Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode మదన్‌కి లక్ష్మీ థ్యాంక్స్ చెప్తుంది. విహారి నీ జీవితంలో సమస్య అని మదన్ అంటాడు. విహారి సహస్ర విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలీదు అప్పుడు నీ జీవితం ఏమవుతుందో నాకు తెలీదు అని మదన్ అంటాడు. విహారి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఒకే అని లక్ష్మీ అంటుంది. మదన్ లక్ష్మీతో నీకు ఆల్‌దిబెస్ట్ కూడా చెప్పను లక్ష్మీ ఎందుకంటే ఒకరికి చెప్తే మరొకరి జీవితం నాశనం అయిపోతుందని వెళ్లిపోతాడు.
నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావ్..
లక్ష్మీ లోపలికి వెళ్తుంటే అంబిక అడ్డు వస్తుంది. లక్ష్మీ సైడ్ తప్పుకోమని అంటుంది. నీ దారిలోకి అడ్డు వస్తే నీకు ఇలా ఉంది మరి నువ్వు నా దారిలోకి అడ్డు వస్తే నాకు ఎలా ఉంటుంది. నా కంపెనీలో నా డబ్బు నేను తీసుకోవడానికి నువ్వు ఎందుకు అడ్డు పడుతున్నావే అని ప్రశ్నిస్తుంది. లక్ష్మీ ఏం సమాధానం చెప్పకుండా వెళ్తుంటే అంబిక లక్ష్మీ జుట్టు పట్టి ఆపుతుంది. దాంతో లక్ష్మీ విహారి బాబే ఎవరికీ డబ్బు ఇవ్వొద్దని చెప్పారని అంటుంది.
బావతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది..
సహస్ర వచ్చి పిన్ని దానికి ఏం చెప్పినా వేస్టే. దానికి లక్ష్మీ నేను మీరు చెప్పినప్పటి నుంచి విహారి గారితో వెళ్లడం లేదని అంటుంది. లక్ష్మీ గొంతు సహస్ర పట్టుకొని నేను నీ మీదే నిఘా పెట్టానని నువ్వు బావ కారులోనే తిరుగుతున్నావని అంటుంది. ఇద్దరూ కలిసి లక్ష్మీకి చివరి సారి వార్నింగ్ ఇస్తారు. ఇంకోసారి విహారి పక్కన చూస్తే వార్నింగ్‌లు ఉండవు చంపేస్తా అని లక్ష్మీతో సహస్ర చెప్తుంది.
అంతరాత్మ హెచ్చరిక..
విహారి ఆలోచిస్తూ ఉంటే విహారి అంతరాత్మ వస్తుంది. చాటుగా లక్ష్మీని భార్యగా ఒప్పుకున్నావ్ కానీ నిజం తెలిస్తే నిన్ను ఏమంటారో అర్థమవుతుందా. సహస్ర బతుకుతుందా. మీ మేనత్త ఊరుకుంటుందా. మీ అమ్మకి పరువు ఏమైనా ఉంటుందా. మీ నానమ్మకి నువ్వు ఇచ్చిన మాట నిలబడుతుందా. లక్ష్మీ తండ్రికి నిజం తెలిస్తే ఆయన బతుకుతుందా. లక్ష్మీ తల్లి మీ నుంచి పిల్లలు ఎక్పెక్ట్ చేస్తుంది ఆమెకు ఏం సమాధానం చెప్తావ్ అని అంతరాత్మ అడుగుతుంది. దాంతో విహారి నాకు నా దగ్గర ఏ సమాధానం లేదని అరుస్తాడు. నువ్వు ఇచ్చిన మాటకు ఏం చేస్తావ్. రేపటి రోజున ఎవరికి న్యాయం చేస్తావ్ ఎవరికి అన్యాయం చేస్తావ్ అని ప్రశ్నిస్తుంది అది ఆ తలరాత రాసిన దేవుడికే తెలుసు అని విహారి అంటాడు.
నా కూతురి గురించి ఆలోచించండి..
యమున కొడుకు దగ్గరకు వచ్చి మదన్ సడెన్‌గా ఎందుకు వెళ్లిపోయాడు. మదన్‌ని ఒప్పించాం కదా లక్ష్మీకి మంచి జీవితం ఉంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు లక్ష్మీ జీవితం ఏమైపోతుంది అని అంటుంది. దాంతో పద్మాక్షి వచ్చి నా కూతురి గురించి ఆలోచించవా ఎప్పుడూ లక్ష్మీనేనా అని అడుగుతుంది. అమ్మానాన్న కూడా విహారి, సహస్రల పెళ్లి గురించి అడుగుతున్నారని అంటుంది.
వెంటనే నీ పెళ్లి జరుగుతుందని చెప్పు..
ఇప్పటికే రెండు సార్లు పెళ్లి ఆగిపోయింది వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పు నాన్న అని యమున విహారితో అంటుంది. దానికి విహారి పెళ్లికి కాస్త టైం తీసుకుందాం అంటాడు. దాంతో పద్మాక్షి విహారి నీకు నా కూతురిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అంటుంది. త్వరలోనే పెళ్లి చేసేద్దాం అని యమున అంటుంది. స్వామీజీ దగ్గరకు వెళ్దాం. ఈ సారి ఎలా అయినా పెళ్లి జరిగిపోతుందని అంటుంది. అందరూ స్వామీజీ దగ్గరకు వెళ్తారు.నాకు సహస్రకు పెళ్లి ముహూర్తాలు..
లక్ష్మీ ఇళ్లు తుడుస్తూ కళ్లు తిరిగి పడిపోబోతే లక్ష్మీని విహరి పట్టుకుంటాడు. లక్ష్మీ తల నొప్పి అంటే విహారి కాఫీ తీసుకొస్తా అని అంటాడు. లక్ష్మీని కూర్చొపెట్టి కిచెన్‌కి వెళ్తాడు. లక్ష్మీ చూస్తూ ఉంటుంది. విహారి చేయి కాలడంతో లక్ష్మీ వెళ్లి చూస్తుంది. విహారిని పక్కుకు పెట్టి ఇద్దరి కోసం లక్ష్మీ కాపీ కలుపుతుంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగుతారు. లక్ష్మీ ఇంట్లో ఎవరూ లేరని అడిగితే అందరూ నాకు సహస్రకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి స్వామీజీ దగ్గరకు వెళ్లారని అంటుంది. భయంగా ఉంది నిజం దాచి యమున గారిని, సహస్ర గారి విషయంతో తప్పు చేస్తున్నానని అనిపిస్తుందని అంటుంది. సమస్యల్ని నేనే పరిష్కరిస్తానని విహారి అంటాడు.
పెళ్లి జరగదు.. వృథా ప్రయత్నం..
అందరూ స్వామీజీ దగ్గరకు వెళ్తారు. ఆగిపోయిన పెళ్లి మళ్లీ మీరు జరిపించాలని వచ్చామని చెప్తారు. దానికి స్వామీజీ వృథా ప్రయత్నం చేస్తున్నారు. ముడి పడని బంధం కోసం ముహూర్తం పెట్టమంటున్నారు. కలవని జీవితాల కోసం ప్రయాస పడుతున్నారని అంటాడు. మిమల్ని నమ్మి వస్తే ఏదేదో మాట్లాడుతున్నారని సహస్ర అంటే అది దైవ నిర్ణయం అని అంటారు. వేరే దగ్గరకు వెళ్లి ముహూర్తం పెట్టిస్తానని పద్మాక్షి అంటే ఎక్కడికి వెళ్లినా వృథా ప్రయాసే అని అంటారు. మాకు ఈ పెళ్లి జరగడం ముఖ్యం అని యమున అంటే హరిహరులు దిగి వచ్చినా మీరు చేయాలి అనుకున్న పెళ్లి జరగదు అని అంటారు. వేరే దగ్గర ముహూర్తం పెట్టిస్తామని పద్మాక్షి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అసలైన వారసురాలు ఎవరు నాన్న? కాశీ, స్వప్నల ఎంక్వైరీ