MeghasandesamSerial Today Episode: చెర్రిని కేసు నుంచి కాపాడటం కోసం గగన్‌, భూమి లిల్లీని దాచి ఉంచిన ఇంటి దగ్గరకు వెళ్తారు. అక్కడ రౌడీలు కాపలాగా ఉంటారు. భూమి కారులో కూర్చుంటే గగన్‌ మాస్క్ వేసుకుని లోపలికి వెళ్తాడు. రౌడీలు గగన్‌ ను చూసి ఫైట్‌ చేస్తుంటారు. గగన్‌ కూడా వాళ్లను కొట్టి లిల్లీ దగ్గరకు వెళ్తాడు. ముసుగులో ఉన్న గగన్‌ ను చూసి లిల్లీ భయపడుతుంది.

లిల్లీ: ఎవరు..? నువ్వు.. ఏం చేస్తున్నావు..?

గగన్‌: నిన్ను చంపడానికి వచ్చాను.  

లిల్లీ: నన్ను చంపుతావా..? ఎందుకు…

గగన్‌: అపూర్వ గారు పంపించారు నిన్ను  చంపమని..

లిల్లీ: అపూర్వ నా నేను నమ్మను..

గగన్‌: అందుకే అపూర్వ నిన్ను చంపమని పంపించింది.

అంటూ కత్తితో లిల్లినీ పొడవబోతుంటే లిల్లీ తప్పించుకుంటుంది. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు పారిపోతుంది. అక్కడ భూమిని చూసి దగ్గరకు వెళ్తుంది.

లిల్లీ: భూమి కాపాడు భూమి.. ఫ్లీజ్‌.. వాడు నన్ను చంపడానికి వచ్చాడు.

భూమి: అయ్యో నేను ఉన్నాను కదా నువ్వు కంగారు పడకు ..

గగన్‌: ఏయ్‌ ఆ అమ్మాయిని వదిలేయ్‌..

భూమి: ఎందుకు వదలాలిరా..?

గగన్‌: వదిలేయ్ అన్నానుగా వదిలేయ్‌..

భూమి: రోడ్డు మీద పడి ఆడపిల్ల ప్రాణం తీస్తుంటే..  వదిలేస్తాను అనుకున్నావా..?

గగన్‌: నువ్వు కాపాడతావా..? మరి

భూమి: అవునురా..? కాపాడతాను నేను.

గగన్‌: ఏంటి ముందు ఒక రా వెనక ఒక రా ఏంటి..?

భూమి: రా అంటాను రాస్కెల్‌ అంటాను. బే అంటాను.. ఏమైనా అంటానురా..?(అంటూ కర్ర తీసుకుని భూమి, గగన్‌ను కొడుతుంది.) ఆడవాళ్లంటే నీకు అంత అలుసుగా కనిపిస్తున్నార్రా..?

లిల్లీ: భూమి కొట్టు బాగా కొట్టు వాణ్ని అలాగే కొట్టు..

గగన్‌: ఏయ్ నిజంగానే కొడుతున్నావా..? ఇది నాటకం కదా..?

భూమి: నోరు ముయ్యరా..? నన్ను కాదని చెప్పి దానితో తిరుగుతావా..?  నాకు అన్ని తెలుసు.. ఆడపిల్ల అని చూసి చంపాలని చూస్తావా..? ఏయ్‌ మళ్లీ మా లిల్లీ జోలికి వచ్చినా ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా ఇలాగే ఉంటుంది. చంపేస్తాన్ రా రేయ్‌..

అంటూ కొడుతుంటే.. గగన్‌ పారిపోయినట్టు నటిస్తాడు.

లిల్లీ: చాలా థాంక్స్‌ భూమి..

భూమి: సరే సరే ఇంతకీ వాడెందుకు నిన్ను చంపాలని చూశాడు.

లిల్లీ: ఇదంతా ఆ అపూర్వ పని భూమి.

భూమి: మా చెర్రి ఎలాంటి వాడో కూడా మాకు తెలుసు. తను నీతో అమానుషంగా ప్రవర్తించే అవకాశమే లేదు.. చెప్పు తను నీతో తప్పుగా ప్రవర్తించాడా..? లిల్లీ చెప్పు..

లిల్లీ: లేదు భూమి..

భూమి: మరి కోర్టులో ఎందుకు అబద్దం చెప్పావు..? ఎందుకు కేసు పెట్టావు..

లిల్లీ: చెప్పకపోతే మా నాన్నను చంపేస్తానని అపూర్వ బెదిరించింది.

భూమి: ఏంటి మీ నాన్నను చంపేస్తానని బెదిరించిందా..?

ఇంతలో అక్కడికి గగన్ వస్తాడు.

గగన్‌: హాయ్‌ ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి..?

భూమి: లిల్లీ మనసు మార్చుకుంది బావ నిజం చెప్తుంది. నువ్వు చెప్పు లిల్లీ

లిల్లీ: చెర్రి మీద కేసు పెట్టకపోతే మా నాన్నను చంపేస్తానని నన్ను బెదిరించింది. ఇప్పుడు ఇంకో ప్లాన్‌ వేస్తుంది. చెర్రి ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాకుండా ఉండటానికి నన్ను చంపేయాలని చూస్తుంది

అంటూ లిల్లీ చెప్పగానే.. భూమి, గగన్‌ షాక్ అవుతారు. అలా ఎప్పటికీ జరగనివ్వం.. ఆ అపూర్వ ఆటలు సాగనివ్వం అంటూ భూమి చెప్పగానే.. గగన్‌ కూడా అవును అంటూ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!