Lakshmi Nivasam Serial Today Episode: తులసిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు సుపర్ణిక, భార్గవ్. తనకు ఉద్యోగం చాలా అవసరమని ఎండీ పోస్ట్ నుంచి తప్పుకొంటానని తులసి చెప్పినా వాళ్లు వినరు. మరోవైపు, కాలేజీలో ఈవెంట్ కోసం జాను రెడీ అవుతుంటుంది. సరిగ్గా అప్పుడే చీఫ్ గెస్ట్‌గా రాబోతున్న జై ఎంట్రీ ఇస్తాడు. తనను తాను జానుకి పరిచయం చేసుకుంటాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జాను సారీ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు, ఉద్యోగం పోయిన బాధలో తులసి వస్తుండగా.. ఓ పేద వృద్ధురాలి ఇంటిని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే మనుషులు ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో సిద్ధు అక్కడకు వెళ్లి వారిని అడ్డుకుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

తులసి దృష్టిలో విలన్‌గా సిద్ధు?

వృద్ధురాలి ఇంటిని ఖాళీ చేయించే క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు సిద్ధును బెదిరిస్తూ జేసీబీతో ఆమె ఇళ్లు కూల్చాలని యత్నిస్తారు. దీంతో వారిని సిద్ధు అడ్డుకుంటాడు. వారిని కొడుతుండగా తులసి అక్కడికి వస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరుడు ఒకన్ని కొట్టబోతుండగా తులసి మధ్యలో వస్తుంది. దీంతో ఆమెను చూసిన సిద్ధు ఒక్కసారిగా షాకై వెనకడుగులు వేస్తాడు. తులసి సైతం సిద్ధుని అలానే చూస్తూ ఉండిపోతుంది. అయితే, వృద్ధురాలి ఇంటిని సిద్ధునే లాక్కునేందుకే గొడవ చేస్తున్నాడని పొరపాటు పడిన తులసి అతన్ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

జాను పాటకు జై ఫిదా

మరోవైపు, కాలేజీ ఈవెంట్‌లో జాను ప్రసంగిస్తుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన జై ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదే సమయంలో కల్చరల్ కార్యక్రమాల్లో భాగంగా జాను పాట పాడుతుంది. ఆ పాటకు జైతో పాటు అంతా ఫిదా అవుతారు. విశ్వ అతని ఫ్రెండ్స్‌తో పాటు కాలేజీ విద్యార్థులంతా ఆమెను అభినందిస్తారు.

జానుకు విశ్వ ప్రపోజ్ చేస్తాడా..

ఆ తర్వాత విశ్వ అతని ఫ్రెండ్స్ బయటకు వచ్చి జాను గురించి మాట్లాడుకుంటుంటారు. జాను త్వరగా ప్రపోజ్ చేయాలని లేకుంటే ఆమె వేరే వారికి సొంతం అయ్యే ఛాన్స్ ఉందని విశ్వ ఫ్రెండ్స్ అతనికి చెప్తారు. ఇది విని షాక్ అయిన విశ్వ జానుకు త్వరలోనే ప్రపోజ్ చేస్తానని చెప్తాడు. దీంతో ఫ్రెండ్స్ విశ్వను ఎంకరేజ్ చేస్తారు. 

వేదనలో ఖుషీ

ఇక రాత్రి భోజనం సమయంలో ఖుషీ అన్నం తినేందుకు టేబుల్ ముందు కూర్చుంటుంది. హరీష్ తన భార్య కోసం బ్రెడ్ జామ్ రెడీ చూస్తుండగా.. ఖుషీ అతన్నే చూస్తుంది. ఖుషీని అన్నం తినాలని తులసి అడగ్గా.. తాను రాత్రి అన్నం తిననని లైట్‌గా బ్రెడ్ జామ్ తింటానని అంటుంది. ఇది విన్న హరీష్ భార్య కీర్తి వెటకారంగా మాట్లాడుతుంది. అయితే, తాను మార్నింగ్ తీసుకొస్తానని ఈ పూటకు అన్నం తినాలని తులసి ఖుషీకి చెప్తుంది. 

అయితే, బ్రెడ్ జామ్ కావాలని ఖుషీ పట్టుబడుతుంది. ఒక్కపూటకు ఇవ్వాలని హరీష్‌ను శ్రీనివాస్ అడగ్గా.. హరీష్ కాదంటాడు. ఇదే సమయంలో జాను.. చిన్న బ్రెడ్ ముక్క కోసం ఎందుకు గొడవ పడుతుంటారంటూ అంటుంది. జానుకు బామ్మ సపోర్ట్ చేస్తుంది. వారికి సద్దిచెప్పిన తులసి ఖుషీని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. తాను బ్రెడ్ తీసుకొస్తానని రామం అంటాడు. దీంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాత్రి పూట షాప్ ఉండదని.. మార్నింగ్ తెస్తానని అతనితో తులసి చెప్తుంది.

యాక్సిడెంట్ న్యూస్ చూసి బసవ షాక్

మరోవైపు, శ్రీకాంత్, వసుంధర యాక్సిడెంట్ న్యూస్ పేపర్‌లో చూసి బసవ షాక్ అవుతాడు. ఇదే సమయంలో బసవ కోడలు అతనికి కాఫీ ఇస్తూ వారిని అనుమానంగా చూస్తుంది. పక్కకు వెళ్లి వారిని గమనిస్తుంది. బసవ ఆ పేపర్ క్లిప్‌ను చించేసి జేబులో దాచుకుంటాడు. అలా ఎందుకు చించేశారంటూ బసవ కోడలు ప్రశ్నిస్తుంది. ఇంతలో పీఏ ఏదో చెబుతుండగా బసవ అతనిపై చిరాకు పడతాడు.

ఇంతలో బసవ కూతురు కీర్తి అక్కడకు వస్తుంది. వారితో మాట్లాడుతూ పేపర్‌ను ఎందుకు చించేశారంటూ బసవను అడుగుతుంది. ఇంతలో బసవ తల్లి విషయం ఏంటని అంటుంది. తులసి పెళ్లి ఆగిపోయిన విషయం బసవ వాళ్లకు చెబుతుంది. ఇది విని షాకైన బసవ యాక్సిడెంట్ ఏ రూట్‌లో జరిగిందని తెలుసుకుంటాడు. సిద్ధు చేసిన యాక్సిడెంట్ వల్లే తులసి పెళ్లి ఆగిపోయిందని బసవ తెలుసుకుంటాడు. మరి సిద్ధుకు ఆ నిజం తెలిసిందా.? తులసి దృష్టిలో సిద్ధు విలనా హీరోనా?, విశ్వ జానుకు ప్రపోజ్ చేస్తాడా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.