Lakshmi Nivasam Serial Today Episode Review: శ్రీ ఆస్తి కోసం పన్నాగాలు పన్నుతున్న భార్గవ్, సుపర్ణికలు ఖుషీని కిడ్నాప్ చేశారంటూ తులసి కుటుంబంపై తప్పుడు కేసు పెడతారు. దీంతో వారిని జైల్లో వేస్తారు పోలీసులు. ఇదే సమయంలో స్టేషన్‌కు వేరే పని మీద వచ్చిన సిద్ధును చూస్తుంది తులసి. అతన్ని కలిస్తే పని అయిపోతుందని కానిస్టేబుల్ చెప్పినా.. అతను రౌడీషీటర్ అని అంటుంది. 

ఇంటికి వెళ్లిన తులసి ఆవేదనతో కీర్తికి చెప్పగా ఆమె తండ్రి బసవతో మాట్లాడాలని ఫోన్ చేయగా ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంతలో లక్ష్మీ, శ్రీనివాస్‌లను పోలీస్ జీప్‌లో సగౌరవంగా ఇంటికి చేరుస్తారు పోలీసులు. అరెస్ట్ చేసినందుకు తప్పై పోయిందని క్షమించాలని కోరుతారు. మీ డ్యూటీ మీరు చేశారని.. అందులో తప్పేముంది అంటూ శ్రీనివాస్ అంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో..

పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసింది ఎవరు?

లక్ష్మీ, శ్రీనివాస్‌లు బయటకు రావడంతో ఫ్యామిలీ అంతా సంతోషంతో ఉంటారు. తులసికి క్షమాపణలు చెప్పిన సీఐ.. ఎవరైనా అడిగితే ఇంటి వద్దే దింపామని చెప్పాలని కోరుతారు. ఇంతలో శ్రీనివాస్ స్టేషన్‌లో జరిగింది గుర్తు చేసుకుంటాడు. తాము స్టేషన్‌లో ఉంటే ఎవరో సీఐకు ఫోన్ చేశారని.. ఆ ఫోన్ కాల్‌తోనే పోలీసులు తమను గౌరవంగా ఇంటి దగ్గర దిగబెట్టారని చెప్తారు. ఎవరు ఫోన్ చేశారని అడగ్గా.. ఏమో తెలియదని అంటారు. కీర్తి వాళ్ల నాన్న బసవే ఫోన్ చేశాడని హరీష్ అంటాడు. దీంతో అంతా కీర్తిని ప్రశంసిస్తారు.

ఖుషీ ఏదైనా రామం అడిగితే పాపను.. సుపర్ణిక వాళ్లు తీసుకెళ్లారని చెప్పడంతో హరీష్, సంతోష్ మంచే జరిగిందని అంటారు. దీంతో తులసి, జాను వారిపై కోప్పడతారు.

ఖుషీ ఆలోచనలో తులసి

ఓ వైపు ఖుషీని భార్గవ్, అతని తల్లి భాగ్యం ఇబ్బందులు పెడుతుంటారు. చిన్న పాపతో పనులు చేయిస్తూ పైశాచికానందం పొందుతారు. పని వారందరినీ మాన్పించేసి ఆ పాపతోనే పనులు చేయించాలని.. అప్పుడే ఆస్తి మనదవుతుందని సుపర్ణికతో అంటాడు భార్గవ్. మరోవైపు.. ఖుషీ కోసం ఆలోచిస్తూ వేదనకు గురవుతుంటుంది తులసి. ఇంతలో జాను అక్కడకు వచ్చి ఓదారుస్తుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు వచ్చిన కీర్తి అందరం కలిసి గుడికి వెళ్దామని అంటుంది. దీంతో తులసి, జాను, కీర్తి అంతా కలిసి గుడికి బయల్దేరుతారు.

తులసి కోసం సిద్ధు ఆరాటం

ఇదే టైంలో సరిగ్గా వీళ్లు వెళ్లే ఆలయానికే వెళ్తాడు సిద్ధు. తులసిని తనకు మళ్లీ కనిపించేలా చూడాలంటూ దేవున్ని ప్రార్థిస్తాడు సిద్ధు. తన వాళ్లను ఒప్పించే ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇదే సమయంలో జానుతో కలిసి దేవుని దర్శనానికి వచ్చిన తులసిని చూస్తూ  సిద్ధు అలానే ఉండిపోతాడు. 

తులసిని మిస్ అయిన సిద్ధు

అయితే, తులసి మాత్రం సిద్ధుని రౌడీ షీటర్ అనే అనుకుంటుంది. తులసిని దూరం నుంచి చూస్తున్న సిద్ధు ఆమె దగ్గరకు వస్తుండగా ఓ అమ్మాయి తెచ్చిన కుంకుమ మీద పడుతుంది. దీంతో సిద్ధు వెనక్కి తిరిగి అది సరి చేసుకుంటుండగా.. ప్రదక్షిణలు చేద్దామంటూ తులసి వెళ్లిపోతుంది. 

గుడిలో సిద్ధుని చూసిన కీర్తి ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకొచ్చావంటూ సిద్ధుని అడగ్గా.. తులసి విషయం దాటవేస్తాడు. తన వాళ్లను పరిచయం చేస్తానంటుంది కీర్తి. వద్దంటూ సిద్ధు కోప్పడగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తులసి, జాను, కీర్తి ఆటోలో ఇంటికి వెళ్లిపోతుండగా.. తులసిని చూసిన సిద్ధు ఆటోలో ఆమె వెంటపడతాడు. అసలు సిద్ధు ఆమెను కలుస్తాడా?, లక్ష్మీ శ్రీనివాస్‌లను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు?, ఖుషి భవితవ్యం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.