమే నీ దిగజారుడు తనాన్ని చూసేశాఅంటాడు. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. నా విషయంలో నువ్వు చేసిన ఘోరాన్ని జీవితంలో మర్చిపోలేను క్షమించలేను అని అంటాడు. 

విరూపాక్షి ఏడుస్తుంటే రాజు, రూపలు వెళ్తారు. నాన్న మాటలకు బాధ పడొద్దు అని రూప అంటుంది. నాన్న కోపం వెనక ప్రేమ చూశానని ఇద్దరూ చెప్తారు. మీ అమ్మకి కొత్త ఆశలు రేపుతున్నావ్..  అవన్నీ ఆపేయ్.. నీ విషయంలో ఎలాంటి మార్పు రానివ్వను అని విజయాంబిక అంటుంది.  నీ పాపాలు పండే రోజు దగ్గర్లేనే ఉంది అత్తయ్యా ఈ లోపు ఎన్ని కుట్రలు చేస్తావో చేసేయ్ త్వరలోనే రాఘవని తీసుకొస్తాం అప్పుడు ఉంటుంది నీకు అని రూప వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.