Lakshmi Nivasam Serial Today April 7th Episode Review: జాను ఇంటికి పెళ్లి ప్రపోజల్‌తో వెళ్తాడు జై. ఇదే సమయంలో సుపర్ణికకు ఆస్తి విషయంలో షాక్ ఇస్తాడు శ్రీ. తన వీలునామాలో మొత్తం ఆస్తిని తన కూతురు ఖుషీ పేరు మీద రాసేస్తాడు. దీంతో సుపర్ణికతో పాటు భార్గవ్, అతని తల్లి భాగ్యం తలలు పట్టుకుంటారు. వీలునామాను చూసేందుకు వీలు లేదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదే సమయంలో కీర్తి ఇంటికి వెళ్లాడని బసవతో గొడవ పడతాడు సిద్ధు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
పెళ్లి విషయంలో జాను నిర్ణయమేంటి?
జాను పెళ్లి విషయం గురించి లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఫ్యామిలీతో డిస్కస్ చేస్తుండగా.. తన గురించి ఆలోచించొద్దని తన అభిప్రాయం చెప్పాలని జానుతో అంటుంది తులసి. తన చదువు పూర్తి కావాలని వారితో అంటుంది జాను. తన పెళ్లి విషయం గురించి లక్ష్మీ, శ్రీనివాస్‌లదే తుది నిర్ణయమని చెప్పి జాను వెళ్లిపోతుంది. ఇదే సమయంలో ఖుషీ గురించి చర్చ జరుగుతోంది. హరీష్, మహేష్ ఇద్దరూ తులసిని తప్పుబడతారు. వాళ్లను కోప్పడిన శ్రీనివాస్.. టైం తీసుకుందామని.. జై గురించి ఎంక్వైరీ చేద్దామని అంటాడు.
ఆస్తి కోసం భార్గవ్ ప్లాన్
ఆస్తి మొత్తం ఖుషీ పేరున రాయడంపై సుపర్ణిక, భార్గవ్, భాగ్యం ఆందోళన చెందుతారు. చెల్లెలి కనీసం ఆస్తి రాయలేదని భాగ్యం ఎత్తిపొడుస్తుంది. మన మెయింటెనెన్స్‌కే ఎక్కువ డబ్బులు కావాలని.. సడన్‌గా ఖుషీని తెచ్చేస్తే వాళ్లకు డౌట్ వస్తుందని సుపర్ణికతో అంటాడు భార్గవ్. ఖుషీని ఎలాగైనా తీసుకురావాలని భార్గవ్‌తో చెప్తుంది సుపర్ణిక. దీంతో తన ప్లాన్‌లో తను ఉంటాడు భార్గవ్.
పోలీస్ స్టేషన్‌కు తులసి ఫ్యామిలీ
మరోవైపు.. శ్రీనివాస్ తన పని కోసం వెళ్తుండగా.. ఖుషీ తనను స్కూల్‌కు ఎప్పుడు పంపిస్తారని అడుగుతుంది. కాళ్లు నయం అయ్యాక పంపిస్తానంటాడు శ్రీనివాస్. జాను పెళ్లి కోసం బామ్మ అడగ్గా.. మహేష్, హరీష్ ఇద్దరూ వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇదే టైంలో తులసి ఇంటికి పోలీసులు రాగా.. వాళ్లు కంగారు పడతారు. తులసి, ఖుషీని స్టేషన్‌కు రావాలంటూ ఎస్సై అడుగుతాడు. దీంతో తామూ వస్తామంటూ లక్ష్మీ, శ్రీనివాస్‌లు వారితో స్టేషన్‌కు వెళ్తారు.
సిద్ధు వారిని కాపాడతాడా?
ఇదే సమయంలో సిద్ధు తన ఇంటికి వెళ్తుండగా.. అతని అనుచరుడు ఫోన్ చేసి మన వాళ్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్తాడు. దీంతో అలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించిన సిద్ధు.. ఆడపిల్ల అనే కనికరం కూడా ఉండదా? అంటూ నిలదీస్తాడు. తాను వెంటనే అక్కడికి వస్తానని చెప్తాడు.
జై ప్రపోజల్ తెలుసుకున్న విశ్వ
కాలేజీకి వెళ్లిన జాను.. విశ్వ డల్‌గా ఉండడం చూసి ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది జాను. గిఫ్ట్స్ తీసుకున్న తర్వాత ఆటో కోసం చూస్తే దొరకలేదని విశ్వకు చెబుతుంది. జై తన ఇంటి వరకూ వచ్చాడని.. తనతో పెళ్లి ప్రపోజల్ తెచ్చారని చెబుతుంది. దీంతో అంతా షాక్ అయ్యామని అంటుంది. ఇది విన్న విశ్వ ఆందోళనకు గురవుతాడు. ఇదే టైంలో నీ లైఫ్ పార్ట్‌నర్ ఎవరు అని విశ్వను అడుగుతుంది జాను. ఆ వివరాలు అవసరం లేదని తర్వాత చెబుతానని ఆమెతో అంటాడు. ఆ తర్వాత జాను క్లాస్‌కు వెళ్లిపోతుంది.
మరోవైపు.. ఖుషీని కిడ్నాప్ చేశారంటూ వారిపై కేసు పెట్టడంతో వారిని స్టేషన్‌కు తీసుకొస్తారు. శ్రీనివాస్, లక్ష్మిలతో సీఐ కోపంతో మాట్లాడగా.. తులసి అడ్డు చెబుతుంది. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. శ్రీ యాక్సిడెంట్‌లో చనిపోయాడని.. పాపను ఇంటికి తెచ్చామని వారు చెప్పగా.. ఖుషీ అనాథ కాదని సడన్‌గా అక్కడకు వచ్చిన సుపర్ణిక అంటుంది. ఇక సిద్ధు వారిని కాపాడతాడా?, ఖుషీ తులసికి దూరం అవుతుందా?, ఆస్తి కోసం భార్గవ్ ప్లాన్ ఏంటి? తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.