Lakshmi Nivasam Serial Today Episode: శ్రీ, వసుంధర ఇద్దరూ చనిపోగా.. ఖుషీ కోసం తులసి మథన పడుతుంది. ఇదే సమయంలో సుపర్ణిక తన అన్నయ్య శ్రీ డెడ్ బాడీని తాకకూడదంటూ తులసిని హెచ్చరిస్తుంది. వీల్ ఛైర్‌లో వచ్చిన ఖుషీ.. వసు, నాన్న ఎక్కడ అంటూ తులసిని అడుగుతుంది. దీంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక నీకు అన్నీ తానే అంటూ ఖుషీకి సుపర్ణిక చెప్పగా.. వారితో వెళ్లేందుకు ఖుషీ మారాం చేస్తుంది.

ఖుషీని తనతో పాటు తీసుకెళ్తానని తులసి చెప్పగా.. భార్గవ్ చెప్పడంతో సుపర్ణిక ఒప్పుకొంటుంది. ఆ పాపను ఎందుకు ఇంటికి తీసుకొచ్చావంటూ తులసిని.. ఆమె అన్నయ్యలు, వదినలు అడుగుతారు. దీంతో ఖుషీ ఇక ఇక్కడే తనతో పాటే ఉంటుందని.. అంటుంది. లక్ష్మీ, శ్రీనివాస్ కూడా ఫ్యామిలీకి నచ్చచెబుతారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

ఖుషీని ఇంటికి పంపించేయాలన్న అన్నలు

ఖుషీని తన ఇంటికి పంపించేయాలని తులసి అన్నలు.. లక్ష్మి, శ్రీనివాస్‌లతో చెప్తారు. దీంతో వారు వారిపై కోపం తెచ్చుకుంటారు. ఆ పాప వల్ల తులసి జీవితంలో ఏ మార్పు వస్తుందో చూద్దామని శ్రీనివాస్ చెప్తాడు. కష్టంగా ఉంటే వారినే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. దీంతో లక్ష్మి వేదనకు గురవుతుంది. 

కొడుకుల మాటలకు లక్ష్మి వేదనకు గురవుతుంది. దీంతో శ్రీనివాస్ ఆమెను ఓదారుస్తాడు. మనకే ఎందుకిలా జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది లక్ష్మి. ఖుషి తులసి జీవితంలోకి రావడం వల్ల ఏం జరుగుతుందోనని భయంగా ఉందని శ్రీనివాస్ అంటాడు. మరోవైపు, తులసి అన్నలు హరీష్, సంతోష్ ఇద్దరూ తులసి ఇంట్లో ఉండడంపై వారి భార్యల వద్ద వాపోతారు. 

త్రివేణికి నిజం తెలుస్తుందా..

తులసి పెళ్లి ఆగిపోయిందని తెలిసి లక్ష్మి వదిన త్రివేణి వేదనకు గురవుతుంది. ఈ విషయాన్ని విజయేంద్రకు చెప్పేందుకు త్రివేణి వెళ్తుంది. ఇదే సమయంలో విశ్వ అక్కడకు బాధగా వస్తాడు. ఏమైందని విజయేంద్ర అతన్ని అడుగుతాడు. జాను అక్కను చేసుకోబోయే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్తాడు. త్రివేణి ఆ విషయం అడిగితే విజయేంద్ర ఆమెపై కోపం తెచ్చుకుంటాడు. ఇక ఈ విషయం విజయేంద్రకు చెప్పకపోవడమే మంచిదని త్రివేణి అనుకుంటుంది.

యాక్సిడెంట్ చేసిన వారికి తులసి వార్నింగ్..

తులసి పెళ్లి ఆగిపోవడంపై జాను బాధ పడుతుంటే.. తాను ఖుషి గురించి ఆలోచిస్తున్నానని తులసి చెప్తుంది. ఆ ప్రమాదం ఎవరు చేశారో తెలిస్తే వారిని కఠినంగా శిక్షించాలని జాను అంటుంది. యాక్సిడెంట్ ఎవరు చేశారో..? వారికి ఎలాంటి శిక్ష వేయాలో.. తానే చూసుకుంటానని తులసి జానుతో అంటుంది.

ఇదే టైంలో బామ్మ.. రామం కోసం అన్నం తీసుకెళ్తుంది. తనను అనాథ అన్నందుకు రామం బాధ పడుతుండగా.. జాను అతనికి ముద్దలు కలిపి పెడుతుంది. అన్నలు ఏదో అన్నారని పట్టించుకోవద్దని.. ఈ బంధం కాదనుకుంటే పోయేది కాదని అన్నం పెడుతుంది. 

సిద్ధుకు నిజం తెలిసిందా

సిద్ధు చేసిన యాక్సిడెంట్‌ను కప్పి పుచ్చినందుకు డాక్టర్, పోలీస్ ఆఫీసర్‌కు బసవ లంచం ఇస్తాడు. ఈ విషయం సిద్ధుకు ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వొద్దని బసవ వారికి చెప్తాడు. సీసీ ఫుటేజీ, పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రానివ్వొద్దని అంటాడు. దీంతో వారు సరే అంటారు. అయితే, బసవ వారికి డబ్బులిచ్చిన విషయాన్ని సిద్ధుకు అతని వదిన చెప్తుంది. ఆ తర్వాత సిద్ధు ఆలోచనలో పడతాడు.

సిద్ధుకి తాను యాక్సిడెంట్ చేసిన తర్వాత వారు చనిపోయారని తెలుస్తుందా..?, బసవ వారికి డబ్బులిచ్చిన విషయాన్ని ఆరా తీస్తాడా..?  ఖుషి రాకతో తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది.? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.