Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపుర బాల ఇంటికి వస్తుంది. బాల సంతోషంతో ప్రతీ ఒక్కరినీ పేరు పేరున త్రిపురని పరిచయం చేస్తాడు. యశోద బాల బాధ్యతని త్రిపురకు అప్పగిస్తుంది. ఇక బామ్మ కూడా బాలని తొందర్లో కోలుకునేలా చేయమని త్రిపురకు చెప్తుంది. బాల త్రిపురతో ఆడుకుందామని చెప్తే ముందు కషాయం తాగాలని చెప్తుంది. బాల వద్దు అని మారాం చేస్తాడు. నువ్వే ఏదో ఒకలా తాగించాలని త్రిపురను చెప్తారు.
కషాయం ఎక్కడుందని త్రిపుర అడుగుతుంది. మేడ మీద ఉందని యశోద చెప్పడంతో త్రిపుర వెళ్తుంది. నాగభూషణం ఆ కషాయంలో ముందే మందు కలిపేసుంటాడు. ఆ విషయం కొడుకు, భార్యలకు సైగ చేసి నవ్వుకుంటాడు. త్రిపుర ఆ కషాయం తీసుకొచ్చి బాలకు తాగమని అంటుంది. బాల తాగను అని మారాం చేస్తాడు. చేదుగా ఉంటుంది వద్దు అని అంటాడు. దాంతో త్రిపుర ఏం చేయాలా అనుకుంటూ కషాయం అక్కడే పెట్టేసి కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి దండం పెట్టి అక్కడే ఉన్న పిల్లనగ్రోవి తీసి ఊదుతుంది. అందరూ త్రిపుర ఫ్లూట్ ఊదుతుందని చాలా హ్యాపీగా ఫీలవుతారు. బాల చాలా సంతోషపడతాడు.
త్రిపుర తన చేతులతోనే బాలని మరింత ఇబ్బంది పడేలా చేస్తుందని విరుగుడు కలిపేశాం కదా అని ఫణి వాళ్లు సంతోషపడతారు. బాల తనకు కూడా పిల్లనగ్రోవి తనకు నేర్పించమని చెప్తాడు. దాంతో కషాయం తాగితేనే నేర్పిస్తాను త్రిపుర అంటుంది. నేర్పిస్తేనే కషాయం తాగుతా అని బాల అంటే త్రిపుర నేర్పించి కషాయం తాగమని చెప్తుంది. బాల నేర్చుకుంటుంటే అందరూ నవ్వుకుంటారు. ఇక త్రిపుర కషాయం తీసుకొచ్చి ఇస్తుంది. త్రిపుర కషాయం చేతికి ఇస్తుండగా అది కింద పడిపోతుంది. నాగభూషణం, వాసుకి, ఫణిలు తన ప్లాన్ వేస్ట్ అయిపోయిందని అనుకుంటాడు. త్రిపుర మాత్రం కషాయం తీసుకురావడానికి వెళ్లి అక్కడ విరుగుడు మందు కొంచెం పడి ఉండటం గుర్తించి కావాలనే కషాయం పడేస్తుంది. గురువుగారు చెప్పినట్లు ఈ ఇంట్లోనే బాలగారికి శత్రువులు ఉన్నారు వాళ్లు ఎవరో కనిపెట్టాలని అనుకుంటుంది.
మరోవైపు అనంత్ గాయత్రీ ఇంటికి వెళ్తాడు. రమాదేవి చూసి ఊర్వశితో అల్లుడు గారు వచ్చారని చెప్తుంది. ఊర్వశి ఎగ్జైట్ అయి అనంత్‌కి ఎదురెళ్లి లోపలికి రమ్మని అంటే అనంత్ గాయత్రీ గురించి అడుగుతాడు. గాయత్రీ లేదు అనగానే లోపలికి రాకుండా వెళ్లిపోతాడు. ఊర్వశి రమ్మని అంటే గాయత్రీ కోసం వచ్చా తను లేకపోతే నాకు ఇక్కడేం పని అని వెళ్లిపోతాడు. ఊర్వశి కోపంతో రగిలిపోతుంది. కుర్రాడిలో ప్రేమ పొంగిపోతుందని రమాదేవి అంటుంది. ఏం చేయాలా అని తల్లీకూతుళ్లు ఆలోచిస్తూ త్రిపుర రావడం చూసిన రమాదేవి కావాలనే ఊర్వశికి తన ప్లాన్ చేప్తుంది. త్రిపుర చూసేలా ఊర్వశిని కొడుతుంది. ఏమైందని త్రిపుర అడుగుతుంది. దాంతో రమాదేవి సిటీకి వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే ప్రేమ అంటుంది అని నువ్వు కేర్ టేకర్‌గా వెళ్తున్న బాల తమ్ముడిని ప్రేమిస్తుందని అంటుంది. అతను ఇప్పుడే ఇంటికి వచ్చి వెళ్లాడని చెప్తుంది.
అనంత్ లేకపోతే చచ్చిపోతానని ఊర్వశి అంటుంది. గుడిలో అనంత్ గాయత్రీ లేకపోతే ఉండలేను అని చెప్పడం విన్న త్రిపుర అనంత్ చెప్పింది ఊర్వశికే అనుకొని తాను ఇద్దరినీ కలుపుతా అని అంటుంది. అనంత్‌తో ఊర్వశి పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది. మరోవైపు రాత్రి గాయత్రీ ఇంటికి వస్తుంటే కొంతమంది రౌడీలు తమ వ్యాన్‌లో ఎక్కించుకొని గాయత్రీ చేతులు కాళ్లు కట్టేసి నోటికి గుడ్డు అడ్డుంగా పెడతారు. రోడ్డు మీద ఓ చోట గాయత్రీని పడేస్తారు. అదంతా అనంత్ చేయిస్తాడు. గాయత్రీ తాడు విప్పమని సైగ చేయడంతో నేను చేయను. నేను చెప్పేది వినే వరకు కట్లు విప్పను అని ఏం జరిగిందో నీకు తెలియాలి అని నువ్వు మాట్లాడకుండా ఇలా చేశానని చెప్పి అనంత్ గాయత్రీకి రిజిస్టర్ ఆఫీస్‌లో జరిగిన సంఘటన వీడియో చూపిస్తాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!