Brahmamudi Serial Today Episode: చుట్టు పక్కల వీధుల ప్రజలను కూడా ఫంక్షన్‌కు పిలవాలని ఇందు చెప్తుంది. దీంతో అంత మంది వస్తే చికెన్ సరిపోదు.. తీసుకొచ్చింది రెండు కేజీలే కదా అంటాడు రాజు.
ఇందు: చికెన్ డైరెక్టుగా వేస్తే సరిపోదు కానీ కప్పులో వేస్తే సరిపోతుంది.
రాజు: కప్పులో వేస్తే నాకే సరిపోదు వచ్చిన వాళ్లు ఏమనుకుంటారు
ఇందు: అయితే ఓ పని చేద్దాం.. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లకు తినడానికి ముందే నిమ్మరసం చేసి ఇద్దాం. నిమ్మరసం తాగాక తక్కువగా తింటారు
వెంకట్: ఐడియా అదిరిపోయింది.. ఇంకెందుకు లేటు వెళ్లి అందరినీ పిలుద్దాం
రాజు: ఎక్కడికి వెళ్లేది. చేద్దాం అనుకోవడం వేరు చేసేది వేరు. నేను ఏదో అనుకుంటున్నాను. చిన్నగా బిజినెస్ మొదలు పెట్టి ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కానీ నేను ఇంకా బిజినెస్సే మొదలుపెట్టలేదు. ఇది కూడా ఇంతే
ఇందు: నమ్మకంగా మనం చేసే పని వైపు ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాం. అంతే కానీ అడ్డదారిలో వెళ్లి సంపాదించుకోవాలంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు.
వెంకట్: కరెక్టుగా చెప్పారు
ఇందు: వెంకీ ఒక పని చేయ్ నువ్వు నందు కలిసి ఈ పక్క వీధిలోకి వెళ్లి జనం అందరినీ పిలవండి. నేను మీ అన్నయ్య ఆ పక్క వీధిలోకి వెళ్లి అందరినీ పిలుస్తాం
సరే అంటూ వెళ్తారు. ఇందు, రాజు ఒక ఇటి దగ్గరకు వెళ్తారు. డోర్ క్లోజ్ చేసుకుని ఉంటుంది.
ఇందు: ఏంటి సైలెంట్‌గా ఉన్నావు..? వాళ్లను పిలువు
రాజు: నువ్వు ఉన్నావు కదా పిలువు
ఇందు: ఏయ్ ఇప్పుడు పిలుస్తావా..? లేదా..?
రాజు: పిలవకపోతే ఏం చేస్తావు.. ఆ డల్లాస్ గాడికి చెప్తావా..?
ఇందు: డల్లాస్ కే కాదు.. మీ అమ్మా నాన్నలకు కూడా చెప్తాను.. నన్ను కిడ్నాప్ చేశావని
రాజు: అమ్మా వద్దు తల్లి పిలుస్తాను ఉండు..
అంటూ పిలుస్తాడు. ఇక రెండు జంటలుగా వెళ్లి జనాన్ని పిలుస్తుంటే.. వాళ్లే పెళ్లి చేసుకుని వచ్చి పెళ్లి రిసెప్షన్‌కు పిలుస్తున్నట్టు జనం అంటుంటారు. దీంతో వాళ్లు సిగ్గు పడుతుంటారు. మరోవైపు చక్రి డబ్బులు ఇవ్వలేదని బాధతో హాల్లో కూర్చున్న రేఖ దగ్గరకు భ్రమరాంబ వెళ్లి డబ్బులు తీసుకొచ్చారా..? అని అడుగుతుంది.
భూషణ్: వాడు డబ్బులు ఇవ్వనన్నాడు అక్కా
భ్రమరాంబ: మరి నగలు తిరిగి ఇచ్చాడా..? ఎక్కడున్నాయి…?
భూషణ్: పాత అప్పు కిందకు ఆ నగలు తాకట్టు పెట్టుకున్నాడు
అనగానే.. భ్రమరాంబ తన నగలు పోయాయని బాధపడుతుంది. అప్పుడే అపర్ణ వస్తుంది. అయితే నా మనవరాలి పరిస్థితి ఏంటి మరి అని అడుగుతుంది.
అపర్ణ: నా మనవరాలిని మీరు తీసుకురాలేరా..? అయితే నేను వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాను. మీడియాకు చెప్తాను
రేఖ: ఏంటి నోరు లేస్తుంది
అపర్ణ: ఇన్ని రోజులు నా మనవరాలి కోసం మౌనంగా ఉన్నాను.. ఇప్పుడు అదే లేకపోతే ఊరుకుంటానా..? మీకు రెండు రోజుల టైం ఇస్తున్నాను నా మనవరాలిని తీసుకురాకపోతే ఏం చేయాలో అదే చేస్తాను
భ్రమరాంబ: ఏం చేస్తావు.. నువ్వు ఏం చేయగలవు..?
అపర్ణ: నేను ఏం చేస్తానో.. ఏం చేయగలనో రెండు రోజుల్లో చూపిస్తాను.. నా మనవరాలు రెండు రోజుల్లో రాకపోతే మీకే తెలుస్తుంది.
అంటూ వార్నింగ్ ఇచ్చి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు ఫంక్షన్ కోసం ఇందు వంట చేస్తుంటే.. రాజు, నందు, వెంకట్ హెల్ప్ చేస్తుంటారు. అప్పుడే లక్కీ వచ్చి రాజును పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ విషయం ఇంట్లో తెలిస్తే ఎలా అంటూ భయపడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
