Lakshmi Nivasam Serial Today Episode: సిద్ధు ఆఫీసర్‌ను కొట్టడంతో తులసికి జాబ్ ఆఫర్ పోయిందని ఫ్యూన్ చెప్తాడు. దీంతో సిద్ధు ఆమె దృష్టిలో ఓ రౌడీ షీటర్‌గా నిలిచిపోతాడు. ఇక శ్రీ ఆస్తి కొట్టేయాలని భార్గవ్ ప్లాన్ చేస్తాడు. లాయర్‌తో మాట్లాడాలని సుపర్ణికకు చెప్పగా ఆయనే ఫోన్ చేశారని ఇంటికి వస్తున్నారని అతనితో చెప్తుంది. భార్గవ్‌ తల్లి భాగ్యం సైతం ఆ ఇంటికి వచ్చి తిష్ట వేస్తుంది. ఇదే సమయంలో జానుతో పెళ్లికి సిద్ధమవుతాడు జై. తన అనుచర గణంతో తాంబూలాల ప్లేట్లతో లక్ష్మీ, శ్రీనివాస్‌ల ఇంటికి వస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

జాను ఇంటికి జై.. 

జాను ఇంటికి తన అనుచరులతో పాటు వస్తాడు జై. తాంబూలాలు పెట్టడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తారు. తన పేరు జై నందన్ అని పెద్ద బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేసుకుంటాడు. దీంతో లక్ష్మీ, శ్రీనివాస్‌లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆశ్చర్యపోతారు. జానుకు ఆటో బుక్ కాకుంటే తాను ఇంటి దగ్గర డ్రాప్ చేశానని చెప్తాడు జై. అసలు తాంబూలాలు ఎందుకు తెచ్చారని జాను బామ్మ అడుగుతుంది.

దీంతో జై తనకు ఎవరూ లేరని.. తనకు అమ్మ, అక్క, వదిన వంటి బంధాలు కావాలని లక్ష్మీ, శ్రీనివాస్‌లకు చెప్తాడు. తాను జానును ఇష్టపడుతున్నానని.. మీ లాంటి మంచి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వారితో అంటాడు. దీంతో జానుతో పాటు అంతా షాక్ అవుతారు. నేరుగా తానే వచ్చి ఓపెన్‌గా చెప్పానని.. ప్రపోజల్ నచ్చితే బాగా ఆలోచించి నిర్ణయం చెప్పాలంటూ తనకు కాల్ చేయాలని విజిటింగా కార్డ్ ఇచ్చి వెళ్లిపోతాడు జై. 

అయితే, శ్రీనివాస్.. తులసి పెళ్లి ఆగిపోయిన విషయాన్ని జైకు చెప్తాడు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నామని.. తులసికి పెళ్లి చేయకుండా జానుకు పెళ్లి చేయడం భావ్యం కాదని అంటాడు. దీంతో తాను అర్థం చేసుకుంటానని.. ఆలోచించి ఏది కరెక్ట్ అయితే అదే చేయమని చెప్తాడు జై. 

ఆకతాయిలకు బుద్ధి చెప్పిన జై

జై బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో అక్కడ ఉండే కొందరు ఆకతాయిలు.. శ్రీనివాస్, తులసి, జాను గురించి తప్పుగా మాట్లాడతారు. ఇది విన్న జై వారిలో ఒకడిని పట్టుకుని తాళ్లతో కట్టి కారులో తీసుకెళ్లిపోతాడు. 

శ్రీ ఆస్తి అంతా ఖుషీ

మరోవైపు.. సుపర్ణిక ఇంటికి లాయర్ వస్తాడు. శ్రీ చనిపోవడానికి 4 రోజుల ముందే వీలునామా రాశాడని చెప్తాడు. అనుకోకుండా తనకు ఏదైనా జరిగితే తన యావదాస్తి తన కూతురు 'ఖుషీ'కే దక్కుతుందని.. ఆమెకు 18 ఏళ్లు నిండే వరకూ ఆమెను చూసుకున్న వారికి ఆస్తిలో పదో వంతు దక్కుతుందని వీలునామా రాస్తాడు. ఆస్తిలో 10 శాతం తల్లి వసుంధరకు, 5 శాతం చెల్లెలు సుపర్ణికకు ఇచ్చేలా వీలు రాస్తాడు. రూల్స్ అతిక్రమిస్తే ఆస్తి అంతా అనాథాశ్రమానికే దక్కుతుందని వీలునామాలో రాస్తాడు. 

అయితే, ఆ వీలునామా చూడొచ్చా అని లాయర్‌ను అడిగితే ఖుషీ, పోలీసుల సమక్షంలోనే తీస్తామని.. ఇలా సాధారణంగా తీయడం కుదరదని ఆమెతో లాయర్ చెప్తాడు. దీంతో తల పట్టుకుంటుంది సుపర్ణిక.

మరోవైపు, జై ప్రపోజల్ గురించి లక్ష్మీ, శ్రీనివాస్‌లు తన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు. అందరూ ఆ ప్రపోజల్‌కు ఓకే చెప్పాలని అంటారు. తులసిని అడగ్గా జాను అభిప్రాయం అడగాలని అంటుంది. అక్క పెళ్లి కాకుండా తన పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఇదే సమయంలో సంతోష్, హరీష్ రెండింటికీ ముడిపెట్టొద్దని అంటారు. ఇదే విషయాన్ని తులసి సైతం జానుకు నచ్చచెప్తుంది. జై ప్రపోజల్‌కు లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఒప్పుకొంటారా?, ఆస్తి విషయంలో సుపర్ణిక నెక్స్ట్ ఏం చేయబోతుంది?, తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పెళ్లి జరగదు.. టైం వేస్ట్ వద్దు.. స్వామీజీ మాటలకు సహస్ర, పద్మాక్షి ఫైర్