Lakshmi Nivasam Serial April 21st Today Episode: సిద్ధుకు.. ఎమ్మెల్యే మునుస్వామి కూతురు కనిష్కతో పెళ్లి ఫిక్స్ చేసేందుకు సిద్ధమవుతుంటారు ఇరు ఫ్యామిలీలు. మునుస్వామిని చూసిన సిద్ధు కోపంతో తండ్రి బసవపై రంకెలు వేస్తాడు. ఆలయంలో ఈ తంతు జరుగుతుండగా.. తులసి అదే ఆలయానికి వస్తుంది. అబ్బాయికి విషయం చెప్పలేదా? అంటూ మునుస్వామి.. బసవను ప్రశ్నిస్తాడు. దీంతో సిద్ధును పక్కకు తీసుకెళ్లిన బసవ అతనికి సద్దిచెప్పేందుకు యత్నిస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
సిద్ధుకు బసవ క్లాస్
మనం ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదని.. ఇప్పుడు వచ్చే మేయర్ ఎన్నికల్లో గెలవాలని సిద్ధుతో అంటాడు బసవ. రాజకీయంగా ఎదగాలంటే ఎమ్మెల్యే మునుస్వామి అండ కావాలని అంటాడు. ఆయనతో గొడవ పెట్టుకోవద్దని సిద్ధు దగ్గర మాట తీసుకుంటాడు సిద్ధు. నిన్ను మేయర్‌ను చేయడమే తన కల అంటూ సిద్ధుతో అంటాడు బసవ. తానేం చేసినా కానొద్దని చెప్తాడు తప్ప కనిష్కతో పెళ్లి విషయం రివీల్ చేయడు. దీంతో సిద్ధు కన్విన్స్ అవుతాడు.
సిద్ధును.. మునుస్వామి కుటుంబానికి పరిచయం చేస్తాడు బసవ. అతన్ని చూసిన కనిష్క ఫ్లాట్ అయిపోతుంది. ఇంతలో పూజారి పిలవడంతో అక్కడికి అంతా వెళ్తారు.
తులసికి అమ్మవారి చీర ఇచ్చిన సిద్ధు
తులసి అమ్మవారి దర్శనానికి రాగా.. ప్రసాదం భక్తులకు పంచాలని పూజారి ఆమెకు చెప్తాడు. దీంతో ఆమె భక్తులకు ప్రసాదం పంచుతుంటుంది. ఇదే సమయంలో తులసిని చూస్తాడు సిద్ధు. భక్తుల క్యూలో అలానే నిల్చుంటాడు. ఇంతలో అమ్మవారి శేషవస్త్రాన్ని దక్కించుకున్న వాళ్లకు మంచి జరుగుతుందని పూజారి, భక్తులు మాట్లాడుకుంటుంటే వింటాడు సిద్ధు. ఇది విని ఆ శేషవస్త్రాన్ని పూజారిని పక్కకు పంపించి తీసుకుంటాడు సిద్ధు.
ఆ చీరను తీసుకెళ్లి నేరుగా భక్తులకు ప్రసాదం ఇస్తున్న తులసి చేతిలో పెట్టేస్తాడు. ఇది చూసి ఆమె షాక్ అవుతుంది. 'నీకేమైనా పిచ్చా' అంటూ సిద్ధుపై కోపం తెచ్చుకుంటుంది. 'మీకు మంచి జరగాలని ఇచ్చాను' అంటూ సిద్ధు చెప్పగా.. చీర కింద పెట్టేందుకు యత్నిస్తుంది తులసి. ఇది చూసిన ఓ పెద్దావిడ అది కింద పెట్టకూడదని.. ఆ చీర నీ వద్దే ఉంచుకోవాలని చెప్తుంది. అమ్మవారి ఆజ్ఞతోనే ఆ చీర నీ చేతికి వచ్చిందని అంటుంది. దీంతో ఆ చీర తీసుకుంటుంది తులసి.
బసవపై ఎమ్మెల్యే మునుస్వామి ఆగ్రహం
ఆ తర్వాత సిద్ధు పని మీద బయటకు వెళ్తాడు. బసవ ఫోన్ చేసినా గుడికి వచ్చేందుకు నిరాకరిస్తాడు. దీంతో మునుస్వామి ఫ్యామిలీ షాక్ అవుతారు. బసవపై కోపం తెచ్చుకుంటారు మునుస్వామి ఫ్యామిలీ. అబ్బాయి లేకపోవడం ఏంటి అంటూ కోపం తెచ్చుకుంటుండగా.. అమ్మవారి శేషవస్త్రాలు కనిపించడం లేదంటూ పూజారి వచ్చి చెప్తాడు. అయితే, బసవే ఈ పని చేశాడంటూ మునుస్వామి నింద వేస్తాడు.
ఇంతలో తులసి చేతిలో అమ్మవారి శేషవస్త్రం చూసి ఎమ్మెల్యే మునుస్వామి ఫ్యామిలీ ఆమెపై నిందలు వేస్తారు. కనిష్క కూడా తులసిపై కోపం తెచ్చుకుంటుంది. దీంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది తిరిగి ఇచ్చేస్తానంటూ తులసి చెప్పగా.. అది తిరిగి తీసుకోవద్దంటూ కనిష్క అంటుంది. దీంతో తులసి కన్నీళ్లు పెడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత బసవకు సారీ చెప్పిన మునుస్వామి.. అమ్మవారి సన్నిధిలో పండ్లు, పువ్వులు అందించుకోవాలంటూ బసవ తల్లి సలహా ఇస్తుంది. అలా చేస్తే సిద్ధుతో కనిష్కకు పెళ్లి ఫిక్స్ అయినట్లేనని చెప్తుంది. దీంతో అలానే చేస్తారు మునుస్వామి, బసవ దంపతులు. ఇక సిద్ధుకు అసలు నిజం తెలుస్తుందా?, తులసికి సిద్ధు దగ్గరవుతాడా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.