Meghasandesam Serial Today Episode:  భూమి గగన్‌ ఇంటికి వెళ్తుంది. భూమిని చూసిన పూరి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది. ఏమైందని భూమి అడగ్గానే నీకు కాబోయే ఆయన పేరు చెప్పి అప్పుడు లోపలికి అడుగుపెట్టు అంటుంది. దీంతో భూమి గగన్‌ గారు అంటూ పేరు చెప్పి సిగ్గు పడుతుంది. దీంతో పక్కన మర్యాదలు ఉండకూడదు ఉత్తి  పేరే చెప్పాలి అంటుంది. భూమి: గగన్ సరేనా..

పూరి: ఆ ఇప్పుడు లోపలికి రా..?

శారద: అమ్మా భూమి ఆగు.. నేరుగా వాడి గదిలోకి వెళ్తావా ఏంటి..?

భూమి: ఏ ఆయన లేరా..?

శారద: చెప్తాను కానీ ముందు ఈ పంచదార నీళ్లు తాగు. నువ్వు వస్తున్నావని కలిపాను అమ్మా

భూమి: ఎందుకు అత్తయ్యా..

శారద: సంప్రదాయం అమ్మా.. ఈ ఇంటికి కోడలివి అవుతున్నావని మా అబ్బాయి అనౌన్స్‌ చేశాడు కదా అందుకు. 

భూమి: ఒకసారి మీ అబ్బాయి గారిని కలిసి వస్తాను అత్తయ్యా..

శారద: ఆగు నేను ఇప్పుడు నీ అత్తయ్యను ఆపే అధికారం నాకు ఉంది. ఈ ఇంటికి కోడలు అవుతున్నావు కదా.. నాకు సేమియా పాయసం చేసి అప్పుడు వెళ్లు అత్తగా ఇది నా ఆర్డర్‌.

భూమి: అత్తయ్యా…?

పూరి: నాకు హల్వా..

శారద: అమ్మా పూర్తి మీ అన్నయ్యకు ఏ స్వీటు కావాలో అడుగు వెళ్లి అడిగిరా..?

భూమి: పూరి నీకెందుకు శ్రమ నేను అడుగుతాను ఉండు వెళ్తాను.

అంటూ భూమి పరుగెత్తుకంటూ పైకి గగన్‌ రూంలోకి వెళ్తుంది. అప్పుడే రూంలోంచి బయటకు వస్తున్న గగన్‌ను భూమి ఢీకొడుతుంది. దీంతో ఇద్దరూ వెళ్లి బెడ్‌ మీద పడతారు. ఇద్దరి మధ్య చిన్న రొమాన్స్‌ జరుగుతుంది. తర్వాత భూమి వెళ్తుంటే గగన్‌ చేయి పట్టుకుని అపుతాడు.

గగన్‌: ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు..

భూమి: అంటే మీకు ఏ స్వీట్‌ కావాలో శారద అత్తయ్య అడగమంది..

గగన్‌: ఇచ్చేశాను అని చెప్పు..

భూమి: చీ పోండి..

అంటూ భూమి కిందకు వెళ్లిపోతుంది. మరోవైపు ఏసీపీ ఒక రౌడీని జైళ్లో వేసి కొడుతుంది. శరత్‌చంద్ర గారిని ఎవరు చంపమన్నారో చెప్పు అంటుంది. ఇంతలో స్టేషన్‌కు అపూర్వ వస్తుంది. ఏసీపీ కొడుతున్న రౌడీని చూస్తుంది అపూర్వ.

అపూర్వ: వాడేనా నా బావను చంపాలనుకుంది. వదలండి వాణ్ని నేను చంపేస్తాను..

ఏసీపీ: ఏయ్‌ అపూర్వ ఇక్కడ నేను ఇంటరాగేషన్‌ చేస్తున్నప్పుడు ఇక్కడ నా సౌండ్‌ మాత్రమే రీసౌండ్‌ రావాలి. నాకు ఇంకే సౌండ్‌ వినిపించకూడదు.

అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో అపూర్వ అక్కడే ఆగిపోతుంది.  తర్వాత ఏసీపీ లోపలికి వెళ్లి రౌడీని కొడుతుంట.. అపూర్వ రౌడీకి సైగ చేస్తుంది. నీతో మర్డర్‌ ప్లాన్‌ చేసింది గగన్‌ గాడని చెప్పు అంటుంది. అపూర్వ చెప్పినట్టుగానే ఆ రౌడీ నిజం చెప్తాను మేడం అంటూ గగన్‌ పేరు చెప్తాడు. దీంతో ఏసీపీ కోపంగా గగన్‌ వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి అని మిగతా పోలీసులకు చెప్తుంది. మరోవైపు కింద భూమి, శారద, పూరి మాట్లాడుతుంటారు. గగన్‌ వస్తాడు.   

గగన్‌: ఏంటి ముగ్గురు కలిసి మీటింగ్‌ పెట్టారు..

పూరి: ఏం లేదు అన్నయ్యా..

అంటూ ఇద్దరూ గగన్‌ చెంపకు ఉన్న భూమి బొట్టును చూస్తారు. గగన్‌ వెళ్లిపోతుంటే భూమి కూడా గమనిస్తుంది.

భూమి: ఆగండి..

గగన్‌: ఇందాక నేను షూ పాలీస్‌ చేస్తుంటే గీసుకున్నట్టు ఉంది.

శారద: కవర్‌ చేసుకుంటున్న కొద్దీ దొరికిపోతున్నారు.

ఎసీపీ: మీరు అన్నది నిజమే..మీ అబ్బాయి దొరికిపోయిన మాటైతే నిజమే

గగన్‌: ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ.       

ఏసీపీ: యువరాండర్‌ అరెస్ట్‌.. మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాం.

గగన్‌: నన్ను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో తెలుసుకోవచ్చా..?

ఏసీపీ: శరత్‌ చంద్ర గారిని అటెంప్ట్‌ మర్డర్‌ చేసిన కేసులో అరెస్ట్‌ చేస్తున్నాం.

అని చెప్పి గగన్‌ ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!