Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: అడవిలోకి వెళ్లిన కాలేజీ విద్యార్థులకు  ప్రొఫెసర్‌ ఓ గేమ్ ఇస్తాడు. అందరూ జంటలుగా వెళ్లి ఆ గేమ్‌ గెలవాలని చెబుతాడు.మ్యాడీ,శ్రీలక్ష్మీ ఇద్దరూ క్లూ ఆధారంగా  గేమ్‌ గెలవడానికి అవసరమైన కీ సంపాదిస్తారు. అయితే వాళ్ల చేతిలో నుంచి ఆ కీ విక్రమ్ లాక్కుని త్రిషకు ఇస్తాడు. అయితే త్రిష దగ్గర నుంచి మళ్లీ శ్రీలక్ష్మీ లాక్కుని మ్యాడీని తీసుకుని పరుగెత్తుతుంది.ఓ పాడుబడిన ఆలయంలో ఉన్న పెట్టె తెరవడానికి వెళ్తుండగా...వీళ్లను ఓడించేందుకు త్రిష కర్ర తీసుకుని శ్రీలక్ష్మీ కాళ్లకు విసురుతుంది. దీంతో లక్ష్మీ కిందపడిపోతుంది. మ్యాడీకి తాళం ఇచ్చి వెళ్లి పెట్టె తెరవమని చెబుతుంది.నువ్వు లేకుండా ఎలా అంటూ లక్ష్మీని ఎత్తుకుని పరిగెత్తుతూ గుడిలోకి చేరుకుని పెట్టె తాళం తెరిచి గేమ్ విన్‌ అవుతారు.మళ్లీ మ్యాడీ, లక్ష్మీ చేతిలో ఓడిపోయినందుకు విక్రమ్ చాలా ఫీల్‌ అవుతాడు. మీ ఇద్దరూ జట్టుకట్టి ఆడితే ఏ గేమ్‌లో అయినా విజయం సాధిస్తారని ప్రొఫెసర్‌ అంటాడు.              విడాకులు కోసం హైదరాబాద్‌ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన కొడుకు,కోడలికి గోపీ వాళ్ల అమ్మ ది‌ష్టి తీస్తుంది. సింధూజాక్షి చిరాకుగా ఉండటంటో ఏం జరిగిందని అడుగుతుంది. ప్రయాణం వల్ల అలసిపోయి ఉంటుందిలే వదిలేయమని గోపీ చెబుతాడు. ఏమైనా విశేషం ఉందా అని అడుగుతుంది వాళ్ల అమ్మ. మా పెళ్లి జరిగి ఎన్నిరోజులు అవుతుంది అప్పుడే విశేషం ఉండటానికి అని గోపీ వాళ్ల అమ్మమీద అరుస్తాడు.అయినా మీరు వెళ్లింది హనీమూన్‌కే కదా ఇంకా అమ్మాయి నెలతప్పలేదా అని అడుగుతుంది.ఎందుకైనా మంచిదని అమ్మాయిని పనులు చేయవద్దని రెస్ట్ తీసుకోమని చెబుతుంది. నెలరోజుల్లో నాకు తీపి కబురు చెప్పాలని కోరుతుంది. మేం వెళ్లింది హనీమూన్‌కు కాదని...విడాకులు తీసుకోవడానికని తెలిస్తే అమ్మ ఏమైపోతుందోనని గోపీ బాధపడిపోతుంటాడు. గదిలోకి వచ్చిన తర్వాత సింధూ గోపీకి వార్నింగ్ ఇస్తుంది.ఇవాళ విడాకుల పేపర్లపై సంతకం పెట్టకుంటే తెల్లారేసరికి మీరు నా శవాన్ని చూస్తారని హెచ్చరిస్తుంది. కొంచెం మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించమని గోపీ చెప్పగా..నాకు ఎవరితో పనిలేదని,నేను ఆస్ట్రేలియా వెళ్లిపోవడమే కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించేస్తుంది.                      అటు విక్రమ్ త్రిష వద్దకు వెళ్లి అసలు లక్ష్మీకి నాపై ఎలాంటి ఫీలింగ్ లేనట్లు ఉందని అంటాడు.అనవసరంగా నేనే భ్రమపడుతున్నానా అని అడుగుతాడు. ఎప్పుడు చూసినా ఆ మ్యాడీ చుట్టూనే తిరుగుతోందని అంటాడు.వాళ్ల ఇంట్లో ఉంటుంది కాబట్టి అతని వెంటే ఉంటుందని త్రిష సర్దిచెబుతుంది. మీరు చూస్తుండండీ ఇక్కడి నుంచి మీరు సంతోషంగానే వెళ్తారని రెచ్చగొడుతుంది.ఇంతలో శ్రీలక్ష్మీ కూడా మ్యాడీ గురించి ఆలోచిస్తుంటుంది.  నిజంగా మధుబాబుకు నాపై లవ్‌ లేకుంటే నాకు సాయంఎందుకు చేస్తాడని అనుకుంటుంది. నన్ను వదిలిపెట్టకుండా నా వెంటే ఎందుకు తిరుగుతున్నాడని అనుకుంటుంది. ఇవాళ ఎలాగైనా నా మనసులో మాట మధుబాబుకు చెప్పాలని ఫిక్స్ అవుతుంది. వెంటనే మ్యాడీతో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది.                       మ్యాడీ, లక్ష్మీవెళ్లడం చూసి విక్రమ్‌,త్రిష కూడా వాళ్ల వెంట వెళ్తారు. అక్కడ  లక్ష్మీ మ్యాడీని పిలిచి మీ కళ్లల్లోకి చూసి నేను మాట్లాడలేకపోతున్నానని....అటు తిరిగి మాట్లాడతానని చెప్పి తన ప్రేమ గురించి మ్యాడీకి చెబుతుంటుంది. ఈసోది వినలేనంటూ మ్యాడీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.సరిగ్గా అప్పుడే త్రిష విక్రమ్‌ను అక్కడికి పంపించి ఫోన్‌లో వీడియో తీస్తుంది. మ్యాడీ అక్కడే ఉన్నాడని అనుకుని లక్ష్మీ మొత్తం చెప్పి ఇటు తిరిగి ఐలయూ చెబుతుంది.అంతే విక్రమ్ ఆనందంతో పొంగిపోగా....లక్ష్మీ భయంతో వణికిపోతుంది.ఇదంతా మీ గురించి కాదని చెప్పబోగా...విక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విషయం మధుబాబుకు చెప్పలేక లక్ష్మీ సతమతమవుతుంటుంది.