Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు  ఒప్పుకున్న మేనల్లుడు మ్యాడీపై ప్రియంవద మండిపడుతుంది. రానురాను నువ్వు ఆ శ్రీలక్ష్మీకి దగ్గరవుతున్నట్లు అనిపిస్తోందని అంటుంది.అసలు దానితో కలిసి నువ్వు డ్యాన్స్ చేయడం ఏంటని నిలదీస్తుంది.ప్రతివిషయంలో దానికి నువ్వు హెల్ఫ్‌ చేస్తున్నావని అంటుంది.అది  ఏచిన్న అవకాశం దొరికినా నీకు దగ్గరవ్వాలని అనుకుంటుందని  హెచ్చరిస్తుంది. ఆ మాటలు విన్న మ్యాడీ....నాకు కూడా ఆ ఎర్రబస్సుతో  డ్యాన్స్ చేయాలని లేదని....కాకపోతే తను కాపాడి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్న వ్యక్తికి ఈ డబ్బులతో చికిత్స చేయించాలని కోరిందని అందుకే కాదనలేకపోయానని అంటాడు. లక్ష్మీకి కూడా  తనతో డ్యాన్స్ చేయాలని ఏమీలేదని....ఆ వ్యక్తి కోసమే ఇదంతా చేస్తోందని చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రియంవద మీరు ఇద్దరు కలిసి నా కొంప కూల్చేలా ఉన్నారని అనుకుంటుంది. అది వైద్యం చేయిస్తుంది ఎవరికో కాదని...నన్ను మోసం చేసి పెళ్లిచేసుకున్న మీ మామయ్యకే అని మనసులో అనుకుంటుంది. నీకుఎన్నో సార్లు హెల్ఫ్‌ చేశాను కదరా...ఈ ఒక్కసారి నాకు హెల్ఫ్ చేసి పుణ్యం కట్టుకోరా అని మనసులో బ్రతిమలాడుకుంటుంది. ఏదీఏమైనా సరే నువ్వు మాత్ర ఆ డ్యాన్స్ కాంపిటేషన్‌లో పాల్గొనడానికి వీల్లేదని అంటుంది. పేర్లు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతే...అందరూ నేను ఓటమికి భయపడి వెనకడుగు వేశానని అనుకుంటారని అంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటానని చెబుతాడు. దీంతో ప్రియంవద త్రిషకు ఫోన్‌ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు  ఆ లక్ష్మీ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో గెలవడానికి వీల్లేదని చెబుతుంది. అదంతా నేను చూసుకుంటానని మీరు నిశ్చింతంగా ఉండండని చెబుతుంది.                         ఫ్రెండ్‌ ఇంట్లో దిగిన గోపాల్ తీరిగ్గా  టీవీ చూస్తుండగా...సింధూజాక్షి వచ్చి అతనిపై మండిపడుతుంది.మనం వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటని అంటుంది.  అసలు లాయర్‌తో మాట్లాడావా అని నిలదీస్తుంది. ఆల్రెడీ మాట్లాడానని కానీ ఓ కేసు విషయంలో  ఊరు వెళ్లారని మూడు, నాలుగు రోజులు వరకు తిరిగి రారని చెప్పారని చెబుతాడు. కాబట్టి మనం తిరిగి ఊరు వెళ్లిపోయి..ఆయన ఉన్నాడోలేడో కనుకున్ని ఈసారి వద్దామని చెబుతాడు. అమ్మో ఆ ఊరు మళ్లీ రానని....మీ అమ్మ పిలిచి పిలుపులు వినడం నావల్ల కాదని సింధూ అంటుంది.కావాలంటే ఇక్కడే  ఉండి లాయర్‌ వచ్చిన తర్వాత  విడాకులు ప్రాసెస్‌ ముగించుకునే వెళ్దామని చెబుతుంది.దీంతో గోపీ సరేనని అంటాడు.                                   తాతయ్య  సంబంధం తీసుకురావడంపై ఐశ్వర్య ఏడుస్తుంది.అప్పుడే  అక్కడికి వచ్చిన వాళ్ల అమ్మానాన్న ఆమెను ఓదార్చుతారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనిఅంటుంది. సుకన్య కూడా  మామయ్యగారికి మీరే చెప్పండని....ఇప్పుడు అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి దాని చదువు పూర్తయిన తర్వాత చేద్దామని అంటుంది. నాన్న ఒక్కసారి డిసైడ్‌ అయ్యారంటే మళ్లీ వెనక్కి రారని...కాబట్టి ఈపెళ్లికి సిద్ధం అవ్వాలని కూతురుకు చెబుతాడు. అయినా అది ఎంతో మంచి సంబంధం అయితేనే నాన్న నిర్ణయం తీసుకుంటారని అంటాడు.నాన్న మాటను నేను గౌరవిస్తున్నాను మీరు కూడా గౌరవించుకుని పెళ్లిచూపులకు రెడీ అవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. ఏడుస్తున్న కూతురిని  ఓదార్చిన సుకన్న...ఇప్పుడు జరిగేవి కేవలం పెళ్లిచూపులు మాత్రమేనని....పెళ్లి అప్పటికీ ఎదో ఒకటిచేసి ఆపించేద్దామని చెబుతుంది.అటు కాలేజీకి వెళ్లిన మ్యాడీ,శ్రీలక్ష్మీ డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన త్రిష,విక్రమ్‌కూడా చేస్తారు. లక్ష్మీ డ్యాన్స్ చూసి నవ్వుకున్న త్రిష నువ్వు ఈ పోటీలో ఓడిపోవడం ఖాయమంటూ గేలి చేస్తుంది.