Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మహాలక్ష్మీ సీక్రెట్‌గా వైద్యం చేయిస్తున్న అతన్ని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు.దీంతో నర్సు లక్ష్మీకి ఫోన్ చేసి చెబుతుంది.అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అని అరుస్తుంది.నేను వెంటనే వస్తున్నానని చెబుతుంది.ఇంతలో రౌడీల నుంచి తప్పించుకుని ప్రియంవద భర్త పరుగులు తీస్తాడు. అతను నేరుగా ప్రియంవద వాళ్ల ఇంటికే వస్తాడు. అప్పుడే ప్రియంవద తన భర్తను చూస్తుంది.ఇంట్లోకి రావడం గమనించి వెంటనే వెళ్లి రాడ్డుతో కొడుతుంది. అప్పుడు భార్యను చూసి గుర్తుపడతాడు. వెంటనే రౌడీలను పిలిచి అతన్ని తీసుకుని వెళ్లమని ఆదేశిస్తుంది. వాళ్లు వచ్చి వెంటనే అతన్ని తీసుకుని వెళ్తారు. శ్రీలక్ష్మీ పరుగును ఆస్పత్రికి వచ్చి అతని కోసం వెతుకుతుంది. డాక్టర్‌ను అడగ్గా...అతన్ని ఎవరూ కిడ్నాప్ చేసినట్లు లేదని....అతనే మెలకువ రాగానే లేచి వెళ్లిపోయి ఉంటాడని చెబుతాడు. అతను నిజంగా వెళ్లి ఉంటే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చేవాడని రాలేదంటే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అరుస్తుంది.అతనికి ఏమైనా అయ్యిందంటే మీదే బాధ్యత అని చెబుతుంది. రౌడీలసాయంతో తన భర్తను తీసుకుని తమ ఫాంహౌస్‌లో దాచిపెడుతుంది. అతన్ని కుర్చీకి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తుంది.అతన్ని జాగ్రత్తగా చూసుకోమని రౌడీలకు చెప్పి ఇంటికి వెళ్లిపోతుంది. ఇంతలో శ్రీలక్ష్మీ పరుగుపరుగునా ఇంటికి వెళ్లి విషయం సూర్యనారాయణకు చెబుతుంది. నేను కాపాడిన అతను కనిపించకుండా వెళ్లిపోయాడని బాధపడుతుంది. అతను ఎక్కడ ఉన్నాడో నీకు, డాక్టర్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా అతనికి మెలకువ రాగానే వాళ్ల వాళ్లకోసం వెళ్లిపోయి ఉంటాడని సూర్యనారాయణ అంటాడు. నాకు ఖచ్చితంగా అతనికి ఏదో ప్రమాదం జరిగిందని అనిపిస్తుందని అంటుంది. మనం వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనగా...సూర్యనారాయణ సరే వెళ్దాం పదా అని బయలుదేరుతుండగా ప్రియంవద ఆపుతుంది. ఎవరో రోడ్డునపోయే వాళ్లకోసం మనం స్టేషన్‌కు వెళ్లాలా అని వాళ్ల నాన్నను ప్రశ్నిస్తుంది.అతనికి మీకు సంబంధం ఏంటని రకరకాల ప్రశ్నలు వేస్తారని అంటుంది.ఇవన్నీ మనకు అవసరమా అని అంటుంది. నిజంగా అతను మంచి వాడే అయితే చేరాల్సిన చోటకి చేరే ఉంటాడని అంటుంది. ఇంట్లో వాళ్లు కూడా ఇప్పుడు ఈ తలనొప్పులు వద్దులే అని చెబుతారు. ఎక్కడికి వెళ్లాడో తెలియని మనిషిని మనం ఎక్కడని వెతుకుతామని సూర్యనారాయణ కూడా అంటాడు.అతనికి అంతా మంచి జరగాలని కోరుకుందామని చెప్పి వెళ్లిపోతాడు. తెల్లారిన తర్వాత సూర్యనారాయణ అందరినీ తీసుకుని కారులో బయలుదేరతాడు.ఎక్కడికి వెళ్తున్నామోఎవరికీ చెప్పడు. దీంతో అందరూ కంగారుపడతారు. ప్రియంవద అడిగితే...చెప్పేవాడినే అయితే ఇంట్లోనే చెప్పేవాడిని కదా అని అంటాడు. దీంతో ఐష్‌కు మరింత కంగారు పుడుతుంది. పెళ్లికొడుకు వాళ్లఇంటికేమోనని భయపడుతుంది.వెంటనే లక్ష్మీకి మెసేజ్ చేసి తాతయ్యను అడగమని చెబుతుంది.దీంతో లక్ష్మీ పెద్దాయనను అడగ్గా...నువ్వు ఆ తప్పిపోయిన మనిషి కోసం బాధపడుతున్నావు కాబట్టి నిన్ను సంతోష పెట్టడం కోసం వీళ్లందరినీ తీసుకుని ఓచోటకి వెళ్తున్నామని చెప్పి డ్రైవర్‌ను ఫాంహౌస్‌కు పోనివ్వమని చెబుతాడు.అంతే ప్రియంవద గుండెల్లోరాయిపడినట్లు అవుతుంది.
Lakshimi Raave Maa Intiki Serial Today May7th: భర్తను కొట్టి ఫాంహౌస్‌లో దాచేసిన ప్రియంవద....కుటుంబాన్ని తీసుకుని ఫాంహౌస్‌కు బయలుదేరిన సూర్యనారాయణ
Ajay Kumar | 08 May 2026 06:33 AM (IST)
Lakshimi Raave Maa Intiki Serial Today Episode May7th:భర్తను కొట్టి ఫాంహౌస్‌లో దాచేసిన ప్రియంవద....కుటుంబాన్ని తీసుకుని ఫాంహౌస్‌కు బయలుదేరిన సూర్యనారాయణ

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్