Meghasandesam Serial Today Episode : గగన్ రౌడీలను కొట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మారకుండా చూసిన విషయం శారదకు చెప్తుంది భూమి. గగన్ ఎక్కడ అని అడగ్గానే శారద పైన ఉన్నాడని చెప్తుంది. దీంతో భూమి హ్యాపీగా పరుగెత్తుకుంటూ పైకి వెళ్లి గగన్ ను హగ్ చేసుకుంటుంది.
భూమి: ఈరోజు నా పరువు కాపాడారు. ఏమిస్తే మీ రుణం తీర్చుకోగలను అండి. అయినా నేను మీకు ఏమి ఇవ్వగలను. నన్ను నేను అర్పించుకోవడం తప్పా
గగన్: పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి భూమి. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి మాట్లాడేది ఇలాగేనా..?
భూమి: అదేంటండి. మనిద్దరికే కదా పెళ్లి అవుతుంది.
గగన్: అలా ఎవరు చెప్పారు నీకు నేను చెప్పానా..?
భూమి: ఏంటండి అలా మాట్లాడుతున్నారు.. మనం ఇద్దరం ప్రేమించుకున్నాం కదా..?
గగన్: ఎప్పుడు ప్రేమించుకున్నాం. నువ్వు శరత్ చంద్ర కూతురువి అని తెలియక ముందు. తెలిశాక ఆ ప్రేమ ఆ క్షణంలోనే సమాధి అయిపోయింది.
భూమి: అలా మాట్లాడకండి మీరు లేకుండా నేను బతకలేను.
గగన్: శరత్ చంద్ర కూతురు పక్కన నేను బతకలేను.
భూమి: అలా అంటారేంటండి. శరత్ చంద్ర కూతురు అని తెలియక ముందే మీరు నన్ను ప్రేమించారు. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఒకప్పుడు నా పక్కన బతకాలనుకున్న మీరు ఇప్పుడు నా పక్కన బతకలేను అంటున్నారు. ఇందులో నేను చేసిన తప్పేంటండి. నేను ఆయన కూతురుగా పుట్టడమేనా..?
గగన్: అవును.. ఒకప్పుడు అల్లరిగా చూసే నిన్ను ఇష్టపడి ప్రాణంగా ప్రేమించి కలిసి బతకాలనుకున్న కానీ అదంతా ఆ శరత్ చంద్ర కూతురువి అని తెలియక ముందు. ఎప్పుడైతే ఆ కుటుంబంతో బంధం ఉందని తెలిసిందో ఆ క్షణమే నీతో శాశ్వతంగా నా బంధం తెంచేసుకున్నాను.
భూమి: మీరు అలా అంటారనే ఇన్నాళ్లు నేను ఆయన కూతురుని అన్న నిజాన్ని నాలోనే దాచేసుకున్నాను.
గగన్: నిజం దాచేస్తే దాగదు భూమి. ఇన్నాళ్లు నా శత్రువు కూతురుని ప్రేమిస్తున్నాను అని తెలిస్తేనే… ఇన్నాళ్లు శరత్ చంద్ర కూతురువి అనే నిజం నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు లోకం అంతా తెలిసిపోయింది. వెళ్లు ఇప్పుడు నీకొచ్చిన ఈ కొత్త ఐడెంటితో వెళ్లి మీ ఇంటి దగ్గర హాయిగా బతుకు
భూమి: అలాంటప్పుడు నాకు అపూర్వే మేలు చేసినట్టు కదండి.
గగన్: చూడు భూమి మనం ఒకరినొకరం మోసం చేసుకుని కలిసి బతకలేం అని నీకు తెలుసు. నాకు తెలుసు. ఇక నువ్వు శరత్ చంద్ర కూతురువి అని తెలిశాక నీతో కలిసి బతకలేను. అది నువ్వు తెలుసుకో. బయలుదేరు ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.
భూమి: ఫ్లీజ్ అండి మీరు నా ప్రేమను అర్థం చేసుకోండి.
అని చెప్పగానే.. గగన్ కోపంగా భూమి చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్తాడు. శారద, పూర్ణి అడ్డు పడినా ఆగకుండా భూమిని గేటు బయటకు తీసుకెళ్లి తోసేస్తాడు. నీకు ఈ ఇంటితో ఎలాంటి సంబందం లేదు అని చెప్తాడు. శారద అడ్డుపడబోతుంటే అమ్మా నీకు నా గురించి బాగా తెలుసు. ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నా దానికి నేను ఎంతలా కట్టుబడి ఉంటానో తెలుసు అంటూ శారద మాట కూడా వినకుండా ఇద్దరినీ తీసుకుని లోపలికి వెళ్తాడు. తర్వాత భూమి హాస్పిటల్ లో ఉన్న శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి బాధ పడుతుంది. నాకు మీ ఇద్దరు దేవుళ్లతో సమానం ఏ దేవుడు లేకపోయినా నేను బతకలేను అంటూ ఏడుస్తుంది. కేవలం నీ కూతురును అయినందుకు ఆయన నన్ను వద్దంటున్నాడు అంటూ ఎమోషనల్ అవుతుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్నా అంటూ బోరున విలపిస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!